ఆడిట్లు సరే...మరి యాక్షనో? | Minister noted that the social and check | Sakshi
Sakshi News home page

ఆడిట్లు సరే...మరి యాక్షనో?

Published Tue, Jun 10 2014 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM

ఆడిట్లు సరే...మరి యాక్షనో?

ఆడిట్లు సరే...మరి యాక్షనో?

‘ఉపాధి’ అక్రమార్కులపై చర్యలు శూన్యం
రికార్డులను మాయం చేసిన వారిపై కూడా...
గద్వాల డివిజన్‌లో 18.5 కోట్ల రికార్డులు గల్లంతు
గట్టులో అత్యధికంగా 1.92 కోట్ల
అక్రమాలను గుర్తించిన అధికారులు
అయిజ, వడ్డేపల్లి, ఇటిక్యాల, ధరూర్,
మల్దకల్, గద్వాలలో వెలుగుచూసిన అక్రమాలు
అన్ని మండలాల్లోనూ అరకొర చర్యలే!

 
గద్వాల: నియోజకవర్గంలోని గట్టు మం డలంలో అత్యధికంగా అక్రమాలు జరిగి నట్లు అధికారులు సామాజిక తనిఖీలలో గుర్తించారు. అక్కడ రూ.1.92కోట్ల అక్రమాలను గుర్తించినా, రూ.54,322లు మాత్రమే రికవరీ చేశారు. ఉద్యోగంలో ఉ న్న వారి అక్రమాలపై వసూళ్లను నెలవారీ కటింగ్‌లతో, ఉద్యోగులు కాని వారి అక్రమాల సొమ్మును రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా వసూళ్లు చేస్తామని అధికారులు ప లుమార్లు ప్రకటించారు.

రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను ఉపయోగించి వసూళ్లు చేసే అ ధికారాన్ని తహశీల్దార్లకు అప్పగించామని జిల్లా అధికారులు చెబుతున్నా, ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని తహశీ ల్దార్లు అంటున్నారు. మరోవైపు రెవెన్యూ రికవరీ యాక్టు ద్వారా నిధులను కాజేసిన వారి నుంచి వసూళ్లు లేకపోయినా, ఉపా ధి అక్రమాలపై సామాజిక తనిఖీలను చే స్తూనే ఉన్నారు. అధికారులు ఏ స్థాయిలో అక్రమాలను తేల్చినా అవి కాగితాలకే పరిమితం కాక తప్పదు.
 
గుర్తించిన అక్రమాల విలువ...
గట్టులో రూ.1.92 కోట్లు అక్రమంగా  కా జేసినట్లు అధికారులు తేల్చినా, ఈ లెక్క ను కుదించే ప్రయత్నాలు జరిగాయి. అ యిజలో రూ.18 లక్షలు, వడ్డేపల్లిలో రూ.13 లక్షలు, ఇటిక్యాలలో రూ.12 లక్ష లు, ధరూరులో రూ.8 లక్షలు, మల్దకల్ లో రూ.15 లక్షలు, గద్వాలలో గతంలో రూ. 3 లక్షల అక్రమాలు ఉండగా, ఫిబ్రవరిలో నిర్వహించిన సామాజిక తనిఖీలో మరో లక్ష రూపాయలఅక్రమాలు వెలుగు చూశాయి. ఇలా అన్ని మండలాల్లోనూ అక్రమాలు వెలుగు చూసినా చర్యలు మాత్రం కనిపించడం లేదు.

కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు...
 గట్టు మండలంలో ఉపాధి హామీ అక్రమాలకు కారకులుగా భావించి ఒక ఎంపీడీఓ, 18మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐదుగురు టెక్నికల్ అసిస్టెంట్లను గతంలో తొలగించారు. అయిజలో ఇద్దరు ఫీల్డ్ స్టాఫ్‌పై చర్యలు తీసుకున్నారు. మల్దకల్ మండలంలో జరిగిన అక్రమాలకు బా ధ్యులుగా ఐదుగురు ఫీల్డ్ అసిస్టెంట్లను, ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లను పక్కనబెట్టారు. ధరూరు మండలంలో నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు, 21మంది మేటీలను తొ లగించారు. గద్వాల మండలంలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్, ఇద్దరు టీఎఫ్‌లకు షోకాజ్‌లిచ్చారు.  

రికార్డుల గల్లంతుపై చర్యలెక్కడ?
 డివిజన్‌లో దాదాపు రూ.18 కోట్ల విలువై న ఉపాధి పనులకు రికార్డులు గల్లంతయ్యాయి. ఇంత జరిగిందని తెలిసినా చర్యలు లేకపోవడం విశేషం. అలంపూర్ మండలంలో దాదాపు రూ.10 కోట్ల విలువైన ఉపాధి రికార్డులు, గట్టు మండలంతో రూ.5 కోట్ల విలువైన రికార్డులు, అయిజ మండలంలో రూ.3.5 కోట్ల విలువైన పనుల రికార్డులను సామాజిక తని ఖీల వేదిక వద్దకు రాకుండా గల్లంతు చేశారు. రికార్డులు ఎలా గల్లంతయ్యా యి, బాధ్యులు ఎవరనే విషయంపై జిల్లా అధికారులు తీవ్రంగా స్పందించి విచార ణ చేపట్టకపోవడంతో నేటికీ రికార్డుల విషయం అంతుబట్టని ప్రశ్నగానే మిగిలింది.
 
 చర్యలకు ఆదేశాలు ఇవ్వలేదు
 నేను ఏపీడీగా బాధ్యతలు మూడు నెలల క్రితమే తీసుకున్నాను. గతంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి నాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రస్తుతం అన్ని మండలాల్లో ఉపాధిహామీ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. పల్లెల్లో వ్యవసాయ కూలీలకు పనిదినాలు కల్పిస్తున్నాం.
 - ఏపీడీ గోపాల్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement