Revenue recovery act
-
ఐదుగురు రైతులకు హైకోర్టు జరిమానా
సాక్షి, అమరావతి: ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) దుర్వినియోగం చేయడమే కాకుండా న్యాయస్థానం ముందు వాస్తవాలను దాచి పెట్టినందుకు కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు రైతులకు హైకోర్టు భారీ జరిమానా విధించింది. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని రెండు వారాల్లో చెల్లించాలని ఆదేశించింది. వారు ఆ మొత్తాన్ని చెల్లించకపోతే రెండు నెలల్లో ఆ డబ్బును రెవెన్యూ రికవరీ చట్ట నిబంధనల మేరకు రికవరీ చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. తాము చిన్న రైతులమని, అంత జరిమానా చెల్లించలేమని ఆ రైతులు వేడుకున్నా హైకోర్టు అంగీకరించలేదు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏమిటీ కేసు... కర్నూలు జిల్లా అవుకు మండలం సంగపట్నం గ్రామ పరిధిలో ప్రమీల అనే మహిళ మైనింగ్ లీజు పొందారు. తరువాత మైనింగ్ కోసం ఇచ్చిన నిరభ్యంతర పత్రాన్ని స్థానిక తహసీల్దార్ ఉపసంహరించుకున్నారు. దీంతో ప్రమీల మైనింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీనిపై ఆమె హైకోర్టులో పిటిషన్ వేసి, సానుకూల ఉత్తర్వులు పొందారు. ప్రమీల పొందిన సానుకూల ఉత్తర్వులను దాచిపెట్టి, అదే మైనింగ్ లీజుపై కొలిమిగుండ్ల మండలం బెలుం శింగవరం గ్రామానికి చెందిన ఎం.రమణారెడ్డి, మరో ఐదుగురు రైతులు 2011లో హైకోర్టులో ‘పిల్’ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, మైనింగ్ లీజుపై స్టే ఇచ్చింది. న్యాయవాదినే బెదిరిస్తారా? పలు వాయిదాల అనంతరం ఇటీవల ఈ వ్యాజ్యం సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. రమణారెడ్డి తదితరుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వ్యాజ్యంలో ఇకపై వాదనలు వినిపించవద్దని రమణారెడ్డి తదితరులు లేఖ రాశారంటూ ఆ లేఖను ధర్మాసనం ముందుంచారు. ఆ లేఖను పరిశీలించిన ధర్మాసనం, రమణారెడ్డి తదితరులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాదనలు వినిపిస్తే బార్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని న్యాయవాదిని బెదిరిస్తారా? అంటూ మండిపడింది. మంగళవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, రమణారెడ్డి తదితరులను పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. ధర్మాసనం ఈ కేసు రికార్డులను పరిశీలించింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఓ ఎమ్మెల్యే ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. న్యాయవాదిని బెదిరిస్తూ లేఖ రాయడం, కోర్టు ముందు వాస్తవాలు దాచిపెట్టిడం ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దుర్వినియోగం చేయడమేనని తేల్చి చెప్పింది. ఆరుగురు పిటిషనర్లలో ఒకరు చనిపోవడంతో మిగిలిన ఐదుగురికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. -
రెవెన్యూ రికవర్రీ!
సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : ప్రభుత్వానికి బకాయిలు చెల్లించాల్సిన వారు డిఫాల్ట్ అయినప్పుడు, సంస్థలు మూతపడినప్పుడు, ప్రభుత్వ పథకాల్లో అక్రమాలకు పాల్పడ్డప్పుడు, ప్రభుత్వం నుంచి రావాల్సిన దాని కన్నా అదనంగా బకాయిలు పడినప్పుడు వాటిని రాబట్టడం కోసం నోటీసులు ఇస్తారు. నోటీసులకు స్పందించని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా వారికి ఉన్న ఆస్తులను వేలం వేసి ఆ డబ్బులు జమ చేస్తారు. అయితే గత ప్రభుత్వ హయాం నుంచి ఈ బకాయిలు వసూలు చేయకపోవడం వల్ల ఇవి కొండంత పెరిగిపోయాయి. జిల్లాలో ఎక్కువగా డ్వామా, సినిమా థియేటర్ల నుంచి రావాల్సిన బకాయిలు, భూసేకరణలో జరిగిన అక్రమాలకు సంబంధించిన బకాయిలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. డివిజన్ల వారీగా బకాయిలు ఇలా.. ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 93 మంది వ్యక్తులు, సంస్థల నుంచి రూ.122 కోట్ల 96 లక్షలు రావాల్సి ఉంది. కొవ్వూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 46 మంది వ్యక్తుల నుంచి రూ.11 కోట్ల 87 లక్షలు రావాల్సి ఉండగా, నరసాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో 38 మంది వ్యక్తుల నుంచి రూ.8 కోట్ల 22 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. జంగారెడ్డిగూడెం సబ్‌డివిజన్ పరిధిలో 23 మంది వ్యక్తుల నుంచి రూ.11 కోట్ల 13 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. భూ సేకరణ అక్రమాలు అ‘ధనం’ వీటికి భూసేకరణ అక్రమాలు అదనంగా తోడయ్యాయి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు గిరిజనేతరులకు ఇళ్ల నిర్మాణానికి జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ పరిధిలోని తాడువాయి, మంగిశెట్టిగూడెం, చల్లవారిగూడెం గ్రామాల పరిధిలో సుమారు 1100 ఎకరాల భూమిని గత ప్రభుత్వ హయాంలో సేకరించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద కుక్కునూరు, వేలేరుపాడు నిర్వాసితులకు తొలివిడతగా ఇళ్లు నిర్మించేందుకు ఈ భూములు సేకరించారు. అయితే ఈ భూముల సేకరణలో భారీ అవినీతి కూడా గత ప్రభుత్వ హయాంలోనే జరిగింది. పోలవరం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అవినీతిపై ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన భూముల్లో లేనివి ఉన్నట్లు చూపించి రూ.కోట్ల పరిహారాన్ని నొక్కేశారు. వర్జీనియా పొగాకు బ్యారన్లు లేకపోయినా ఉన్నట్లు, వ్యవసాయ బోర్లు లేకపోయినా ఉన్నట్లు, లేని మామిడి తోటలు, కోకో, ఆయిల్‌పామ్, కొబ్బరి తోట తదితర పంటలు ఉన్నట్లు తప్పుడు రికార్డులు సృష్టించి రూ.కోట్లు నొక్కేశారు. దీనికి అధికారులు, సిబ్బంది కూడా తమ వంతు సహకారం అందించారు. అయితే ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో అధికారులు స్పందించి వరుసగా మూడుసార్లు సర్వే చేశారు. ఈ సర్వేల్లో అవినీతి బయటపడటంతో వివిధ శాఖలకు సంబంధించిన సుమారు 13మందిని విధుల నుంచి తొలగించారు. సర్వేల అనంతరం చివరకు అవినీతి జరిగిందని గుర్తించి రైతులకు చెల్లించిన పరిహారం సొమ్ము రికవరీకి నడుంబిగించారు. స్పందించని రైతులు ఇందుకోసం ఏయే రైతులు అవినీతికి పాల్పడ్డారో గుర్తించి, లేనివి ఉన్నట్లు చూపించి అదనంగా పొందిన సొమ్ములు రికవరీ చేసేందుకు నోటీసులు జారీ చేశారు. ఇలా మూడుసార్లు రైతులకు నోటీసులు జారీ చేసినా ఏ ఒక్కరూ స్పందించలేదు. అయితే అధికారులు నోటీసులు జారీ చేయడంతో కేవలం రూ. 97 లక్షలు మాత్రం రికవరీ అయినట్లు తెలుస్తోంది. మిగిలిన రూ.16 కోట్ల పైచిలుకు సొమ్ము రైతుల నుంచి రివకరీ కావాల్సి ఉంది. తాడువాయి భూసేకరణలో అవినీతికి పాల్పడిన 51 మందిని అధికారులు గుర్తించారు. మూడు సార్లు నోటీసులు ఇచ్చినా రైతులు స్పందించకపోవడంతో చివరకు ఐటీడీఏ పీఓ, భూసేకరణ అధికారి హరీంద్రియ ప్రసాద్, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించారు. అయితే అధికారులు వేగంగా స్పందించకపోవడంతో అక్రమార్కులు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. తాజాగా జిల్లా అధికారులు ఈ బకాయిల వసూలుపై దృష్టి పెట్టారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్డి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఆర్ఆర్ యాక్టు బకాయిల వసూలుపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఇటీవల వరదలు రావడంతో కొంత ఆలస్యమైందని, త్వరలోనే ఈ బకాయిలు అన్నీ వసూలు చేస్తామని జాయింట్ కలెక్టర్ ‘సాక్షి’కి తెలిపారు. -
ఎగవేతదారులపై ‘రికవరీ’ అస్త్రం!
