G Venkata Ramana Reddy
-
ఆది దేవత సన్నిధిలో ప్రముఖులు
మొక్కులు సమర్పించిన ఎమ్మెల్యే, మంత్రి, చీఫ్‌విప్ మేడారం భక్తులతో కిక్కిరిసిన ఆలయం ములుగు, న్యూస్‌లైన్ : ప్రముఖుల మొక్కులతో ఆదిదేవత గట్టమ్మ ఆలయం కిక్కిరిసింది. శుక్రవారం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతోపాటు ప్రముఖులు వచ్చి తల్లికి మొక్కులు సమర్పించుకోవడంతో సందడి నెలకొంది. వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి సతీసమేతంగా వచ్చి గట్టమ్మకు మొక్కులు చెల్లించారు. మంత్రి పసుపులేటి బాలరాజు, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సోదరుడు రాంచందర్, కుటుంబ సభ్యులు ఆదిదేవతకు మొక్కులు సమర్పించారు. సెక్టోరియల్ అధికారులు నాగేశ్వర్రావు, రమేష్, ఎమ్మార్వో మార్క చక్రధర్ వారికి స్వాగతం పలికారు. ఊహించని విధంగా భక్తులు తరలిరావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సీఐ శ్రీధర్‌రావు, ఇతర సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సందడి చేసిన గబ్బర్‌సింగ్ టీం సభ్యులు గబ్బర్‌సింగ్ సినిమా ఫేం హాస్య నటులు సాయిబాబు, నాగులు గట్టమ్మ ఆలయాన్ని సందర్శించి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. మొదటిసారిగా మే డారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు వెళ్తున్నామని, ఇంతమంది భక్తులను చూస్తే ఆశ్చర్యమేస్తోందని వారు అన్నారు. పూజలు చేసిన అనంతరం బయటకి వస్తున్న తరుణంలో వారిని భక్తులు గుర్తుపట్టడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం సందడిగా మారిం ది. వారితో ఫొటోలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు. జనసంద్రంలా.. మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని తిరుగు పయనమైన భక్తులు గట్టమ్మ దర్శనానికి ఆగడంతో రద్దీ నెలకొంది. సారలమ్మ గద్దెపైకి వచ్చిన రోజు బుధవారం మేడారం వెళ్లే భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో జిల్లా కేంద్రం నుంచి వచ్చిన వాహనాలను గుడెప్పాడ్, గణపురం, జంగాలపల్లి మీదుగా జాతరకు మళ్లించిన విషయం తెలిసిందే. దీంతో ఆ రోజు గట్టమ్మను దర్శించుకోలేకపోయిన వారు తిరుగు ప్రయాణంలో గట్టమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడే విడిది చేసి వంటావార్పులకు సిద్ధమయ్యారు. -
3న ఢిల్లీకి కాంగ్రెస్ నేతల బృందం
సీఎం తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం రాష్ట్రం కోసమే ప్రభుత్వంలో ఉంటున్నాం {పభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి వరంగల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వేగం గా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరేందుకు ఈనెల 3వ తేదీన కాంగ్రెస్ నేతల బృందం ఢిల్లీకి వెళ్లనున్న ట్లు ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. బృందంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ముఖ్యనేతలు ఉం టారని పేర్కొన్నారు. హన్మకొండలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో చర్చ ముగిసినందున పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతామని చెప్పారు. ఈ నెలాఖరులోగా బిల్లు ఆమోదం పొందుతుం దని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగా ణ ఏర్పడే వరకూ ఈ ప్రభుత్వం ఉండాలనే దృష్టితోనే భాగస్వామ్యమవుతున్నామని, పదవులకోసం పాకులాడడం లేద ని, అవమానాలు ఎదురైనా.. నిధులు కేటాయించకున్నా ఓపికతో ఉన్నామని తెలిపారు. అధిష్టానం కిరణ్ వ్యవహారం లో సరైన సమయంలో స్పందిస్తుందని, ఆయన సీఎంగా ఏవైనా తప్పులు, అవినీతికి పాల్పడితే లోక్పాల్లాంటి చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటారని అన్నారు. అసెంబ్లీలో గురువారం చర్చ సందర్భంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలను అడ్డుకున్నారనే సాకుతో ఒక్కో ఎమ్మెల్యే ను నలుగురు కలిసి ఆపారని చెప్పారు. సీఎం కిరణ్ వ్యవహారం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.. తెలంగాణ మంత్రు లు అభ్యంతరం వ్యక్తం చేసినా సభానాయకుడిగా రూల్ 77 కింద నోటీసు జారీ చేయడం శోచనీయమన్నారు. ఈ తీర్మా నం సీఎం కొద్ది క్షణాలు ఆనందపడేందు కు ఉపయోగపడుతుంది తప్ప తెలంగాణకు ఎలాంటి అడ్డంకి కాదని స్పష్టం చేశారు. సీమాంధ్ర నాయకులు ప్రజల ను గందగోళపరిచేందుకు యత్నిస్తున్నారని, తెలంగాణ ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ఏర్పాటు ఖాయమని చెప్పారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు వీసం సురేందర్‌రెడ్డి, వంగాల నారాయణరెడ్డి, విజన్రావు, సదానందంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.