ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ నుంచి విడుదవుతున్న రేడియోధార్మికత వల్ల ఆ ప్లాంట్ ప్రాంగణంలోని నిల్వ చేసిన నీరు విషతుల్యంగా మారిందని జపాన్లోని అటామిక్ రెగ్యులేటరీ అండ్ అపరేటర్ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్థానిక పత్రిక మంగళవారం వెల్లడించింది. ట్యాంక్లోని ఆ నీరు సోమవారం ఉదయం నుంచి లీక్ అవుతుందని ప్లాంట్ ఉద్యోగులు వెల్లడిచారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ నీటిని డ్రైనేజి వ్యవస్థ ద్వారా పసిఫిక్ సముద్రంలోకి విడుదల చేయాలని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (టీఈపీసీఓ) భావిస్తునట్లు చెప్పింది.
ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో రేడియోధార్మికత విడుదల అవుతున్న సందర్భాలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. అదీకాక 2011 మార్చిలో జపాన్లో సంభవించిన సునామీ, భూకంపం వల్ల ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్లో పేలుళ్లు సంభవించాయి. ఆ ఘటనతో ఆ ప్రాంతం నుంచి ఎంతో మంది స్థానికులు ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. అయితే దీంతో టీఈపీసీఓ ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది.
ఫుకోషిమా న్యూక్లియర్ ప్లాంట్ నుంచి విడులవుతున్న రేడియోధార్మికత వల్ల ప్లాంట్ ప్రాంగణంలోని నీటి నిల్వలు విష తుల్యంగా మారాయని అటామిక్ రెగ్యులేటరీ అండ్ అపరేటర్ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ నీటిలో 50 సెంటీ మీటర్ల స్థాయి వరకు ఆ రేడియోధార్మితక వ్యాపించి ఉందని తెలిపింది. ఆ ప్లాంట్ నుంచి గంటకు 100 మిల్లిసివర్ట్స్ రేడియోధార్మికత విడుదలవుతోందని పేర్కొంది. దీంతో 120 లీటర్ల నీటి నిల్వలను పసిఫిక్ సముద్రంలోకి వదలాలని టీఈపీసీఓ భావిస్తుంది.