funds are wasted
-
పూలే జయంతి ‘నిధుల దుర్వినియోగం’పై నివేదికివ్వండి
సాక్షి, హైదరాబాద్: జ్యోతిరావు పూలే జయంతి వేడుకల దుర్వినియోగ అభియోగాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిధుల దుర్వినియోగం రిట్లో కౌంటర్ దాఖలు చేయాలని గత జనవరిలో హైకోర్టు నోటీసులు జారీ చేస్తే నాలుగు నెలలైనా ఇప్పటివరకూ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. కౌంటర్ దాఖలుతోపాటు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి/కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 15కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రంలో పూలే జయంతి వేడుకల నిర్వహణకు బీసీ సంక్షేమ శాఖ రూ.11.25 లక్షలు మంజూరు చేస్తే హైదరాబాద్‌లో చేసిన ఖర్చులో సుమారు 70 శాతం వరకు దుర్వినియోగం అయిందని ఆరోపిస్తూ హైదరాబాద్‌కు చెందిన శివుపల్లి రాజేశం పిల్ దాఖలు చేశారు. 18 నుంచి అన్ని కేసులనూ విచారించనున్న హైకోర్టు లాక్డౌన్ కారణంగా అత్యవసర కేసుల్ని మాత్రమే విచారిస్తున్న హైకోర్టు ఈ నెల 18వ తేదీ సోమవారం నుంచి అన్ని రకాల కేసులనూ విచారించాలని నిర్ణయించింది. రిట్లు, క్రిమినల్, సివిల్ కేసులను ఆన్లైన్లో ఏ విధంగా దాఖలు చేయాలో హైకోర్టు వెబ్సైట్లో వివరాలను పొందుపర్చినట్లు రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు. -
కొల్లేరు.. కన్నీరు
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొల్లేరు మంచినీటి సరస్సు అంపశయ్యపై ఉంది. సరస్సు మనుగడ పూర్తిగా కోల్పోయింది. కొల్లేరును అభివృద్ధి చేస్తామని వాగ్దానాలు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వైపే చూడటంలేదు. అరకొర నిధుల కేటాయింపుతో ఎప్పటికప్పుడుపబ్బం గడుపుకుంటున్నాయి. ఆకివీడు : ఎన్నికల ముందు కొల్లేరు ప్రాంతాన్ని రక్షిస్తామని, సరస్సు మనుగడను కాపాడతామని ప్రగల్భాలు పలికిన నాయకులు అనంతరం దాని ఊసే ఎత్తకపోవడం దారుణం. మూడవ కాంటూర్ వరకూ అయినా సరస్సును కాపాడతారని భావించిన పర్యాటకులకు నిరాశే మిగిలింది. 2004కి ముందు కొల్లేరు సరస్సు ఏ విధంగా ఆక్రమణలకు గురై చేపల చెరువులు తవ్వారో అదే పరిస్థితి నేడు దాపురించింది. బడా కంపెనీలు, పెత్తందార్లు, అధికార పార్టీ నాయకులు కొల్లేరును దోచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సరస్సులోకి చొచ్చుకువచ్చే కాలువలు : కొల్లేరు సరస్సులోకి రెండు జిల్లాల నుండి సుమారు 120 పంట, మురుగు కాల్వల నుంచి నీరు చొచ్చుకువస్తుంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరులతో పాటు వివిధ కాలువల నుంచి నీరు వస్తుంది. కృష్ణా, పశ్చిమ డెల్టాలకు చెందిన ఆయకట్టు నీరు కూడా కొల్లేరులోకే చొచ్చుకువస్తుంది. కొల్లేరు నుండి సుమారు 22 వేల క్యూసెక్కుల నీరు ఉప్పుటేరు ద్వారా బంగాళాఖాతంలో కలుస్తుంది. అడ్రస్సులేని ఐదో కాంటూర్ ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణా కేంద్రంగా కొల్లేరు సరస్సులోని ఐదవ కాంటూర్ వరకూ భూమిని సేకరించి హద్దులు వేసింది. జీపీఎస్ సర్వే చేసి ఆన్లైన్లో పొందుపరిచారు. ఐదో కాంటూర్ వరకూ కొల్లేరు రక్షణకు 2005లో రూ.120 కోట్లు వెచ్చించారు. అప్పటి నుండి కొల్లేరు అభయారణ్యం పరిరక్షణకు ప్రభుత్వం ఏటా మూడు నుండి పది కోట్లు వెచ్చిస్తూ వస్తోంది. అభయారణ్యం పరి«ధిలో ఇంత