G4 summit
-
భారత్కు చోటు కల్పించాలి: మోదీ
-
భారత్కు చోటు కల్పించాలి: మోదీ
న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితిలోని కీలకమైన విభాగమైన భద్రతామండలిలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కు చోటు కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. జీ4 దేశాల సదస్సు శనివారం న్యూయార్క్లో ప్రారంభమైంది. ఈ సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ ఐరాసలో సంస్కరణలు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నిర్దిష్ట కాలపరిమితిలో ఐరాస సంస్కరణలు అమల్లోకి తేవాలని ఆయన అన్నారు. తీవ్రవాదం, పర్యావరణ కాలుష్యం ప్రపంచానికి పెనుసవాళ్లు విసురుతున్నాయని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచ శాంతికి జీ4 దేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ దేశాలను కలుపుకోవాలని...పొంచి ఉన్న సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకుపోవాలని పిలుపునిచ్చారు. -
న్యూయార్క్ లో ప్రారంభమైన జీ4 దేశాల సదస్సు
న్యూయార్క్ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జీ4 సదస్సులో పాల్గొన్నారు. న్యూయార్క్లో జరుగుతున్న ఈ సదస్సులో సభ్యదేశాలుగా ఉన్న బ్రెజిల్, జర్మనీ, జపాన్, భారత్ దేశాల అధినేతలు పాల్గొన్నాయి. ఐక్యరాజ్య సమితిలో తీసుకు రావాల్సిన సంస్కరణలపై చర్చ సందర్భంగా.... ఐరాసలో సంస్కరణలు వేగవంతం చేయాలని ఈ సందర్భంగా మోదీ సూచించారు. ఐరాసలో సంస్కరణలపై దశాబ్దాలుగా జరుగుతున్న చర్చలకు ముగింపు పలకాలని ఆయన అన్నారు.