- సీఎం తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
- రాష్ట్రం కోసమే ప్రభుత్వంలో ఉంటున్నాం
- {పభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి
వరంగల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వేగం గా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరేందుకు ఈనెల 3వ తేదీన కాంగ్రెస్ నేతల బృందం ఢిల్లీకి వెళ్లనున్న ట్లు ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. బృందంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ముఖ్యనేతలు ఉం టారని పేర్కొన్నారు.
హన్మకొండలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో చర్చ ముగిసినందున పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతామని చెప్పారు. ఈ నెలాఖరులోగా బిల్లు ఆమోదం పొందుతుం దని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగా ణ ఏర్పడే వరకూ ఈ ప్రభుత్వం ఉండాలనే దృష్టితోనే భాగస్వామ్యమవుతున్నామని, పదవులకోసం పాకులాడడం లేద ని, అవమానాలు ఎదురైనా.. నిధులు కేటాయించకున్నా ఓపికతో ఉన్నామని తెలిపారు.
అధిష్టానం కిరణ్ వ్యవహారం లో సరైన సమయంలో స్పందిస్తుందని, ఆయన సీఎంగా ఏవైనా తప్పులు, అవినీతికి పాల్పడితే లోక్‌పాల్‌లాంటి చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటారని అన్నారు. అసెంబ్లీలో గురువారం చర్చ సందర్భంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలను అడ్డుకున్నారనే సాకుతో ఒక్కో ఎమ్మెల్యే ను నలుగురు కలిసి ఆపారని చెప్పారు. సీఎం కిరణ్ వ్యవహారం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.. తెలంగాణ మంత్రు లు అభ్యంతరం వ్యక్తం చేసినా సభానాయకుడిగా రూల్ 77 కింద నోటీసు జారీ చేయడం శోచనీయమన్నారు.
ఈ తీర్మా నం సీఎం కొద్ది క్షణాలు ఆనందపడేందు కు ఉపయోగపడుతుంది తప్ప తెలంగాణకు ఎలాంటి అడ్డంకి కాదని స్పష్టం చేశారు. సీమాంధ్ర నాయకులు ప్రజల ను గందగోళపరిచేందుకు యత్నిస్తున్నారని, తెలంగాణ ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ఏర్పాటు ఖాయమని చెప్పారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు వీసం సురేందర్‌రెడ్డి, వంగాల నారాయణరెడ్డి, విజన్‌రావు, సదానందంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.