future needs
-
నగరాలకు నయా లుక్..! ఎన్‌ఎంఎస్‌హెచ్ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు
సాక్షి, అమరావతి: రానున్న ఎనిమిదేళ్లలో దేశంలోని పట్టణాల రూపురేఖలను సమూలంగా మార్చాలని అందుకు అవసరమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణ ప్రణాళికలో మార్పులు చేయాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘నేషనల్ మిషన్ ఆన్ సస్టెయినబుల్ హబిటాట్–2021–30’ రిపోర్టులో పట్టణ ప్రణాళికలపై పలు ఆసక్తికరమైన వివరాలను పొందుపరిచింది. ‘స్మార్ట్ సిటీస్ మిషన్’ నివేదిక ప్రకారం 2030 నాటికి దేశంలోని పట్టణాల్లో నివసించే జనాభా 40% కంటే అధికంగా పెరుగుతుందని.. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 75 శాతం పట్టణాల నుంచే వస్తుందని అంచనా వేసింది. చదవండి: ఇల్లు చూపి ఇల్లాలిని చేసుకునే ఓ ‘పిట్ట’ కథ ఫలితంగా ఇక్కడి నుంచి వాతావరణానికి హానిచేసే ‘గ్రీన్హౌస్ వాయువులు’ కూడా అధికంగా ఉత్పత్తయ్యే అవకాశముందని, ఈ ప్రభావాన్ని తట్టుకునేందుకు నగర, పట్టణాల మాస్టర్ ప్లాన్లు అవసరమని పేర్కొంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రణాళిక విభాగం ఇప్పటికే ఈ తరహా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధంచేసి, అమలుచేస్తుండడం గమనార్హం. 2,843 నగరాలకే సరైన మాస్టర్ ప్లాన్ దేశంలో జూలై 2019 నాటికి 7,933 నగరాలు, పట్టణాలు ఉండగా, వాటిలో 2,843 వాటికి మాత్రమే చట్టబద్ధమైన మాస్టర్ ప్లాన్లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. జోనల్ డెవలప్మెంట్ ప్లాన్లు, లోకల్ ఏరియా ప్లాన్లు, లేఅవుట్ ప్లాన్లు సైతం సక్రమం గాలేవని, చాలా నగరాలు, పట్టణాలకు సరైన ప్రణాళిక లేకపోవడంతో పాటు, ఉన్నవాటిపై కూడా ఏళ్ల తరబడి సమీక్షలు చేయలేదని వివరించింది. దీంతో పెరుగుతున్న జనాభాకు అనుగు ణంగా వసతులు సమకూర్చడం పట్టణ స్థానిక సంస్థలకు కష్టతరంగా మారుతోందని ఆందోళన వ్యక్తంచేసింది. దీంతోపాటు జనాభా, నివాసాలపై సరైన డేటా లేకపోవడం కూడా మౌలిక సదుపాయాల కల్పనకు ఆటంకంగా మారిందని పేర్కొంది. వీటిని అధిగమించేందుకు ఆధునిక పద్ధతుల్లో పట్టణ ప్రణాళికలు రూపొందించి అమలుచేసి 2030 నాటికి పూర్తిచేయగలిగితే వాతావరణ మార్పులవల్ల తలెత్తే ఉపద్రవాలను సమర్థంగా ఎదుర్కోవచ్చని సూచించింది. అందుకోసం పట్టణ ప్రణాళికలకు సంబంధించి పూర్తి భౌగోళిక సమాచారం (జీఐఎస్), రిమోట్ సెన్సింగ్ పద్ధతులను అనుసరించాలని ఆ నివేదిక సూచించింది. దీనిద్వారా ఆయా పట్టణాల్లోని చెరువులు, నీటి కొలనులు, రోడ్లు, కాలువలతో పాటు బహిరంగ ప్రదేశాలను మెరుగ్గా గుర్తించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ఆక్రమణలను గుర్తించి సమర్థంగా అడ్డుకోవచ్చని వివరించింది. పచ్చదనానికి ప్రాధాన్యం ఇక పట్టణాలను భయపెడుతున్న వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆయా ప్రాంతాల్లో పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడు గ్రీన్హౌస్ వాయువులను నియంత్రించగలమని ‘నేషనల్ మిషన్ ఆన్ సస్టెయినబుల్ హబిటాట్–2021–30’ నివేదిక పేర్కొంది. సాధ్యమైనంత మేర గ్రీన్ జోన్లను అభివృద్ధి చేసినట్లయితే మైక్రో క్లైమేట్ నియంత్రణలో ఉంటుందని, అందువల్ల