వరకూ 550కి పైగా కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ కాంటూర్‌లోని ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతూనే ఉన్నాయని పలువురు పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానరాని చిత్తడి నేలలు చట్టం దేశంలోని 25 ప్రముఖ సరస్సుల నియంత్రణ బాధ్యతలను కేంద్రం తీసుకుంటూ చిత్తడి నేలల పరిరక్షణ నిర్వహణా నిబంధనలు–2009 పేరుతో కొత్త చట్టం తీసుకువచ్చింది. చట్ట పరిధిలోకి కొల్లేరు సరస్సును కూడా తీసుకువచ్చి చిత్తడి నేలల్ని మెట్ట భూములుగా మార్చడాన్ని పూర్తిగా నిషేధించింది. కేంద్ర పర్యావరణం, అటవీశాఖ 1989లో విడుదల చేసిన మూడు ఉత్తర్వుల్లో పొందుపరచిన విధంగా ప్రమాదకర వ్యర్థాలను కొల్లేరులో తయారుచేయడం, నిల్వ ఉంచడం, పారవేయడం నిషేధించారు. డ్రెయిన్ల నీరు, పరిశ్రమల వ్యర్థాలు, కలుషితనీరు, ఇతర వ్యర్థాలను సరస్సులోకి వదలకూడదు. అయితే అందుకు విరుద్ధంగా కొల్లేరు సరస్సును డంపింగ్ కేంద్రంగా మార్చివేశారు. పరిశ్రమల రసాయనిక వ్యర్థాలు, పట్టణాలు, నగరాల నుండి కొల్లేరులోకి చొచ్చుకు వస్తున్నాయి. శాశ్వత నిర్మాణాలు కూడా జరిగిపోతున్నాయి. పరిశ్రమల స్థాపన కొనసాగుతోంది. ఐదవ కాంటూర్ భూముల్ని పూడ్చివేస్తున్నా అభయారణ్యం పరిరక్షించాల్సిన అధికారులు అడ్రస్సులేరని పలువురు ఆరోపిస్తున్నారు. రెగ్యులేటర్ల నిర్మాణం హుళ్లక్కే? కొల్లేరు సరస్సు పరిరక్షణకు ఉప్పుటేరుపై మూడు రెగ్యులేటర్లు నిర్మించాలని 1964లోనే మిత్రా కమిటీ సూచించింది. ఆ ప్రకారంగా ఆకివీడులోని రైల్వే వంతెన సమీపంలో జువ్వ కనుమ వద్ద ఒకటి, సముద్రం ముఖద్వారం వద్ద, ఉప్పుటేరు క్రాస్‌బండ వద్ద మరొకటి నిర్మించాలని నిర్ణయించారు. దీనిపై ప్రభుత్వం అనేకమార్లు నిపుణుల కమిటీలను నియమించి నివేదికలు సేకరించినా రెగ్యులేటర్ల ఊసేలేదు. సరస్సు భౌగోళిక స్వరూరం పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల సరిహద్దులో çసహజసిద్ధంగా వెలసిన కొల్లేరు సరస్సు 340 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సరస్సు లోతు రెండు మీటర్లు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 7 మండలాలు, కృష్ణా జిల్లాకు చెందిన 2 మండలాలు కలిపి మొత్తంగా 122 గ్రామాలు కొల్లేరు పరిధిలో ఉన్నాయి. ఆయా గ్రామాల్లో 3.20 లక్షల మంది జనాభా (80 వేల కుటుంబాలు) ఉంది. ప్రస్తుతం యాభై శాతం మంది జనాభా వలస వెళ్లిపోయారు. కొల్లేరు ప్రక్షాళన అనంతరం సరస్సును 77,138 ఎకరాలకు కుదించారు. దీనిలో 19,000 ఎకరాలు జిరాయితీ ఉంది. మూడవ కాంటూర్‌కు కుదించాలి కొల్లేరు సరస్సును మూడవ కాంటూర్ వరకూ కుదించి సరస్సును అభివద్ధి చేయాలి. ఐదవ కాంటూర్ వరకూ సరస్సు ఉన్నప్పటికీ అభివద్ధి చేయకపోవడంతో నిరుపయోగంగా ఆక్రమణలకు గురవుతోంది. సరస్సును పరిరక్షించి, కొల్లేటి ప్రజలను ఆర్థికంగా ఆదుకోవాలి. – కొల్లి రాంబాబు, గ్రామ పెద్ద, కొల్లేటికోట గ్రామం రెగ్యులేటర్ నిర్మించాలి కొల్లేరు సరస్సు కిక్కిసతో నిండిపోయింది. సరస్సు అభివృద్ధికి నిధులు ఇవ్వడంలేదు. సరస్సు ప్రక్షాళన తరువాత 50 శాతం ప్రజలు వలస వెళ్లిపోయారు. కొల్లేరు ప్రజలకు రాయితీలు లేవు, వ్యవసాయం లేదు. వేట లేదు. అభివద్ధి చేయాలి, లేకుంటే ప్రజలకు ఇవ్వాలి. – జుల్లూరి రాజు, గ్రామపెద్ద, పందిరిపల్లిగూడెం -
సమాచారం దాచడానికి ప్రజాధనం వృథా!
