gachi bowli stadium
-
భారత్‌లో నాకు ప్రత్యేక అభిమానులున్నారు : 'సూపర్‌స్టార్ జాన్ సినా'
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తన ప్రతిష్టను చాటుకుంది. డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్‌షిప్‌నకు వేదికగా నిలిచింది. సమరాన్ని తలపించేలా శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ‘డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్’ పోరు జరిగింది. దేశంలో రెండోసారి, నగరంలో తొలిసారిగా పోటీలు జరగడంతో సందడి నెలకొంది. ‘డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్’లో పదమూడు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ‘జాన్ సినా’ రావడంతో అభిమానుల ఆనందం అంబరాన్నంటింది. జాన్ సినాతో పాటు సేథ్ ‘ఫ్రీకిన్’ రోలిన్స్, జిందర్ మహల్, నటల్య, ‘ది రింగ్ జనరల్’ గుంథర్, డ్రూ మెక్‌ఇంటైర్, కెవిన్ ఓవెన్స్, సమీ జైన్ వంటి డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్స్టార్లు తలపడేందుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక విమానంలో వచ్చిన వీరికి ఎయిర్‌పోర్టులో అభిమానులు ఘనస్వాగతం పలికారు. డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్‌కు హాజరైన జాన్ సినాను సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా చీఫ్ రెవెన్యూ ఆఫీసర్, ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ రాజేష్ కౌల్ ఆహ్వానించి అభినందనలు తెలిపారు. ఇటీవల డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ కెవిన్ ఓవెన్స్, సామి జైన్‌లతో సీక్రెట్‌గా ఓ ప్రాజెక్ట్ చిత్రీకరణలో కనిపించి అలరించిన దక్షిణాది హీరో కార్తీ శుక్రవారం జాన్ సినాను ప్రత్యేకంగా కలిసి ఫొటోలు దిగారు. గొప్ప అనుభూతి.. ► ఈ సందర్భంగా జాన్ సినా మాట్లాడుతూ.. భారత్‌లో తనకు ప్రత్యేక అభిమానులున్నారని, ఇన్నేళ్ల తర్వాత భారత్ వేదికగా డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్‌లో పాల్గొనడం గొప్ప అనుభూతిగా నిలిచిపోతుందన్నారు. ► పోటీల్లో పాల్గొంటున్న భారతీయ ఫైటర్లు వీర్ మహాన్, సంగా, జిందర్ మహల్లు హైదరాబాద్ నగరాన్ని మరోసారి ఆస్వాదించామన్నారు. ప్రత్యేకంగా చార్మినార్‌ను సందర్శించామని, ఇక్కడి ఫేమస్ బిర్యానీ తిన్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ► స్పెక్టాకిల్‌లో పాల్గొన్న లేడీ ఫైటర్ నటల్య ‘భారతీయ అభిమానుల ప్రేమలో తడవటం గొప్ప అనుభూతి అని’ అభివర్ణించింది. ఇక్కడి మూలాల్లోనే పోటీతత్వం ఇమిడి ఉందని కితాబిచ్చింది. -
జనవరి 30 నుంచి ప్రొ కబడ్డీ
ముంబై: క్రీడాభిమానుల ఆదరణను చూరగొన్న ప్రొ కబడ్డీ లీగ్‌ను ఇకపై ఏడాదిలో రెండు సార్లు నిర్వహించనున్నారు. ఇప్పటికే రెండు సార్లు జరిగిన ఈ టోర్నీ విజయవంతమైంది. సీజన్-2 ముగిసిన ఐదు నెలల్లోపే మళ్లీ లీగ్‌ను జరుపుతుండటం విశేషం. ప్రొ కబడ్డీ సీజన్-3 వచ్చే జనవరి 30నుంచి జరుగుతుంది. ఈ టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదిక కానుంది. తొలి మ్యాచ్‌లో యు ముంబాతో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. ఫైనల్ మార్చి 6న న్యూఢిల్లీలో జరుగుతుంది. -
ఫైనల్లో హాట్‌షాట్స్
సీజన్ ఆరంభం నుంచి సైనా చెలరేగుతున్నా.. సహచరులు అడపాదడపా తడబడ్డారు. కానీ తీవ్ర ఒత్తిడిలో ఆడే సెమీఫైనల్లో మాత్రం సైనాతో పాటు మిగిలిన వాళ్లూ చెలరేగారు. దీంతో హైదరాబాద్ హాట్‌షాట్స్ 3-0తో పుణే పిస్టన్స్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. నేటి సెమీఫైనల్ బెంగళూరులో ముంబై మాస్టర్స్ x అవధ్ వారియర్స్ రా. గం. 8.00 నుంచి ఈఎస్‌పీఎన్‌లో ప్రత్యక్ష ప్రసారం సాక్షి, హైదరాబాద్: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) తొలి సీజన్లో హైదరాబాద్ హాట్‌షాట్స్ ఫైనల్‌కు చేరింది. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో హాట్‌షాట్స్ 3-0తో పుణేను ఓడించింది. దీంతో చివరి రెండు మ్యాచ్‌లు నిర్వహించాల్సిన అవసరం కూడా రాలేదు. పురుషుల, మహిళల సింగిల్స్‌తో పాటు పురుషుల డబుల్స్‌లో కూడా హాట్షాట్స్కే గెలుపు దక్కింది. అజయ్ జయరామ్‌కు ప్లేయర్ ఆఫ్ ది టై అవార్డు లభించింది. మరోసారి జయరామ్ సంచలనం... లీగ్ దశలో ప్రపంచ ఐదో ర్యాంకర్ యుగెన్ టిన్ మిన్ను ఓడించిన అజయ్ జయరామ్ ఈ సారి కూడా అదే సంచలనాన్ని పునరావృతం చేశాడు. ఆరంభంలో వెనుకబడినా పోరాటపటిమ కనబర్చి తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో మాత్రం అజయ్‌కు తిరుగు లేకుండా పోయింది. 21-17, 21-11తో మ్యాచ్ నెగ్గి హాట్‌షాట్స్‌కు ఈ యువ ఆటగాడు శుభారంభం అందించాడు. షెంక్ చేతులారా... మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21-10, 19-21, 11-8 తేడాతో జులియన్ షెంక్‌పై విజయం సాధించింది. గత మ్యాచ్‌లో షెంక్‌ను ఓడించిన సైనా ఈ సారి కూడా పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. వరుసగా రెండు పాయింట్లు సాధించి తొలి గేమ్‌లో బోణీ చేసిన ఆమె ఏ దశలోనూ వెనుకబడలేదు. అయితే సైనా ప్రదర్శనకంటే షెంక్ చేసిన తప్పులే ఎక్కువగా ఉన్నాయి. సగం పాయింట్లు షెంక్ అనవసర తప్పిదాల ద్వారానే కోల్పోయింది. సైనా 6-3తో ఉన్న దశలో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 10-3కు చేరింది. ఆ తర్వాత 16-4 వరకు ఆమె ఆధిక్యం కొనసాగింది. షెంక్ కోలుకునే ప్రయత్నం చేసినా చివరకు 21-10తో గేమ్ సైనా సొంతమైంది. ఏడు పాయింట్లతో... రెండో గేమ్‌లో మాత్రం షెంక్ తన స్థాయికి తగ్గ ఆట కనబర్చింది. ప్రతీ పాయింట్ కోసం ఇద్దరూ హోరాహోరీ పోరాడారు. అయితే చక్కటి స్మాష్‌లతో దూకుడు కనబర్చిన సైనా వేగంగా ఆధిక్యంలోకి దూసుకు వెళ్లి 18-11తో గెలుపుకు చేరువగా వచ్చింది. అయితే ఈ దశలో షెంక్ ఒక్కసారిగా విజృంభించింది. వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 18-18తో స్కోరు సమం చేసింది. సైనా మరో పాయింట్ సాధించినా... షెంక్ వరుసగా మూడు పాయింట్లతో గేమ్ గెల్చుకుంది. మూడో గేమ్‌లో మాత్రం షెంక్ ఒత్తిడికి లోనైంది. ఎలాంటి తొందరపాటు ప్రదర్శించకుండా నింపాదిగా ఆడిన సైనా గేమ్ గెలిచి మ్యాచ్‌లో విజేతగా నిలిచింది. పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో హాట్‌షాట్స్ జోడి గో వి షెమ్-వా లిమ్ కిమ్, పిస్టన్స్ జంట నీల్సన్ ఫిషర్-సనవే థామస్‌పై సంచలన విజయం సాధించింది. తొలి గేమ్ ఓడినా కోలుకున్న హైదరాబాద్ జోడి 16-21, 21-14, 11-7 తేడాతో గెలుపొంది తమ జట్టుకు ఫైనల్లో చోటు ఖాయం చేసింది. ఆ ర్యాలీ అద్భుతం... సైనా, షెంక్ల మధ్య జరిగిన రెండో గేమ్‌లో స్కోరు 5-5తో ఉన్నప్పుడు ఒకటే పాయింట్ కోసం సుదీర్ఘ ర్యాలీ ఆడారు. సుమారు 30సార్లు షటిల్ అటూ ఇటూ తిరిగింది. ఉత్సుకతతో స్టేడియంలో ప్రేక్షకులంతా నిలబడిపోయారు. చివరకు షెంక్ షాట్‌ను అవుట్‌గా భావించి సైనా వదిలేసింది. అయితే అది సరైందే అని తేలడంతో షెంక్ 6-5 ఆధిక్యంలోకి వెళ్లింది. లైన్కాల్పై సైనా కాస్త అసంతృప్తి కూడా ప్రదర్శించింది. అది తర్వాతి పాయింట్‌పై కనిపించింది. అద్భుతమైన స్మాష్‌తో స్కోరు చేసిన సైనా తన ఉద్వేగాన్ని ఆపుకోలేక అరిచేసింది. ప్రేక్షకులు మాత్రం ఆ ర్యాలీని పూర్తిగా ఆనందించి చప్పట్లతో ఇద్దరినీ అభినందించారు. మరొకటి గెలవాలి: ప్రసాద్ వి.పొట్లూరి, సైనా