గద్వాల బంద్ ప్రశాంతం
గద్వాల: ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఇచ్చిన పిలుపు మేరకు మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గద్వాల జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. దుకాణాలు, వాణిజ్య సంస్థలు పనిచేయటం లేదు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని గద్వాల జిల్లా సాధన సమితి నేతలు ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి, నినాదాలు చేస్తున్నారు.