సమాచార హక్కు చట్టం కింద సమాచారం పొందడానికి పంపుతున్న రూ.10ల పోస్టల్ ఆర్డర్‌ను సరిగా తీసుకోలేదని తిప్పి పంపించడంతో ప్రభుత్వానికి రెట్టింపు ఖర్చవుతోంది. ఇలా ప్రజాధనాన్ని వృథా చేయడం, దరఖాస్తుదారును వేధించడం కాకుండా చట్టాలను అమలు చేయడానికి వీలయిన వాతావరణం కల్పించవలసి ఉంది. సమాచార హక్కు చట్టంలో సమాచారం కోరుకుని తీసుకునే హక్కు ఉందన్న మాటే గాని ఆ అభ్యర్థన ఇవ్వడం, దానితోపా టు పది రూపాయల ఫీజు చెల్లిం చడం ఒక పెద్ద సమస్యగా మారి పోయింది. రూ.10ల కోసం అధికారులు వందల రూపాయ లు ఖర్చు చేస్తున్నారు. ప్రజాస మయం, ప్రభుత్వ ధనం, పాలనా సమయాన్ని వృథా చేస్తున్నారు. ఆరో తరగతిలో పంజాబీ భాషను మూడో భాషగా ఎన్ని పాఠశాలల్లో ప్రవే శపెట్టారో చెప్పాలని, ఇతర వివరాలను కూడా ఇవ్వాలని రఘుబీర్ సింగ్ కోరారు. కాని ఈ మామూలు సమాచా రాన్ని ఇవ్వకుండా ఒకటో అప్పీలుకు, రెండో అప్పీలుకు కూడా పంపించారు అధికారులు. సమాచారం ఇవ్వని అధి కారిపైన జరిమానా విధించాలని ఆయన కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. రఘుబీర్ సింగ్ సమాచార హక్కు చట్టం రావడానికి పోరాడిన వారిలో ఒకరు. చట్టం రూపకల్పన లో కూడా ఆయన పాత్ర ఉంది. కానీ ఈ చిన్న సమాచారం కూడా ఇవ్వకపోయే సరికి ఆయనకు నిరాశ కలిగింది. మనం సాధించిందేమిటని ప్రశ్నించారాయన. పది రూపా యల పోస్టల్ ఆర్డర్ అకౌంట్స్ ఆఫీసర్ పేరు మీద తీసుకు న్నారు. అదే సరైన విధానమని ఉద్యోగ శిక్షణా శాఖ నియ మాలు కూడా వివరిస్తున్నాయి. కాని ఆ పోస్టల్ ఆర్డర్ సరిగ్గా తీసుకోలేదంటూ అధికారి తిరిగి పంపారు. అదీ స్పీడు పోస్ట్‌లో. దానికి పాతిక రూపాయలు ఖర్చు చేశాడ తను. సుభాష్ చంద్ర అగర్వాల్ కేసులో కేంద్ర సమాచార కమిషన్ 2013 ఆగస్టులో సెక్షన్ 25(5) కింద ఒక సిఫా రసు చేసింది. పోస్టల్ ఆర్డర్‌ను అకౌంట్స్ ఆఫీసర్ పేరు మీద తీసుకుంటే వాటిని ఆమోదించాలని, తిరస్కరించకూ డదని కోరింది. పబ్లిక్ అథారిటీలన్నీ ఈ నియమాన్ని పా టించాలని డీఓపీటీ శాఖ ఆదేశించాలని కూడా కోరింది. 2007లో పోస్టల్ శాఖ ఆర్టీఐ దరఖాస్తులను ఇక్కడ తీసుకుంటామని పోస్టాఫీసులన్నీ ప్రదర్శించాలని, అదే కౌంటర్లో ఫీజు కూడా తీసుకోవాలని, అక్కడే అందరు సీపీఐఓల పేర్లు ప్రదర్శించాలని, 25,464 పోస్టాఫీసులు ఆర్టీఐ దరఖాస్తులు తీసుకునే ఏర్పాట్లు చేయాలని సమా చార కమిషన్ ప్రతిపాదించింది. కానీ పది రూపాయల ఆర్టీఐ స్టాంపులను ముద్రించడం సరైన ఆలోచన అనీ పోస్టల్ శాఖ వారు దీన్ని పరిశీలించాలని కమిషన్ ఆ తీరు్పులో కోరింది. రూ.10ల పోస్టల్ ఆర్డర్ అకౌంట్స్ ఆఫీ సర్ పేరు మీద తీసుకున్న తరువాత దాన్ని పాటించక పోవడం సమాచార హక్కు చట్టం ఉల్లంఘన అవుతుందని రఘుబీర్ కేసులో వివరించడమైనది. లోపమున్నా లేక పోయినా రూ.10ల పోస్టల్ ఆర్డర్‌ను ఆమోదించకపోతే చట్టంకింద చర్యలు తీసుకోవలసి వస్తుంది. కాని ఆ పోస్టల్ ఆర్డర్‌ను ఆమోదించడానికి బదులు, తిరస్కరించి ఆ రూ. 