gadwal division
-
ఆడిట్లు సరే...మరి యాక్షనో?
‘ఉపాధి’ అక్రమార్కులపై చర్యలు శూన్యం రికార్డులను మాయం చేసిన వారిపై కూడా... గద్వాల డివిజన్లో 18.5 కోట్ల రికార్డులు గల్లంతు గట్టులో అత్యధికంగా 1.92 కోట్ల అక్రమాలను గుర్తించిన అధికారులు అయిజ, వడ్డేపల్లి, ఇటిక్యాల, ధరూర్, మల్దకల్, గద్వాలలో వెలుగుచూసిన అక్రమాలు అన్ని మండలాల్లోనూ అరకొర చర్యలే! గద్వాల: నియోజకవర్గంలోని గట్టు మం డలంలో అత్యధికంగా అక్రమాలు జరిగి నట్లు అధికారులు సామాజిక తనిఖీలలో గుర్తించారు. అక్కడ రూ.1.92కోట్ల అక్రమాలను గుర్తించినా, రూ.54,322లు మాత్రమే రికవరీ చేశారు. ఉద్యోగంలో ఉ న్న వారి అక్రమాలపై వసూళ్లను నెలవారీ కటింగ్లతో, ఉద్యోగులు కాని వారి అక్రమాల సొమ్మును రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా వసూళ్లు చేస్తామని అధికారులు ప లుమార్లు ప్రకటించారు. రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను ఉపయోగించి వసూళ్లు చేసే అ ధికారాన్ని తహశీల్దార్లకు అప్పగించామని జిల్లా అధికారులు చెబుతున్నా, ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని తహశీ ల్దార్లు అంటున్నారు. మరోవైపు రెవెన్యూ రికవరీ యాక్టు ద్వారా నిధులను కాజేసిన వారి నుంచి వసూళ్లు లేకపోయినా, ఉపా ధి అక్రమాలపై సామాజిక తనిఖీలను చే స్తూనే ఉన్నారు. అధికారులు ఏ స్థాయిలో అక్రమాలను తేల్చినా అవి కాగితాలకే పరిమితం కాక తప్పదు. గుర్తించిన అక్రమాల విలువ... గట్టులో రూ.1.92 కోట్లు అక్రమంగా కా జేసినట్లు అధికారులు తేల్చినా, ఈ లెక్క ను కుదించే ప్రయత్నాలు జరిగాయి. అ యిజలో రూ.18 లక్షలు, వడ్డేపల్లిలో రూ.13 లక్షలు, ఇటిక్యాలలో రూ.12 లక్ష లు, ధరూరులో రూ.8 లక్షలు, మల్దకల్ లో రూ.15 లక్షలు, గద్వాలలో గతంలో రూ. 3 లక్షల అక్రమాలు ఉండగా, ఫిబ్రవరిలో నిర్వహించిన సామాజిక తనిఖీలో మరో లక్ష రూపాయలఅక్రమాలు వెలుగు చూశాయి. ఇలా అన్ని మండలాల్లోనూ అక్రమాలు వెలుగు చూసినా చర్యలు మాత్రం కనిపించడం లేదు. కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు... గట్టు మండలంలో ఉపాధి హామీ అక్రమాలకు కారకులుగా భావించి ఒక ఎంపీడీఓ, 18మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐదుగురు టెక్నికల్ అసిస్టెంట్లను గతంలో తొలగించారు. అయిజలో ఇద్దరు ఫీల్డ్ స్టాఫ్‌పై చర్యలు తీసుకున్నారు. మల్దకల్ మండలంలో జరిగిన అక్రమాలకు బా ధ్యులుగా ఐదుగురు ఫీల్డ్ అసిస్టెంట్లను, ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లను పక్కనబెట్టారు. ధరూరు మండలంలో నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు, 21మంది మేటీలను తొ లగించారు. గద్వాల మండలంలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్, ఇద్దరు టీఎఫ్‌లకు షోకాజ్‌లిచ్చారు. రికార్డుల గల్లంతుపై చర్యలెక్కడ? డివిజన్లో దాదాపు రూ.18 కోట్ల విలువై న ఉపాధి పనులకు రికార్డులు గల్లంతయ్యాయి. ఇంత జరిగిందని తెలిసినా చర్యలు లేకపోవడం విశేషం. అలంపూర్ మండలంలో దాదాపు రూ.10 కోట్ల విలువైన ఉపాధి రికార్డులు, గట్టు మండలంతో రూ.5 కోట్ల విలువైన రికార్డులు, అయిజ మండలంలో రూ.3.5 కోట్ల విలువైన పనుల రికార్డులను సామాజిక తని ఖీల వేదిక వద్దకు రాకుండా గల్లంతు చేశారు. రికార్డులు ఎలా గల్లంతయ్యా యి, బాధ్యులు ఎవరనే విషయంపై జిల్లా అధికారులు తీవ్రంగా స్పందించి విచార ణ చేపట్టకపోవడంతో నేటికీ రికార్డుల విషయం అంతుబట్టని ప్రశ్నగానే మిగిలింది. చర్యలకు ఆదేశాలు ఇవ్వలేదు నేను ఏపీడీగా బాధ్యతలు మూడు నెలల క్రితమే తీసుకున్నాను. గతంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి నాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రస్తుతం అన్ని మండలాల్లో ఉపాధిహామీ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. పల్లెల్లో వ్యవసాయ కూలీలకు పనిదినాలు కల్పిస్తున్నాం. - ఏపీడీ గోపాల్ -
నెట్టెంపాడు..నెట్టేశారు!
కరువు నెలలో సిరులు పండించాలని సంకల్పించారు. బీడువారిన నేలలను మాగాణి భూములుగా మార్చాలని తలంచారు.. మహోన్నత ఆశయంతో నిర్మించిన నెట్టెంపాడు ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా పాలకులు పాతాళంలోకి నెట్టేశారు. అంకితం పేరుతో అశ్రద్ధచూపి ఆయకట్టుకు నీటిని అందించలేకపోయారు. అరకొరగా నిధులు విదిల్చి అంగుళం పనికూడా ముందుకు సాగనీయకుండా చేశారు. అదిగో నీళ్లు.. ఇదిగో వచ్చే! అన్నారు. ఖరీఫ్ కాకపోతే.. రబీలో ఖాయమన్నారు. కళ్లుకాయలు కాసేలా ఎదురుచూసిన రైతులకు చివరికి నిరాశే మిగిలింది. తెలంగాణ ప్రభుత్వమైనా పనులు పూర్తిచేసి సాగునీరు అందించాలని ఈ ప్రాంత రైతాంగం కోరుతోంది. గద్వాల, న్యూస్‌లైన్: గద్వాల డివిజ న్లో రెండులక్షల ఎకరాలకు సాగునీ రు అందించాలనే లక్ష్యంతో జలయజ్ఞంలో భాగంగా నెట్టెంపాడు ఎత్తిపోత ల పథకానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో మంజూ రుఇచ్చారు. అదే ఏడాది డిసెంబర్లో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లోని 8 మండలాలకు సాగునీరు అందించే విధంగా రూ.1428 కోట్ల అంచనావ్యయంతో పథక నిర్మాణాన్ని ప్రారంభించారు. జూ రాల రిజర్వాయర్ నుంచి 21.425 టీఎం సీల కృష్ణానది నీటిని ఎత్తిపోతల ద్వారా రెండు లక్షల ఎకరాలకు అందించడంతోపాటు 148 గ్రామాలకు రిజర్వాయర్లు, ప్రధానకాల్వల ద్వారా తాగునీరు అం దించాలని భావించారు. నెట్టెంపాడు లి ఫ్టు రెండుదశల్లో పంప్‌హౌస్‌లను ఏర్పాటుచేసి రెండు ఆన్లైన్ రిజర్వాయర్లకు నీటిని పంపిణీచేస్తారు. గుడ్డెందొడ్డి కుడి, ఎడమ ప్రధానకాల్వల ద్వారా 63వేల ఎకరాలు, ర్యాలంపాడు రిజర్వాయర్ ద్వారా 1.37లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలన్నది ప్రధానలక్ష్యం. అయితే 2012 సెప్టెంబర్ 14న ఆయకట్టుకు నీళ్లిచ్చే పనులు పూర్తికాకపోయినా.. అప్పటి సీఎం ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి నెట్టెంపాడు ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 2013 రబీలో 50వేల ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పారు. నేటికీ ఆయకట్టుకు నీళ్లిచ్చే పనులను పూర్తిచేయించలేకపోయారు. ఈ ఖరీఫ్‌లో కూ డా ఎన్నివేల ఎకరాలకు నీళ్లిస్తారో కూడా చెప్పలేకపోతున్నారు. ఎన్నికల వాగ్దానంగానే..! పాలమూరును దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన చంద్రబాబు 1995 నుంచి 2004 వరకు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై సానుభూతి మినహా పెద్దగా చేసిందేమీలేదు. 1999 ఎన్నికల సమయంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి వదిలేసిన చంద్రబాబు మళ్లీ ప్రాజెక్టుల జోలికి వెళ్లలేదు. 2004 ఎన్నికలకు ముందు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి అపద్ధర్మ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనే 25వేల ఎకరాలకు కుదింపుచేసి శంకుస్థాపన చేశారు. వైఎస్ హయాంలో నాలుగేళ్లలో రూ.902.38 కోట్లు ఖర్చుచేయగా, రోశ య్య ప్రభుత్వం కేవలం ఏడాదిలో రూ. 213.67 కోట్లు ఖర్చుచేసింది. ఇక కిరణ్‌కుమార్ ప్రభుత్వం నెట్టెంపాడుకు నిధుల కేటాయింపులో శ్రద్ధచూపలేదు. 2010 నుంచి 2014 వరకు నాలుగేళ్లలో కేవలం రూ.455.58 కోట్లు ఖర్చుచేశా రు. నీళ్లివ్వాల్సిన కీలకమైన పనులను మూడేళ్లుగా ప్రభుత్వం నిర్లక్ష్యం వహి స్తూ వస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు, ప్రధానకాల్వలు పూర్తి కాకుండానే 2012 సెప్టెం బర్ 14న సీఎం కిరణ్ నెట్టెంపాడును జా తికి అంకితం చేశారు. అదే ఏడాది 50వే ల ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పినా, ఇప్పటివరకు వేయి ఎకరాల ఆయకట్టుకు కూ డా ఇవ్వలేకపోయారు. నీళ్లిచ్చే పనులపై ఏనాడూ సమీక్షలు నిర్వహించలేదు. -