సాక్షి, హైదరాబాద్: కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఎగవేతదారులపై కఠిన చర్యలకు పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది. ప్రభుత్వానికి బకాయిలు చెల్లించని మిల్లర్లపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని (ఆర్.ఆర్.యాక్ట్) ప్రయోగించాలని నిర్ణయించింది. ఈ చట్టాన్ని వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలు చేయడానికి కార్యాచరణ రూపొందించింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు కస్టమ్ మిల్లింగ్ విధానం కింద పౌరసరఫరాల శాఖ మిల్లర్లకు ధాన్యం అప్పగిస్తోంది. ఈ నేపథ్యంలో 2010–11 నుంచి 2013–14 వరకు 115 మంది మిల్లర్లు బియ్యం ఇవ్వకుండా ఎగ్గొట్టారని, వాటి విలువ రూ.150 కోట్ల వరకు ఉంటుందని ఆ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ బియ్యాన్ని సొంత అవసరాల కోసం వాడుకుని బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న వ్యాపారులతో ఇప్పటికే ఆ శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు. బకాయి చెల్లింపులకు ఏడాది పాటు వెసులుబాటు కల్పించారు. బకాయిలు చెల్లిస్తే కేసులు ఎత్తివేస్తామని హామీ కూడా ఇచ్చారు. అయినా మిల్లర్ల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో ఆర్.ఆర్.యాక్టు కింద కేసులు నమోదు చేసి ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి కసరత్తు ప్రారంభించారు. ఈ చట్టం ద్వారా ముందుగా నోటీసులు జారీ చేసి, తర్వాత కొంత సమయం ఇచ్చి సదరు మిల్లర్ బ్యాంక్ అకౌంట్ అటాచ్ చేసుకుంటారు. అవసరమైతే స్థిర, చరాస్తులను వేలం వేస్తారు. బకాయిలను రాబట్టుకునేందుకు బకాయిదారులు ఆస్తులను గుర్తించాలని ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా 115 మంది మిల్లర్లలో 24 మంది మిల్లర్లు మాత్రమే రూ.22.54 కోట్ల విలువైన బియ్యం బకాయిలు చెల్లించగా, 91 మంది మిల్లర్ల నుంచి రూ.128 కోట్లు విలువ చేసే బియ్యం రావాల్సి ఉంది. ఈ ఖరీఫ్‌లోనైనా మొత్తం బకాయిలో 50 శాతం అప్పగించడానికి వీలుగా ఈనెల 30వ తేదీ వరకు గడువు విధించారు. ఎవరూ తప్పించుకోలేరు: సీవీ ఆనంద్ ‘బకాయిల విషయంలో మిల్లర్లతో అనేకమార్లు సంప్రదింపులు జరిపాం. 2016–17 రబీ సీజన్లో ధాన్యం కేటాయింపులకు సంబంధించి పాత బకాయిల్లో 50 శాతం సీఎంఆర్ బకాయిలను ’రా’ రైస్ రూపంలో కానీ, చెక్కులు, డీడీల రూపంలో కానీ చెల్లించాలని, మిగిలిన 50 శాతానికి సంబంధించి బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని కోరాం. పూచీకత్తు మీద మరో ఇద్దరు రైస్ మిల్లర్ల హామీ ఇవ్వాలని, రైస్ మిల్లర్ల సంఘం పూచీ పెట్టాలన్న నిబంధనల్లో వెసులుబాటు కల్పించి, ఏడాదిపాటు సమయం ఇచ్చాం. బకాయిలు చెల్లించని వారిపై ఆర్.ఆర్.యాక్టు ప్రయోగిస్తాం. 91 మంది మిల్లర్లలో కొంతమంది అందుబాటులో ఉన్నారు. కొందరు అజ్ఞాతంలో ఉన్నారు. వారిని వెతికి పట్టుకుని కేసులు నమోదు చేస్తాం. బకాయిలు చెల్లించకుండా ఎవరూ తప్పించుకోలేరు’. -
రెవెన్యూ రిక‘వర్రీ’!
సాక్షి, హైదరాబాద్: పేరుకుపోయిన బకాయిలు రాబట్టుకోవడం పన్నుల శాఖకు పెద్ద సమస్యగా మారింది. నోటీసులిచ్చినా, చివరకు రెవెన్యూ రికవరీ చట్టం కింద తాఖీదులు జారీ చేసినా డీలర్ల నుంచి స్పందన లేకపోవడం, జీఎస్టీ అమలు నేపథ్యంలో డీలర్ల పట్ల పన్నుల శాఖ సిబ్బంది మెతక వైఖరి కారణంగా ఈ బకాయిలు ఇప్పట్లో వసూలయ్యేలా కనిపించట్లేదు. రూ.322 కోట్లకు పైగా పన్ను బకాయిల కోసం ఆర్ఆర్ చట్టం కింద నోటీసులు జారీ చేసి 4 నెలలవుతున్నా ఫలితం లేకపోవడం గమనార్హం. లొసుగులే ఆసరాగా.. మొండి బకాయిలు రాబట్టుకునేందుకు పన్నుల శాఖ ప్రయోగించే చివరి అస్త్రం రెవెన్యూ రికవరీ చట్టం. ఈ చట్టం కింద నోటీసులు జారీ చేసిన తర్వాత కొంత సమయం ఇచ్చి సదరు డీలర్ బ్యాంక్ అకౌంట్ అటాచ్ చేసుకోవడం, అవసర మైతే స్థిర, చరాస్తుల వేలం ద్వారా పన్నులను రాబట్టుకునే వెసులుబాటు ఉంది. అయితే ఈ చట్టంలోని లోసుగుల ఆధారంగా డీలర్లు కోర్టులకు వెళుతుండటం, అసెస్మెంట్లలో తప్పులున్నాయంటూ నోటీసులకు సమాధానా లిచ్చి కాలం గడిపే ప్రయత్నాలు చేస్తున్నారు. జీఎస్టీ రాకతో పెండింగ్‌లోకి.. జీఎస్టీ రాకతో మొండి బకాయిల ఫైల్ పెండిం గ్లో పడిపోయింది. జూన్ నుంచి జీఎస్టీ అమలు చేయడంలో మునిగిపోయిన అధికారులు బకాయిలపై దృష్టి సారించలేదు. ఆగస్టు తర్వాత ఉన్న తాధికారులు బకాయిల వసూలుకు అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అయినా క్షేత్ర స్థాయిలో స్పందన లేకపోవడంతో పాత బకాయి లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దంటూ మరోసారి ఉత్తర్వులు జారీ చేశారు. జీఎస్టీ అమలు వల్ల డీలర్లను, అధికారులను సాంకేతిక సమస్యలు వేధిస్తుండటంతో పూర్తిస్థాయిలో ఆ పనిపై దృష్టి సారించలేక పోతున్నామని పన్నుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
‘బోగస్’లపై ఆర్ఆర్ కొరడా
శ్రీకాకుళం సిటీ: గత ప్రభుత్వాల హయాంలో బోగస్ కార్డులతో చాలామంది లబ్ధి పొందారని, విచారణ జరిపి అటువంటి వారిపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించి ప్రభుత్వ నిధులను కక్కిస్తామని రాష్ట్ర మంత్రి కె.అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి అధ్యక్షతన జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సుమారు లక్ష మంది బోగస్ జాబ్ కార్డుదారులున్నారని, ఏ ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా ఎంత నిధులు తిన్నారో తేల్చాలని ఆదేశించారు. బోగస్ రేషన్ కార్డులతో బియ్యాన్ని మింగిన డీలర్లపైనా విచారణ జరిపి రికవరీ చేయించాలని ఆదేశించారు. అక్టోబర్ 2 నుంచి పింఛన్ల పెంపు, జన్మభూమి-మా ఊరు వంటి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించనుందని చెప్పారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పలు అభివృద్ధి పనులు చేపడతారన్నారు. ఫించ న్లను ఏరివేయడానికే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అర్హులెవరికైనా ఫింఛన్ ఆగిపోతే నేరుగా తననే అడగవచ్చని మంత్రి అన్నారు. అనర్హులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించేది లేదన్నారు. అనంతరం సీఎం వీడియో కాన్ఫరెన్స్ ఉందంటూ మంత్రి వెళ్లిపోవడంతో ప్రభుత్వ విప్ కూన రవికుమార్ సమావేశాన్ని నడిపించారు. గత పదేళ్లలో అనర్హులే ఎక్కువగా పింఛన్లు పొందారని కాగ్ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. చనిపోయిన వారికి, వలస వెళ్లిన వారికి పింఛన్లు ఎలా ఇచ్చారన్న దానిపై విచారణ చేపట్టాలని భావిస్తున్నామన్నారు. ఫించన్ల సర్వేపై గరం గరం కాగా పెన్షనర్ల వివరాల సేకరణకు ఇటీవల జరిగిన సర్వే తీరుపై వైఎస్ఆర్సీపీ సభ్యులు ధ్వజమెత్తడంతో ఈ అంశంపై వాడీవేడిగా చర్చ జరిగింది. మొదట మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పింఛన్ల పంపిణీలో రాజకీయాలు చేయడం లేదని, అర్హులైన వారికి పార్టీలకు అతీతంగా పించన్ ఇస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే కలమట వెంకటరమణ స్పందిస్తూ గ్రామాల్లో టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని, అర్హుల పేర్లు జాబితాల్లో లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. పింఛన్ల పరిశీలన, ఎంపిక అంతా గ్రామ సర్పంచ్‌లకు సైతం చెప్పకుండా టీడీపీ కార్యకర్తలతోనే చేయిస్తున్నారెందుకంటూ నిలదీశారు. పింఛన్ల తుది జాబితాలను టీడీపీ కార్యకర్తలే తయారు చేస్తున్నారని, దీంతో అర్హులు బాధితులవుతున్నారని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఆరోపించారు. గుర్తింపు కార్డుల్లో వయస్సు సమస్యలున్నాయని, దీంతో వృద్ధులకు పింఛన్లు అందే పరిస్థితి లేదని అన్నారు. ఎమ్మెల్యేలకు మద్దతుగా వైఎస్ఆర్సీపీకి చెందిన టెక్కలి, నందిగాం, బూర్జ, రాజాం జెడ్పీటీసీలు కర్నిక సుప్రియ, కురమాన బాలకృష్ణ, ఎ.రామకృష్ణ, టి. పాపినాయుడు తదితరులు పోడియం వద్దకు వెళ్లి తమ వాదన విన్పించారు. మంత్రి స్పందిస్తూ ఇటువంటి వాటిని ఎక్కడా ప్రోత్సహించడం లేదని, గ్రామ, మండల కమిటీలు ఆమోదం తెలుపకపోతే, జిల్లా కమిటీ ఉంటుందని, దానికి తానే చైర్మన్ కాబట్టి నేరుగా తనకే చెప్పాలని సూచించారు. అలాగే వయస్సు విషయంలో ఎక్కువ వయసు నమోదైన కార్డునే ప్రామాణికం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా ప్రతిపక్షం ఆరోపణలతో తాను ఏకీభవిస్తున్నానని, అయితే పింఛన్ల పంపిణీ ప్రారంభం కాకముందే ఇలా రచ్చ చేయడం ఎందుకని ఎమ్మెల్యే శివాజీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రంగు మారింది కదా.. ఇంకెందుకు వాళ్లకు చర్చలకు అవకాశం ఇవ్వడం.. అదే విషయం చెప్పండి అంటూ మంత్రి అచ్చెన్నకు సూచించారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ 45 ఏళ్లు దాటిన అవివాహితులకు కూడా పింఛన్ ఇవ్వాలని కోరారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట మాట్లాడుతూ జిల్లా కమిటీలో ఎమ్మెల్యేలకు కూడా స్థానం కల్పించాలని కోరారు. పాలకొండ జెడ్పీటీసీ సామంతుల దామోదరం మాట్లాడుతూ పలు గ్రామాల్లో పింఛన్లు రద్దు చేయకుండా తీర్మానాలు చేసుకుంటున్నారని తెలిపారు. దీనిపై మంత్రి స్పందిస్తూ అలా చేస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూరియా ఎప్పుడిస్తారండీ? యూరియా కొరతపైనా వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి పంట పొట్ట దశకు చేరుకున్నా ఇంతవరకు యూరియా సక్రమంగా సరఫరా కావడంలేదని వారు ఆరోపించారు. వ్యవసాయ శాఖపై చర్చలో ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పాల్గొంటూ పలు మండలాల్లో ఎరువుల కొరత ఉందని, బ్లాక్ మార్కెట్లో విక్రయాలు పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జెడ్పీటీసీ చిట్టి జనార్ధనరావు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. నందిగాం ఎంపీపీ విశ్వశాంతి మాట్లాడుతూ తమ మండలంలో ఒక సొసైటీ పరిధిలో 40 గ్రామాలుంటే, మరో సొసైటీ లో 150 గ్రామాలున్నాయని, అయితే ఈ రెండు సొసైటీలకూ ఒక్కొక్క లోడు యూరియా ఎలా కేటాయిస్తున్నారని ప్రశ్నించారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ జిల్లాకు సరిపడ యూరియా త్వరలో రానుందని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడానని చెప్పారు. వ్యవసాయ శాఖ జేడీ మాట్లాడుతూ వారం తర్వాతే యూరియా వస్తుందని, జిల్లాలోని 40 సొసైటీల్లో 500 టన్నుల యూరియా అందుబాటులో ఉంచామని వివరించారు. రైతులు సొసైటీల ద్వారా చెల్లిస్తున్న బీమా డబ్బును రుణమాఫీగా చూపించేలా వచ్చిన జీవో 174పై బూర్జ జెడ్పీటీసీ రామకృష్ణ ప్రశ్నించారు. దీనికి విప్ రవికుమార్ స్పందిస్తూ జీవో వివరాలను చదివి విన్పించారు. అనంతరం ఉపాధి హామీ, అటవీ శాఖ, హౌసింగ్ తదితర శాఖలపై చర్చించారు. అధికారుల తీరుపై ఎమ్మెల్యేల ఆగ్రహం 2011 నుంచి 2014 వరకు జెడ్పీ కార్యాలయ ఖర్చు రూ. 2.55 కోట్లు చూపడంపై ఎమ్మెల్యే కలమట ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఖర్చుల వివరాలు ఇవ్వాలని మూడు నెలల నుంచి అడుగుతున్నా అధికారుల నుంచి సమాధానం లేదన్నారు. అలాగే జెడ్పీ ప్రాంగణంలో రూ.74.51 లక్షల ఎస్ఎఫ్సీ నిధుల వినియోగం వివరాలు కూడా ఇవ్వలేదని నిలదీశారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను కక్ష పూరితంగానే తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే శివాజీ మాట్లాడుతూ హరిపురంలో ఒక ఎరువుల వ్యాపారి బ్లాక్ మార్కెట్‌కు పాల్పడుతున్నారని, బిల్లులు ఇవ్వకుండా వ్యాపారం చేస్తున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని రెండు నెలల క్రితం తాను స్వయంగా వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయానికి వెళ్లి చెప్పినా స్పందన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. జేడీ సమాధానమిస్తూ తమ చర్యలు సత్ఫలితాలివ్వలేదని చెప్పడంతో జేసీ వీరపాండ్యన్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు చెప్పిన అంశాలను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ ఖండాపు జ్యోతి, ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బెందాళం అశోక్, ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసులు నాయుడు, పీరుకట్ల విశ్వప్రసాద్, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జెడ్పీ సీఈవో నాగార్జునసాగర్, డీసీసీబీ ఛైర్మన్ డోల జగన్, డీసీఎంఎస్ ఛైర్మన్ గొండు కృష్ణమూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ డీఎస్కే ప్రసాద్, పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. శివాజీ చురకలు ఈ సమావేశంలో ఎమ్మెల్యే శివాజీ తనదైన రీతిలో మాట్లాడుతూ మంత్రి, విప్, అధికారులకు చురకలంటించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నప్పుడు అడ్డుపడి.. మనం మాట్లాడటం కంటే జెడ్పీటీసీలు, ఎంపీపీలకు మాట్లాడే అవకాశమిద్దామని సూచించారు. ప్రభుత్వ విప్ రవికుమార్‌పై పలు సెటైర్లు సంధించారు. చీఫ్ విప్ రవి కుమార్ గారూ.. అని సంభోదిస్తూ ‘మీరు చాలా స్పీడ్‌గా ఉన్నారు. అసలు మీ చీఫ్ విప్ కూడా మా దగ్గర ఇంత స్పీడ్‌గా ఉండడు అంటూనే.. ఇంతకీ సమావేశం ఎజెండాను విధాన పరంగా రూపొందిస్తారా.. విప్ చెప్పినట్లు చేస్తారా.. అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. మరో సందర్భంలో ‘రవి గారికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువే.. అయితే తీర్మానాల విషయంలో అభ్యంతరాలు చెప్పవద్దని ప్రతిపక్షాన్ని అనడం కరెక్ట్ కాదు’ అని అన్నారు. -
ఆడిట్లు సరే...మరి యాక్షనో?