అన్ని నగరాలు తమ సామర్థ్యం మేరకు మార్పులు తీసుకురావాలని సూచించింది. పైగా అత్యవసర పరిస్థితుల్లో సహాయ కార్యకలాపాల కోసం క్విక్ రెస్పాన్స్ మెకానిజాన్ని అందుబాటులో ఉంచుకోవాలని కోరింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఈ తరహా ఏర్పాట్లుచేసింది. ముఖ్యంగా అన్ని పట్టణాల్లోను పచ్చదనం అభివృద్ధి చేసేందుకు ‘జగనన్న గ్రీన్‌సిటీ చాలెంజ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించి తొలివిడతలో 45 పట్టణాల్లో అమలు చేస్తున్నారు. అలాగే, వరదలవల్ల వచ్చే నష్టాన్ని తగ్గించేందుకు, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు స్పాంజీ సిటీల నిర్మాణానికి సంకల్పించింది. మరోవైపు.. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర పట్టణ సర్వే పూర్తయితే, రాష్ట్రంలోని మొత్తం 123 యూఎల్బీల్లోని జనాభా, నివాసాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, చెరువులు, కాలువలు, రోడ్లతో సహా సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తుందని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు చెబుతున్నారు. పణాళికలో మార్పులు తప్పదన్న ‘ఎస్సీఎం’ ♦మరోవైపు.. ప్రజలకు సౌకర్యవంతమైన స్థిరమైన జీవనం గడిపేందుకు పట్టణ ప్రణాళికలో కీలకమైన పలు మార్పులు అవసరమని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ♦పరిధిలోని ‘స్మార్ట్ సిటీస్ మిషన్’ సూచించింది. ఇందులో గ్రీన్ కవర్, జీవవైవిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. అలాగే.. ♦ఆయా పట్టణాల్లోని ఎకో–సెన్సిటివ్ జోన్లను మ్యాపింగ్ చేయాలని, హాట్స్పాట్లు, నగరంలోని సహజ వనరులు సహా నీటి వనరులు, వాటి పరీవాహక ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలు వంటి అన్ని రకాల ప్రాం తాలను డిజిటలైజేషన్ చేయాలని సూచించింది. ♦విపత్తులు సంభవించినప్పుడు తగిన చర్యలు తీసుకునేందుకు యూఎల్బీ (అర్బన్ లోకల్‌బాడీలు–పట్టణ స్థానిక సంస్థలు)ల పరిధిలో యంత్రాంగం ఉండాలని తెలిపింది. ♦వరదలు సంభవించినప్పుడు ప్రవాహం పారేందుకు అనువుగా నిర్మాణాలు ఉండాలని.. కాలువలు, చెరువులపై ఆక్రమణలను నిరోధించాలని, సాధ్యమైనంత ఎక్కువ ప్రాంతాల్లో పచ్చదనాన్ని అభివృద్ధిచేయాలని సూచించింది. ♦ఇందులో ప్రధానంగా స్థానిక వృక్ష జాతులకు ప్రాధాన్యం ఇవ్వాలని.. విపత్తుల నివారణకు సరైన ప్రణాళికలు సిద్ధంగా ఉండాలని, ఇప్పటికే ఉన్న సహజ నీటివనరుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరింది. ♦అన్ని పట్టణాలు, నగరాల్లో డ్రైనేజీ నెట్‌వర్క్‌ను డిజిటలైజ్ చేసి ఉంచడంతో పాటు డ్రైనేజీ మాస్టర్ ప్లాన్లను సిద్ధంచేసుకోవాలని సూచించింది. ♦అంతేగాక.. నగర విస్తీర్ణంలో 10–12 శాతంవాటర్ బాడీలను వినోద కేంద్రాలుగా అభివృద్ధి చేయడంతో పాటు అర్బన్ అండ్ రీజినల్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ గైడ్‌లెన్స్‌ను అమలుచేయాలని సూచించింది. ♦మాస్టర్ ప్లాన్ పరిధిలో ఉన్న పరిశ్రమల చుట్టూ గ్రీన్‌బెల్ట్ బఫర్ జోన్లను అభివృద్ధి చేయాలి. ♦పట్టణ మాస్టర్ ప్లాన్‌లో నీటి సరఫరా, మురుగునీరు, వరద నీరు ప్రవాహాలకు ప్రత్యేక నెట్వర్క్ ఉండాలని సూచించింది. -
ఇంటి ధరను నిర్ణయించేవేంటి?