గట్టు ఎత్తిపోతల పథకం సర్వేకు ప్రభుత్వ అనుమతి
గద్వాల, న్యూస్‌లైన్: కరువు నేలపై కృష్ణాజలాలు పారనున్నాయి. జిల్లాలో వెనకబడిన ప్రాంతంగా పేరొందిన గట్టు మండలం ఇక సస్యశ్యామలం కానుంది. అనేక దశాబ్దాలుగా వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ ప్రాంత భూములను కృష్ణానది నీటితో సస్యశ్యామలం చేసేందుకు ప్రతిపాదించిన ‘గట్టు ఎత్తిపోతల పథకం’ సమగ్రసర్వేకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇప్పటికే ఆర్థికశాఖ క్లియరెన్స్ ఇవ్వడంతో మరోరెండురోజు ల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయని తెలిసింది. ఈ పథకం పూర్తయితే గద్వాల నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కృష్ణానది నీళ్లు ఎత్తిపోతల ద్వారా అందనున్నాయి. కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టును గద్వాల డివిజన్‌లోనే నిర్మించినప్పటికీ ఈ ప్రాంతంలో కేవలం 37వేల ఎకరాల ఆయకట్టు మాత్రమే ఉంది. దీంతో నడిగడ్డను సస్యశ్యామలం చేసేందుకు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే సామర్థ్యంతో చేపట్టారు. ఈ పథకం ద్వారా కూడా అత్యంత వెనకబడిన గట్టు ప్రాంతానికి సాగునీరు అందడం లేదు. ఈ సమస్యను కూడా పరిష్కరించి మరో మినీఎత్తిపోతల ద్వారా గట్టుకు సాగునీటిని అందించాలన్న ప్రతిపాదన మేరకు ఇప్పటికే జూరాల అదికారులు ప్రాథమిక సర్వేచేసి నివేదికను ప్రభుత్వానికి పంపించారు. జూరాల అధికారుల నివేదిక ఆధారంగా సమగ్రసర్వేకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో కీలకమైన ఆర్థికశాఖ క్లియరెన్స్ రెండురోజుల క్రితం లభించినట్లు తెలిసింది. మరో రెండురోజుల్లో సమగ్రసర్వేకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించనున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. చెరువు, కుంటలకు జలకళ ప్రాథమిక సర్వే వివరాల ప్రకారం నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండో పంప్‌హౌస్ వద్ద ఉన్న ర్యాలంపాడు రిజర్వాయర్‌కు పడమర వైపున ఆలూరు గ్రామ శివారులో రిజర్వాయర్ వద్ద ఇన్‌టెక్‌వెల్‌ను నిర్మిస్తారు. అక్కడ కేవలం 0.3 మెగావాట్ల విద్యుత్ వినియోగంతో నడిచే పంపింగ్ మోటారును ఏర్పాటుచేసి అక్కడి నుంచి గట్టు మండలలోని మల్లాపురం తండా పక్కన ఉన్న గజ్జెలమ్మగుట్టపైకి నీటిని పంపింగ్ చేస్తారు. గుట్టపై భూతల భాండాగారాన్ని నిర్మిస్తారు. ఇందులోకి వచ్చిన నీటిని మూడు వైపులకు వెళ్లే విధంగా చానల్స్‌ను ఏర్పాటుచేస్తారు. గుట్టపై నుంచి మండలంలోని చెరువులు, కుంటలకు నీళ్లను గ్రావిటీఫ్లో ద్వారా వెళ్లేవిధంగా కాల్వలను తవ్వుతారు. ఇలా మండలంలోని దాదాపు 30 నుంచి 40 చెరువుల కుంటలను నీటితో నింపుతారు. వీటితో పాటు లిప్టు ద్వారా అదనంగా 3500 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయితే గట్టు మండలంలోని చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకుంటుంది. -
సౌర వెలుగులు సోకేనా?
