సమాచారం దాచడానికి ప్రజాధనం వృథా! | People money wasted to hide the Right to Information | Sakshi
Sakshi News home page

సమాచారం దాచడానికి ప్రజాధనం వృథా!

Published Fri, Jan 2 2015 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM

సమాచారం దాచడానికి ప్రజాధనం వృథా!

సమాచారం దాచడానికి ప్రజాధనం వృథా!

సమాచార హక్కు చట్టం కింద సమాచారం పొందడానికి పంపుతున్న రూ.10ల పోస్టల్ ఆర్డర్‌ను సరిగా తీసుకోలేదని తిప్పి పంపించడంతో ప్రభుత్వానికి రెట్టింపు ఖర్చవుతోంది. ఇలా ప్రజాధనాన్ని వృథా చేయడం, దరఖాస్తుదారును వేధించడం కాకుండా చట్టాలను అమలు చేయడానికి వీలయిన వాతావరణం కల్పించవలసి ఉంది.
 
 సమాచార హక్కు చట్టంలో సమాచారం కోరుకుని తీసుకునే హక్కు ఉందన్న మాటే గాని ఆ అభ్యర్థన ఇవ్వడం, దానితోపా టు పది రూపాయల ఫీజు చెల్లిం చడం ఒక పెద్ద సమస్యగా మారి పోయింది. రూ.10ల కోసం అధికారులు వందల రూపాయ లు ఖర్చు చేస్తున్నారు. ప్రజాస మయం, ప్రభుత్వ ధనం, పాలనా సమయాన్ని వృథా చేస్తున్నారు. ఆరో తరగతిలో పంజాబీ భాషను మూడో భాషగా ఎన్ని పాఠశాలల్లో ప్రవే శపెట్టారో చెప్పాలని, ఇతర వివరాలను కూడా ఇవ్వాలని రఘుబీర్ సింగ్ కోరారు. కాని ఈ మామూలు సమాచా రాన్ని ఇవ్వకుండా ఒకటో అప్పీలుకు, రెండో అప్పీలుకు కూడా పంపించారు అధికారులు. సమాచారం ఇవ్వని అధి కారిపైన జరిమానా విధించాలని ఆయన కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. రఘుబీర్ సింగ్ సమాచార హక్కు చట్టం రావడానికి పోరాడిన వారిలో ఒకరు.
 
 చట్టం రూపకల్పన లో కూడా ఆయన పాత్ర ఉంది. కానీ ఈ చిన్న సమాచారం కూడా ఇవ్వకపోయే సరికి ఆయనకు నిరాశ కలిగింది. మనం సాధించిందేమిటని ప్రశ్నించారాయన. పది రూపా యల పోస్టల్ ఆర్డర్ అకౌంట్స్ ఆఫీసర్ పేరు మీద తీసుకు న్నారు. అదే సరైన విధానమని ఉద్యోగ శిక్షణా శాఖ నియ మాలు కూడా వివరిస్తున్నాయి. కాని ఆ పోస్టల్ ఆర్డర్ సరిగ్గా తీసుకోలేదంటూ అధికారి తిరిగి పంపారు. అదీ స్పీడు పోస్ట్‌లో. దానికి పాతిక రూపాయలు ఖర్చు చేశాడ తను. సుభాష్ చంద్ర అగర్వాల్ కేసులో కేంద్ర సమాచార కమిషన్ 2013 ఆగస్టులో సెక్షన్ 25(5) కింద ఒక సిఫా రసు చేసింది. పోస్టల్ ఆర్డర్‌ను అకౌంట్స్ ఆఫీసర్ పేరు మీద తీసుకుంటే వాటిని ఆమోదించాలని, తిరస్కరించకూ డదని కోరింది. పబ్లిక్ అథారిటీలన్నీ ఈ నియమాన్ని పా టించాలని డీఓపీటీ శాఖ ఆదేశించాలని కూడా కోరింది.
 
 2007లో పోస్టల్ శాఖ ఆర్టీఐ దరఖాస్తులను ఇక్కడ తీసుకుంటామని పోస్టాఫీసులన్నీ ప్రదర్శించాలని, అదే కౌంటర్‌లో ఫీజు కూడా తీసుకోవాలని, అక్కడే అందరు సీపీఐఓల పేర్లు ప్రదర్శించాలని, 25,464 పోస్టాఫీసులు ఆర్టీఐ దరఖాస్తులు తీసుకునే ఏర్పాట్లు  చేయాలని సమా చార కమిషన్ ప్రతిపాదించింది.  కానీ పది రూపాయల ఆర్టీఐ స్టాంపులను ముద్రించడం సరైన ఆలోచన అనీ పోస్టల్ శాఖ వారు దీన్ని పరిశీలించాలని కమిషన్ ఆ తీరు్పులో కోరింది. రూ.10ల పోస్టల్ ఆర్డర్ అకౌంట్స్ ఆఫీ సర్ పేరు మీద తీసుకున్న తరువాత దాన్ని పాటించక పోవడం సమాచార హక్కు చట్టం ఉల్లంఘన అవుతుందని రఘుబీర్ కేసులో వివరించడమైనది. లోపమున్నా లేక పోయినా రూ.10ల పోస్టల్ ఆర్డర్‌ను ఆమోదించకపోతే చట్టంకింద చర్యలు తీసుకోవలసి వస్తుంది.
 