‘ఉపాధి’ అక్రమార్కులపై చర్యలు శూన్యం రికార్డులను మాయం చేసిన వారిపై కూడా... గద్వాల డివిజన్లో 18.5 కోట్ల రికార్డులు గల్లంతు గట్టులో అత్యధికంగా 1.92 కోట్ల అక్రమాలను గుర్తించిన అధికారులు అయిజ, వడ్డేపల్లి, ఇటిక్యాల, ధరూర్, మల్దకల్, గద్వాలలో వెలుగుచూసిన అక్రమాలు అన్ని మండలాల్లోనూ అరకొర చర్యలే! గద్వాల: నియోజకవర్గంలోని గట్టు మం డలంలో అత్యధికంగా అక్రమాలు జరిగి నట్లు అధికారులు సామాజిక తనిఖీలలో గుర్తించారు. అక్కడ రూ.1.92కోట్ల అక్రమాలను గుర్తించినా, రూ.54,322లు మాత్రమే రికవరీ చేశారు. ఉద్యోగంలో ఉ న్న వారి అక్రమాలపై వసూళ్లను నెలవారీ కటింగ్లతో, ఉద్యోగులు కాని వారి అక్రమాల సొమ్మును రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా వసూళ్లు చేస్తామని అధికారులు ప లుమార్లు ప్రకటించారు. రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను ఉపయోగించి వసూళ్లు చేసే అ ధికారాన్ని తహశీల్దార్లకు అప్పగించామని జిల్లా అధికారులు చెబుతున్నా, ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని తహశీ ల్దార్లు అంటున్నారు. మరోవైపు రెవెన్యూ రికవరీ యాక్టు ద్వారా నిధులను కాజేసిన వారి నుంచి వసూళ్లు లేకపోయినా, ఉపా ధి అక్రమాలపై సామాజిక తనిఖీలను చే స్తూనే ఉన్నారు. అధికారులు ఏ స్థాయిలో అక్రమాలను తేల్చినా అవి కాగితాలకే పరిమితం కాక తప్పదు. గుర్తించిన అక్రమాల విలువ... గట్టులో రూ.1.92 కోట్లు అక్రమంగా కా జేసినట్లు అధికారులు తేల్చినా, ఈ లెక్క ను కుదించే ప్రయత్నాలు జరిగాయి. అ యిజలో రూ.18 లక్షలు, వడ్డేపల్లిలో రూ.13 లక్షలు, ఇటిక్యాలలో రూ.12 లక్ష లు, ధరూరులో రూ.8 లక్షలు, మల్దకల్ లో రూ.15 లక్షలు, గద్వాలలో గతంలో రూ. 3 లక్షల అక్రమాలు ఉండగా, ఫిబ్రవరిలో నిర్వహించిన సామాజిక తనిఖీలో మరో లక్ష రూపాయలఅక్రమాలు వెలుగు చూశాయి. ఇలా అన్ని మండలాల్లోనూ అక్రమాలు వెలుగు చూసినా చర్యలు మాత్రం కనిపించడం లేదు. కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు... గట్టు మండలంలో ఉపాధి హామీ అక్రమాలకు కారకులుగా భావించి ఒక ఎంపీడీఓ, 18మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐదుగురు టెక్నికల్ అసిస్టెంట్లను గతంలో తొలగించారు. అయిజలో ఇద్దరు ఫీల్డ్ స్టాఫ్‌పై చర్యలు తీసుకున్నారు. మల్దకల్ మండలంలో జరిగిన అక్రమాలకు బా ధ్యులుగా ఐదుగురు ఫీల్డ్ అసిస్టెంట్లను, ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లను పక్కనబెట్టారు. ధరూరు మండలంలో నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు, 21మంది మేటీలను తొ లగించారు. గద్వాల మండలంలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్, ఇద్దరు టీఎఫ్‌లకు షోకాజ్‌లిచ్చారు. రికార్డుల గల్లంతుపై చర్యలెక్కడ? డివిజన్లో దాదాపు రూ.18 కోట్ల విలువై న ఉపాధి పనులకు రికార్డులు గల్లంతయ్యాయి. ఇంత జరిగిందని తెలిసినా చర్యలు లేకపోవడం విశేషం. అలంపూర్ మండలంలో దాదాపు రూ.10 కోట్ల విలువైన ఉపాధి రికార్డులు, గట్టు మండలంతో రూ.5 కోట్ల విలువైన రికార్డులు, అయిజ మండలంలో రూ.3.5 కోట్ల విలువైన పనుల రికార్డులను సామాజిక తని ఖీల వేదిక వద్దకు రాకుండా గల్లంతు చేశారు. రికార్డులు ఎలా గల్లంతయ్యా యి, బాధ్యులు ఎవరనే విషయంపై జిల్లా అధికారులు తీవ్రంగా స్పందించి విచార ణ చేపట్టకపోవడంతో నేటికీ రికార్డుల విషయం అంతుబట్టని ప్రశ్నగానే మిగిలింది. చర్యలకు ఆదేశాలు ఇవ్వలేదు నేను ఏపీడీగా బాధ్యతలు మూడు నెలల క్రితమే తీసుకున్నాను. గతంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి నాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రస్తుతం అన్ని మండలాల్లో ఉపాధిహామీ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. పల్లెల్లో వ్యవసాయ కూలీలకు పనిదినాలు కల్పిస్తున్నాం. - ఏపీడీ గోపాల్ -