గద్వాల, న్యూస్‌లైన్: గద్వాల డివిజన్లోని గట్టు మండలంలో సన్బార్న్ అనే ప్రైవేట్ సంస్థ నిర్మించతలపెట్టిన సౌరవి ద్యుత్ కేంద్రం అతీగతి లేకుండాపోయింది. మూడేళ్లక్రితమే రైతుల నుంచి కంపెనీ ప్రతినిధులు కేం ద్రం ఏర్పాటుకు అవసరమయ్యే భూమిని సేకరిం చినా ఈ ప్రతిపాదనకు మోక్షం లేకుండానే కాలం గ డుపుతున్నారు. జిల్లాలోనే అత్యంత వర్షాభావ ప రిస్థితులను ఎదుర్కొంటున్న గట్టు, ధరూరు, మల్దక ల్ మండలాలను కరువు ప్రాంతాలుగా పేర్కొం టారు. గట్టు మండలంలో 1992లో శాటిలైట్ ద్వా రా తీసిన చిత్రం ఆధారంగా కరువును తలపించే ప రిస్థితులు నెలకొని ఉన్నాయని శాస్త్రవేత్తలు సూ చించారు. అతితక్కువ వర్షపాతం నమోదయ్యే గ ట్టు మండలంలో ఇసుక నేలలు ఉన్నారు. ఈ ప్రాం తంలో వేడిగాలుల ఉధృతి కూడా ఉంటుంది. ఎండవేడిలో రేడియేషన్, గాలివీచే వే గం కూడా ఎక్కువే. పరిస్థితులు అనుకూలించే ఇలాంటి ప్రాంతంలో సౌరవి ద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అనుకూలం గా ఉంటుందని పలు ప్రైవేట్ సంస్థలు గుర్తించాయి. ఈ క్రమంలోనే ఇక్కడ సౌరవిద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పేందుకు సన్బార్న్ అనే కంపెనీ నాలుగేళ్ల క్రితం ముందుకొచ్చింది. రేడియేషన్ ఆధారంగా గుర్తింపు సూర్యకాంతి రేడియేషన్ ఆధారంగా ఇ క్కడ సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటుచేసి, 50 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేయాలనే లక్ష్యంతో ప్రవాస భారతీ యులకు చెందిన సన్బార్న్ అనే ప్రైవేట్ కంపెనీ సంకల్పించింది. సంస్థ ప్రతి నిధులు మూడేళ్ల క్రితం గట్టు మండలా న్ని సందర్శించి, స్థానిక రాజకీయ నా యకుల సహకారంతో వ్యవసాయానికి ఉపయోగపడని సుమారు 200 ఎకరాల భూమిని సౌరవిద్యుత్ కేంద్రం నిర్మా ణం కోసం సేకరించారు. గతంలోనే 80 శాతం భూములను రైతుల నుంచి కొనుగోలు చేసి డబ్బు చెల్లించారు. మిగతా భూములకు ఇంకా డబ్బులు చెల్లించాల్సి ఉంది. కంపెనీ ఏర్పాటు ప్రక్రియ మూడేళ్లుగా ఆరంభం కాకపోవడంతో పొలాలను అమ్మిన రైతులే పంటలు సాగుచేసుకుంటున్నారు. విద్యుదుత్పత్తి ఇలా.. సన్బార్న్ కంపెనీ 50 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో దాదాపు వెయ్యికోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును నిర్మించాలని భావించింది. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న సౌరవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో మాదిరిగా ఇక్కడ ఫొటో విద్యుత్‌ను ఉత్పత్తి చేయరు. సిలికాన్ ప్లేట్ల ఆధారంగా వచ్చిన విద్యుత్‌ను నీటిని వేడి చేసే బాయిలర్లకు అనుసంధానం చేస్తారు. బాయిలర్ల నుంచి ఉత్పత్తి అయ్యే ఆవిర్ల ద్వారా జనరేటర్లను నడిపి ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని సంకల్పించారు.