సాక్షి, హైదరాబాద్: ఇంటి అంతిమ విలువ రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం నివసించడానికి సౌకర్యాలన్నీ ఉన్నాయా? ఒకవేళ భవిష్యత్తులో ఇల్లు అమ్మాలనుకుంటే మంచి ధర వస్తుందా? అని! చేరువలో షాపింగ్ మాళ్లు లేదా దుకాణాలు ఉన్నాయా? స్కూళ్లు, ఆసుపత్రులు, రవాణా సదుపాయాలు వంటివి ఉన్నాయా లేదా అనేవి చూడాల్సిందే. చుట్టుపక్కల వాళ్లు స్నేహపూర్వకంగా ఉంటేనే ప్రశాంతంగా నివసించొచ్చు. కొత్తగా పెళ్లయిన జంటలకు స్కూళ్ల అవసరముండదు కాబట్టి.. వీరు ఇల్లు కొనే ముందు ఈ అంశం గురించి పట్టించుకోరు. కాకపోతే ఇంటిని అమ్మాలనుకుంటే మాత్రం ఇదే కీలకంగా మారుతుందన్న విషయం మరిచిపోవద్దు. ప్రజా రవాణా వ్యవస్థ, పోస్టల్ సదుపాయాలూ కీలకమే. భవిష్యత్తు అవసరాలూ చూడాల్సిందే.. ఇంటి కొనుగోలులో సౌకర్యాలే కాదు భవిష్యత్తు అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కారు లేదా బైకు ఉన్నవారికి ప్రజా రవాణా వ్యవస్థ అవసరం ఉండకపోవచ్చు. ఈ–మెయిళ్లు, కొరియర్ల యుగంలో పోస్టాఫీసులు అనవసరమే కావచ్చు. కానీ, అదే ఇంటిని మీరు అమ్మేటప్పుడు మాత్రం పైవన్నీ కీలకమవుతాయని మరిచిపోవద్దు. చేరువలోనే షాపింగ్ చేసుకోవడానికి అవకాశముందనుకోండి.. వారాంతపు రోజుల్లో బయటికి షికారు వెళ్లడానికి ఆసక్తిని చూపకపోవచ్చు. కానీ, భవిష్యత్తులో ఇల్లు కొనేవారికి ఇవే కీలకమవుతాయి. ఇలాంటి అంశాల ఆధారంగా ఇంటి అంతిమ విలువను లెక్కగడతారని ప్రతి ఒక్కరూ తప్పక గుర్తుంచుకోవాలి. న్యాయపరమైన చిక్కులుంటే అంతే! చేరువలోనే స్కూలు, ఆసుపత్రి, షాపింగ్ మాల్ వంటి ఎన్ని రకాల సదుపాయాలున్నా సరే న్యాయపరమైన చిక్కులున్నాయో అంతే సంగతులు. యాజమాన్య హక్కుల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని తేలాకే కొనుగోలుదారుడు ముందగుగు వేస్తాడని మరవొద్దు. విక్రయించే స్థిరాస్తికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను కొనుగోలుదారులకు స్పష్టంగా ఓపిగ్గా వివరించాలి. ప్రాంతం కూడా ముఖ్యమే.. ఇంటికి అధిక ధర రావాలంటే అది ఉన్న ప్రాంతమూ ముఖ్యమే. ఇంటి నిర్మాణం ఎంత అభివృద్ధి చెంది ఉంటుందో ఆ ప్రాంతం కూడా అంతే వృద్ధి చెంది ఉంటుందనేది మర్చిపోవద్దు. అంటే ఇంట్లోని వసతులకే కాదు ఇంటికి దగ్గర్లో పాఠశాలలు, ఆసుపత్రులు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాళ్లు ఉండాలన్నమాట. అలాగే ఆ ఇంటికొచ్చేందుకు లిఫ్ట్, పార్కింగ్ వంటి వసతులతో పాటుగా అడ్రస్ సులువుగా అర్థమయ్యేలా ల్యాండ్‌మార్క్, ఇంటి నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లేందుకు అనువైన రోడ్డు ఉండాలి. -
భవిష్యత్తు అవసరాలను గుర్తించిన బడ్జెట్