అవినీతి ‘గూడు’
సాక్షి, కర్నూలు: ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ పథకం అక్రమార్కులకు వరంగా మారింది. నేతల అండ.. అధికారుల ఉదాసీనత కారణంగా మొదటి, రెండో విడత ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి గూడు కట్టుకుంది. ఎట్టకేలకు పాపం పండినా.. అక్రమార్కులు కాజేసిన నగదును రాబట్టడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలంలో అక్రమాలు పరాకాష్టకు చేరడంతో 2008లో గృహ నిర్మాణ సంస్థ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. నేతల ఒత్తిడి మధ్య చేపట్టిన విచారణలో ఎట్టకేలకు మండలంలోని బొందిమడుగుల, లింగనేనిదొడ్ది, రాతన, రాంపల్లి గ్రామాల్లో సుమారు రూ.2.50 కోట్లు దుర్వినియోగమైనట్లు తేల్చారు. అదేవిధంగా జిల్లాలో రూ.5.13 కోట్లు అక్రమార్కుల పరమైనట్లు గుర్తించారు. ఇందుకు 118 మంది హౌసింగ్ సిబ్బంది, 43 మంది మండల హౌసింగ్ అధికారులు, 38 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది, 15 మంది మధ్యవర్తులు, 1,402 మంది లబ్ధిదారుల పాత్ర ఉన్నట్లు వెల్లడించారు. వీరందరిపై 50 కేసులు నమోదు కాగా.. ఐదు కేసులను ఆర్ఆర్ చట్టం కింద నమోదు బనాయించారు. హౌసింగ్ సిబ్బంది, మధ్యవర్తులపై 8 క్రిమినల్ కేసులు పెట్టారు. దుర్వినియోగమైన నిధులను ఆర్ఆర్ చట్టం కింద రికవరీ చేయాలని నిర్ణయించారు. అయితే ఐదు సంవత్సరాలు గడిచినా రూ.19.72 లక్షలు మాత్రమే వసూలు చేయడం అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ సొమ్ములో హౌసింగ్ సిబ్బంది జీతం నుంచి రికవరీ చేసినదే రూ. 10,01,000 లక్షలు కాగా.. గ్రామ సమాఖ్య సభ్యుల నుంచి రూ.9.71 లక్షలు వసూలు చేయడం గమనార్హం. అసలు దుర్వినియోగానికి కారణమైన వారి నుంచి ఇప్పటికీ ఒక్క పైసా వసూలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. అంతులేని అవినీతి: జిల్లాలోని దేవనకొండ మండలంలో రూ.70 లక్షలు, కోడుమూరు మండలంలోని లద్దగిరి, గోరంట్ల గ్రామాల్లో రూ.2 కోట్లు దుర్వినియోగం కాగా ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది. బొందిమడుగుల, లింగనేనిదొడ్డి, రాతన గ్రామాల్లో రూ.2.50 కోట్లు దుర్వినియోగం కాగా.. బాధ్యులైన డీఈ, ఏఈలను ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది. డీఈ సుబ్రమణ్యం నుంచి రికవరీ చట్టం ద్వారా రూ.30 లక్షలు, ఏఈ ఆయూబ్ నుంచి రూ.10 లక్షలు రికవరీ చేయడానికి నోటీసులు జారీ చేయగా వారు కోర్టు కెక్కారు. మరో 36 మంది సిబ్బందిని ఉద్యోగం నుంచి తప్పించారు. అక్రమాలకు పాల్పడి ఇతర జిల్లాలో పనిచేస్తున్న హౌసింగ్ సిబ్బంది నుంచి రూ.13.57 లక్షల రికవరీకి విశ్వప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకపోతోంది. అదేవిధంగా కోర్టుల్లో వీగిపోయిన తొమ్మిది కేసులకు సంబంధించి మరో రూ.23.58 లక్షలు వసూలు కావాల్సి ఉంది. అక్రమార్కుల మాటేమిటి?: ఇళ్ల నిర్మాణం పేరిట అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు, అసలు ఇళ్లు నిర్మించకుండానే నిధులు కాజేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నకు సమాధానం లేదు. గృహ నిర్మాణ శాఖ లెక్కల ప్రకారం దుర్వినియోగమైన నిధులు రూ. 5.13 కోట్లు అయితే.. రికవరీ చేసింది రూ. 19.72 లక్షలు మాత్రమే. ఇంకా రూ.4.93 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఈ మొత్తం చెల్లించాల్సింది బోగస్ లబ్ధిదారులే. అయితే అధికారులు వీరి జోలికి వెళ్లకపోవడం గమనార్హం. -
సామాజిక తనిఖీలు సరే... రికవరీ ఏమైనట్లు?