10లను వదులుకోవడమే కాకుండా, దాన్ని తిప్పి పంపడా నికి ఒక ఉత్తరం రాయడం, దానికి ఒక కవరు తయారు చేయడం, 25 లేదా 30 రూపాయల స్టాంపులు పెట్టడం, మొత్తం ఈ పనిచేయడానికి గంటో రెండు గంటలో వెచ్చిం చడం అంతే వృథా. దరఖాస్తుదారుడు కూడా పది రూపా యల స్టాంపు కొనడానికి అంత సొమ్ము మళ్లీ ఖర్చు చేయ వలసి వస్తుంది. ఆ పోస్టల్ ఆర్డర్‌ను ఆమోదిస్తే పది రూపా యలు దక్కుతుంది. లేదా ఆ పది రూపాయలతోపాటు యాభై రూపాయల ఖర్చు అవుతుంది. సమాచారం అడి గిన ప్రతిసారీ 50 రూపాయల ప్రజాధనం వృథా చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించాలి. అంతేకాకుండా పీఐఓ దీన్ని నిరాకరించడం ద్వారా తన అధికారాన్ని దుర్వి నియోగం చేస్తున్నట్టు అవుతుంది. దరఖాస్తుదారుడిని వేధించడం కూడా అవుతుంది. మరోవైపు సమాచార చట్టంలో నిపుణుడు, న్యాయ వాది అయిన ఆర్కే జైన్ సెకండ్ అప్పీల్‌ను డిసెంబర్ 5న సమాచార కమిషనర్ బసంత్ సేఠ్ విన్నారు. పోస్టల్ శాఖ ప్రధాన సమాచార అధికారి తమ శాఖ ప్రతిపాదన గురిం చి వివరించారు. ఈ సమస్యను అధ్యయనం చేయడం కోసం ఒక నిపుణుల కమిటీని నియమించారు. 31.1. 2014న మామూలు పోస్టల్ స్టాంపులనే ఆర్టీఐ ఫీజుగా అనుమతించాలని వారు సూచించారు. ఈ ప్రతిపాదనను సమాచార కమిషనర్ ఆమోదించారు. దాన్ని పరిశీలించా లని ప్రభుత్వానికి సూచించారు. ఆ సూత్రం ప్రయోజనక రమని ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనను వెంటనే పరిగణించి ఆమోదించే ప్రయత్నం చేయాలని ఈ కమిషనర్ కూడా రఘువీర్ సింగ్ కేసులో సిఫార్సు చేశారు. విద్యాశాఖలో పీఐఓలు ఈ సంవత్సరం జనవరి 2014 నుంచి డిసెంబర్ 10 వరకు ఎన్ని పోస్టల్ ఆర్డర్లను తిరస్కరించారో అందుకు కారణాలేమిటో వివరించాలని, ఆ సమాచారం ఈ ఉత్తర్వు అందిన పదిహేను రోజుల్లో ఇవ్వాలని ఆదేశించారు. ఈ కేసులో అన్యాయంగా పోస్టల్ ఆర్డర్‌ను తిరస్కరించినందుకు, సమాచార హక్కు దరఖా స్తుదారుడిని వేధించినందుకు జరిమానా ఎందుకు విధించ కూడదో వివరించాలని కూడా పీఐఓకు నోటీసు జారీచేయ డమైనది. విద్యాశాఖ వెబ్‌సైట్‌ను ఉపయుక్తంగా మార్చా లని, తాజా సమాచారం చేర్చాలని కూడా ఆదేశించారు. ఒకవేళ పోస్టల్ ఆర్డర్లో పొరబాటు ఉన్నా సరే దాన్ని తిర స్కరించకూడదని, అందుకు 50 రూపాయలు వెచ్చించడం ఇకపై చేయకూడదని కూడా ఆదేశించారు. సమాచార హక్కు అమలు చేయడానికి కావలసిన ఆచరణాత్మకమైన వ్యవస్థను రూపొందించడం ఆ చట్టం లక్ష్యమని గుర్తు చేయవలసి వచ్చింది. దీని ప్రకారం చట్టాలను అమలు చేయడానికి వీలయిన వాతావరణం కల్పించవలసి ఉంది. (డిసెంబర్ 11, 2014న రఘుబీర్ సింగ్ కేసులో ఇచ్చిన తీర్పు ఆధారంగా) (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com - డా॥మాడభూషి శ్రీధర్