10కి 7.5 మార్కులు ఇచ్చిన సీఐఐ-తెలంగాణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం యక్క భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సాధారణ బడ్టెట్‌ను రూపొందించినట్లుందని సీఐఐ తెలంగాణ అభిప్రాయపడింది. పన్ను విధానం స్పష్టంగా పెట్టుబడుల్ని ఆకర్షించేలా ఉందన్నారు. యువత, రైతులు, సామాన్య, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతికి బాటలు వేసేలే ఈ బడ్జెట్ ఉందని కొనియాడారు. గృహ విద్య, వైద్య, ఆరోగ్య, ఉద్యోగ రంగాలపై 2022 నాటికి లక్ష్యాన్ని ఏర్పాటు చేసి వాటిని చేరుకునేందుకు చర్యలు చేప్టటడం అభినందనీయమన్నారు. 7.5 శాతంగా ఉన్న స్థూలదేశీయోత్పత్తిని 8-8.5 శాతం పెంచడమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించారన్నారు. అనంతరం ఈ బడ్జెట్‌కు 10కిగాను 7.5 మార్కులిస్తున్నట్లు సీఐఐ తెలంగాణ చైర్ పర్సన్ వనితాదాట్ల శనివారమిక్కడ మీడియాకు తెలిపారు. మేక్ ఇన్ ఇండియాకు ఊతమిచ్చేలా, యువతను, యువ పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేలా బడ్జెట్ ఉందన్నారు. పెద్ద కంపెనీలతో సమానంగా పోటీపడుతున్న స్టార్టప్స్‌లను ప్రోత్సహించేందుకు ప్రత్యేకించి రూ.1,000 కోట్లు కేటాయించడం ఇందుకు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. ‘‘దేశంలోని మహిళ రక్షణకు ప్రత్యేకించి నిర్భయ ఫండ్ కింద రూ.1,000 కోట్లు కేటాయించడం ఆహ్వానించదగ్గ పరిణామమని’’ మాలక్ష్మి ఇన్ఫ్రా వెంచర్స్ ప్రై.లి. ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ తేజస్విని యార్లగడ్డ అభిప్రాయడ్డారు. అయితే మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేలా లోతైన స్థాయిలో అధ్యయనం చేసి మరిన్ని నిధులను కేటాయించి ఉండాల్సిందన్నారు. ‘‘ప్రత్యేక కేటాయింపులు, రాయితీలు ఉంటాయని ఈ బడ్జెట్‌పై ఎంతగానో ఆశపెట్టుకున్న నిర్మాణ రంగాన్ని మాత్రం విస్మయానికి గురిచేసిందని’’ శ్రీశక్తి రిసార్ట్స్ అండ్ హోటల్స్ లి. సీఎండీ డీవీ మనోహర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో నిధుల కేటాయింపు గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడం శోచనీయమని చెప్పారు. డిఫెన్స్ విభాగానికి ఇచ్చిన ప్రాధాన్యం విద్య, వైద్య రంగాలకు ఇవ్వలేదని విమర్శించారు. రహదారులు, గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం రూ.25 వేల కోట్లు కేటాయించడం చూస్తే మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం చిత్తశుద్ది కనబడుతోందన్నారు. -
బస్సుకు దారి చూపండి