  కాని ఆ పోస్టల్ ఆర్డర్‌ను ఆమోదించడానికి బదులు, తిరస్కరించి ఆ రూ. 10లను వదులుకోవడమే కాకుండా, దాన్ని తిప్పి పంపడా నికి ఒక ఉత్తరం రాయడం, దానికి ఒక కవరు తయారు చేయడం, 25 లేదా 30 రూపాయల స్టాంపులు పెట్టడం, మొత్తం ఈ పనిచేయడానికి గంటో రెండు గంటలో వెచ్చిం చడం అంతే వృథా. దరఖాస్తుదారుడు కూడా పది రూపా యల స్టాంపు కొనడానికి అంత సొమ్ము మళ్లీ ఖర్చు చేయ వలసి వస్తుంది. ఆ పోస్టల్ ఆర్డర్‌ను ఆమోదిస్తే పది రూపా యలు దక్కుతుంది. లేదా ఆ పది రూపాయలతోపాటు యాభై రూపాయల ఖర్చు అవుతుంది. సమాచారం అడి గిన ప్రతిసారీ 50 రూపాయల ప్రజాధనం వృథా చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించాలి. అంతేకాకుండా పీఐఓ దీన్ని నిరాకరించడం ద్వారా తన అధికారాన్ని దుర్వి నియోగం చేస్తున్నట్టు అవుతుంది. దరఖాస్తుదారుడిని వేధించడం కూడా అవుతుంది.
 
 మరోవైపు సమాచార చట్టంలో నిపుణుడు, న్యాయ వాది అయిన ఆర్‌కే జైన్ సెకండ్ అప్పీల్‌ను డిసెంబర్ 5న సమాచార కమిషనర్ బసంత్ సేఠ్ విన్నారు. పోస్టల్ శాఖ ప్రధాన సమాచార అధికారి తమ శాఖ ప్రతిపాదన గురిం చి వివరించారు. ఈ సమస్యను అధ్యయనం చేయడం కోసం ఒక నిపుణుల కమిటీని నియమించారు. 31.1. 2014న మామూలు పోస్టల్ స్టాంపులనే ఆర్టీఐ ఫీజుగా అనుమతించాలని వారు సూచించారు. ఈ ప్రతిపాదనను సమాచార కమిషనర్ ఆమోదించారు. దాన్ని పరిశీలించా లని ప్రభుత్వానికి సూచించారు. ఆ సూత్రం ప్రయోజనక రమని ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనను వెంటనే పరిగణించి ఆమోదించే ప్రయత్నం చేయాలని ఈ కమిషనర్ కూడా రఘువీర్ సింగ్ కేసులో సిఫార్సు చేశారు.
 
 విద్యాశాఖలో పీఐఓలు ఈ సంవత్సరం జనవరి 2014 నుంచి డిసెంబర్ 10 వరకు ఎన్ని పోస్టల్ ఆర్డర్లను తిరస్కరించారో అందుకు కారణాలేమిటో వివరించాలని, ఆ సమాచారం ఈ ఉత్తర్వు అందిన పదిహేను రోజుల్లో ఇవ్వాలని ఆదేశించారు. ఈ కేసులో అన్యాయంగా పోస్టల్ ఆర్డర్‌ను తిరస్కరించినందుకు, సమాచార హక్కు  దరఖా స్తుదారుడిని వేధించినందుకు జరిమానా ఎందుకు విధించ కూడదో వివరించాలని కూడా పీఐఓకు నోటీసు జారీచేయ డమైనది. విద్యాశాఖ వెబ్‌సైట్‌ను ఉపయుక్తంగా మార్చా లని, తాజా సమాచారం చేర్చాలని కూడా ఆదేశించారు. ఒకవేళ పోస్టల్ ఆర్డర్‌లో పొరబాటు ఉన్నా సరే దాన్ని తిర స్కరించకూడదని, అందుకు 50 రూపాయలు వెచ్చించడం ఇకపై చేయకూడదని కూడా ఆదేశించారు. సమాచార హక్కు అమలు చేయడానికి కావలసిన ఆచరణాత్మకమైన వ్యవస్థను రూపొందించడం ఆ చట్టం లక్ష్యమని గుర్తు చేయవలసి వచ్చింది. దీని ప్రకారం చట్టాలను అమలు చేయడానికి వీలయిన వాతావరణం కల్పించవలసి ఉంది.
  (డిసెంబర్ 11, 2014న రఘుబీర్ సింగ్ కేసులో ఇచ్చిన తీర్పు ఆధారంగా)
 (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
 professorsridhar@gmail.com
 - డా॥మాడభూషి శ్రీధర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement