అన్నీ అబద్ధపు హామీలే
తొండూరు :
ఎన్నికలలో చంద్రబాబు నాయుడు అబద్దాలు చెప్పి వాటితోనే సీఎం పదవి దక్కించుకున్నారని.. తర్వాత ప్రజలను పట్టించుకోకుండా మోసం చేశారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం మండలంలోని తొండూరు, కోరవానిపల్లె గ్రామాల్లో గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా తొండూరు శివాలయం, కోరవానిపల్లెలో రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం ప్రారంభించారు. తొండూరుకు చేరుకున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు భాస్కర్‌రెడ్డి, జనార్థన్‌రెడ్డి, రాఘవరెడ్డిలతోపాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు బాణా సంచా పేల్చుతూ.. డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అలాగే కోరవానిపల్లెకు గడప గడపకు వచ్చిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ఆలకించారు. తొండూరుకు చెందిన కుమ్మరి వెంకటసుబ్బన్నతోపాటు మరికొంతమంది మహిళలు, వృద్ధులు, వికలాంగులు పింఛన్లు రాలేదని అవినాష్‌రెడ్డి ఎదుట వాపోయారు. అర్హతలున్నా పింఛన్ రాకుండా జన్మభూమి కమిటీ సభ్యులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గతంలో వర్షాలు కురిసినప్పుడు గృహాలు కూలిపోయిన కోరవానిపల్లె శివయ్య, తొండూరుకు నారాయణలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదని.. అర్జీ ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదని ఎంపీకి మొరపెట్టుకున్నారు. తొండూరుకు చెందిన అలవలపాడు సూర్యనారాయణరెడ్డి గత కొంతకాలంగా పక్షపాతంతో బాధపడుతూ మంచంలో ఉన్న వ్యక్తిని పరామర్శించారు. అలాగే హరిజనవాడలో అనారోగ్యంతో బాధపడుతున్న చెందిన డ్రైవర్ శ్రీనివాసులును ఎంపీ పరామర్శించారు. రజకుల, ఎస్టీ కాలనీల్లో ఉన్న సమస్యలతోపాటు వడ్డెర కాలనీ, కోరవానిపల్లె గ్రామాల్లో ఉన్న నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఎంపీకి వివరించారు.
టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరిక :
కోరవానిపల్లెకు చెందిన చిట్టిబోయిన సోమేశులు, తాటి లక్షుమయ్యతోపాటు మరికొంతమంది కార్యకర్తలు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన ఈశ్వరయ్య అనే రైతు సోనాలిక కంపెనీకి చెందిన నూతన మినీ ట్రాక్టర్‌ను స్వయంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డ్రైవింగ్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, మండల పరిశీలకుడు బండి రామమునిరెడ్డి, మండల నాయకులు భూమిరెడ్డి రవీంద్రారెడ్డి, సీనియర్ నాయకులు ఎర్ర గంగిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అంకిరెడ్డి సురేష్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు బండి రమణారెడ్డి, ఓతూరు రసూల్, సింగిల్ విండో డైరెక్టర్ రమణారెడ్డి, జిల్లా సెక్రటరీ షఫి, తాలుకా ప్రధాన కార్యదర్శి దశరథరామిరెడ్డి, ఎంపీటీసీ అగడూరు శివశంకర్‌రెడ్డి, మండల కో.ఆప్షన్ మెంబరు వెంకట్రామిరెడ్డి, రైతు సంఘ నాయకులు పల్లేటి ఈశ్వరరెడ్డి, సర్పంచ్‌లు ప్రకాష్‌రావు, వెంకటచలమారెడ్డి, గురుమోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు ఓబుళరెడ్డి, శివగంగిరెడ్డి, బాబుల్‌రెడ్డి, గంగులయ్య, గంగయ్య, వాటర్ షెడ్ చైర్మన్ సోమశేఖర్, ఉల్లిమెల్ల శంకర్‌రెడ్డి, సింహాద్రిపురం మండల వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రకాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ద్వారకనాథరెడ్డి, తొండూరు వైఎస్ఆర్సీపీ నాయకులు వెంకట్రామిరెడ్డి, బంగారు మునెయ్య, నడిపిరాజా, యల్లారెడ్డి, విశ్వనాథరెడ్డి, రామచంద్రారెడ్డి, పద్మనాభరెడ్డి, రాజమోహన్‌రెడ్డి, కోరవానిపల్లె నాయకులు నాగమునెయ్య, శివయ్య, పుల్లయ్య, గోవర్థన్, సోమిరెడ్డి, గోవర్థన్, రంగయ్యలతోపాటు తొండూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రశేఖరరెడ్డి, బాలనరసింహారెడ్డి, బాలగంగిరెడ్డి, రజినికాంత్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి, బాల ఎరికల్‌రెడ్డి, నరసింహారెడ్డి, రామాంజనేయరెడ్డి, రామమునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.