ఎంఎంటీఎస్, మెట్రో స్టేషన్లకు కనెక్టివిటీ కావాలి మరో 859 బస్షెల్టర్లు అవసరం సీటీఎస్ నివేదికపై ఆర్టీసీ సూచనలు సాక్షి, సిటీబ్యూరో: మహానగర భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా అభివృద్ధి కోసం లీ అసోసియేట్స్ సమర్పించిన సమగ్ర రవాణా అధ్యయన (సీటీఎస్) నివేదికపై ఆర్టీసీ పలు సూచనలు చేసింది. బుధవారం సీటీఎస్పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆర్టీసీ ఎండీ పూర్ణచందర్రావు, ఈడీ కోటేశ్వర్రావు, రవాణా కమిషనర్ జి.అనంతరాము తదితరులు పాల్గొన్నారు. ఇందులో ఆర్టీసీ నివేదికపై చర్చ జరిగింది. తక్షణ అవసరాలతో పాటు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమీప భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న 66 మెట్రో రైల్వేస్టేషన్లతో పాటు, ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లకు సిటీ బస్సును అనుసంధానం చేయాలని ఆర్టీసీ నివేదిక పేర్కొంది. అలాగే 2041 నాటికి దశలవారీగా జరుగనున్న ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి అనుగుణంగా అన్ని రేడియల్ రోడ్లపై బస్‌బేలు, బస్స్టేషన్లు, ప్రయాణికుల వసతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రస్తుతం ప్రతి రోజు 35 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న అతి పెద్ద ప్రజా రవాణా సంస్థయిన ఆర్టీసీని బలోపేతం చేసేందుకు, భవిష్యత్తు విస్తరకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరింది. అవేమిటంటే... నగరంలోని 26 ఎంఎంటీఎస్ స్టేషన్లలో 15కు మాత్రమే సిటీ బస్సులు వెళ్లేందుకు రోడ్డు, పార్కింగ్ సదుపాయాలు ఉన్నాయి. మరో 11 స్టేషన్లకు కూడా తక్షణమే కనెక్టివిటీ కల్పించాలి. అందుబాటులోకి రానున్న 66 మెట్రో రైలు స్టేషన్లను కూడా సిటీ బస్సులతో అనుసంధానించాలి. అక్కడ బస్‌బేలు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలి. గ్రేటర్ పరిధిలో మరో 753 బస్షెల్టర్లు (ప్రస్తుతం ఉన్నవి 946) ఏర్పాటు చేయాలి. హెచ్ఎండిఏ పరిధిలో 41 బస్షెల్టర్లున్నాయి. మరో 106 తక్షణమే నిర్మించాలి. మరో 50 బస్‌బేలు ఏర్పాటు చేయాలి. సికింద్రాబాద్, ఎల్బీనగర్, మెహదీపట్నం, ఉప్పల్ వంటి రద్దీ ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. భవిష్యత్తులో ప్రయాణికుల అవసరాలతో పాటు, రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో 20 భారీ జంక్షన్ల వద్ద ట్రాన్సిట్ బస్స్టేషన్లు ఏర్పాటు చేయాలి. 2041 నాటికి దశలవారీగా అందుబాటులోకి రానున్న 33 రేడియల్ రోడ్లపై ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా 200 బస్షెల్టర్లు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం 3800 బస్సులతో ఆర్టీసీ ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తోంది. మహానగర విస్తరణకు అనుగుణంగా 2021 నాటికి 7000, 2041 నాటికి 12000 బస్సులు పెరిగే అవకాశం ఉంది. వీటికి హెచ్ఎంఎ పరిధిలో 30 బస్‌డిపోలు అవసరం. వాటి కోసం తగిన విధంగా స్థలాల కేటాయింపు, రోడ్డు సదుపాయం అవసరం.