గద్వాల, న్యూస్‌లైన్: పల్లెల్లో పేదోడికి పట్టెడన్నం దొరికేలా ఉపాధిని కల్పించడంతో పాటు, వలసల నివారణ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకా న్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో జరిగిన అక్రమాలపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి వసూళ్లు చేస్తామంటున్న అధికారుల ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో ‘ఉపాధి’ పనుల్లో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. సామాజిక తనిఖీల పేరిట ప్రతి మండలంలోనూ రెండు, మూడుసార్లు ప్రజల సమక్షంలో వి చారణ నిర్వహించారు. అందులో తేలిన అక్రమాలపై కిందిస్థాయి సిబ్బందిపై చర్య లు తీసుకోవడమే తప్పా, రికవరీలో చిత్తశుద్ధి చూపడం లేదు. డివిజన్‌లోనే అత్యధికంగా గట్టు మండలంలో అక్రమాలు జరిగి నట్లు అధికారులు గుర్తించారు. మండలం లో మొత్తం రూ.1.92 కోట్లు అక్రమాలు జరిగి నట్లు గుర్తించినా... ఇప్పటివరకు రూ.54,322 లు మాత్రమే వసూలు చేశారు. ఉద్యోగం లో ఉన్న వారి అక్రమాలపై వసూళ్లను నెల వారీగా వేతనంలో కోత విధించడం, ఉద్యోగులు కాని వారి నుంచి రికవరీ యాక్ట్ ద్వా రా వసూళ్లు చేస్తామని అధికారులు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను ఉపయోగించి వసూళ్లు చేసే అధికారాన్ని మండల తహశీల్దార్లకు అప్పగించామని జిల్లా అధికారులు చెబుతున్నా, ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని తహశీల్దార్లు చెబుతున్నారు.రెవెన్యూ రికవరీ యాక్టు ద్వారా నిధులను కాజేసి వారి నుంచి వసూళ్లు ప్రారంభించకపోయినా, ఉపాధి అక్రమాలపై సామాజిక తనిఖీలను చేస్తూనే ఉన్నారు. అధికారులు ఏస్థాయిలో అక్రమాలను తేల్చినా అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయి. గద్వాల డివిజన్లో ఉపాధి అక్రమాల చిట్టా... గట్టు, అలంపూర్, అయిజ మండలాలలో దాదాపు రూ. 18 కోట్ల విలువ చేసే ఉపాధి పనుల రికార్డులు గల్లంతయ్యాయి. ఇం దులో అలంపూర్ మండలంలో రూ. 10 కో ట్లు, గట్టులో రూ. 5 కోట్లు, అయిజలో రూ.3.5 కోట్ల విలువైన పనుల రికార్డులను సామాజిక తనిఖీల వేదిక వద్దకు రాకుండా గల్లంతు చేశారు. రికార్డులు ఎలా గల్లంతయ్యాయి, బాధ్యులు ఎవరనే విషయంపై జిల్లా అధికారులు తీవ్రం గా స్పందించి విచారణ చేపట్టక పోవడంతో నేటికీ రికార్డుల విషయం అంతుపట్టని ప్రశ్నగానే మిగిలింది. సామాజిక తనిఖీల్లో అక్రమాలను గుర్తించినా...ఉన్నతాధికారుల నుంచి కఠిన చర్యలు లేకపోవడంతో ఉపాధి అక్రమాలకు అంతేలేకుండా పోయింది. నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నప్పటికీ బెదరని కొందరు అధికారులు కొత్తరకం తరహాలో ప్రభుత్వ ధనాన్ని కా జేస్తూనే ఉన్నారు. గట్టులో రూ.1.92 కోట్లు అక్రమంగా కాజేసినట్లు అధికారులు తేల్చినా, ఈ లెక్కనుకు దించే ప్రయత్నాలు జరిగా యి. అయిజలో రూ.18 లక్షలు, వడ్డేపల్లిలో రూ.13 లక్షలు, ఇటిక్యాలలో రూ.12 లక్షలు, ధరూరులో రూ.8 లక్షలు, మల్దకల్లో రూ.15 లక్షలు, గద్వాలలో రూ.4 లక్షల వరకు అక్రమాలు జరిగినట్లు తేలింది. సిబ్బందిపై చర్యలు... గట్టు మండలంలో ఉపాధి హామీ అక్రమాలకు కారకులుగా భావించి ఒక ఎంపీడీఓ, 18మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐదుగు రు టెక్నికల్ అసిస్టెంట్లను గతంలో తొల గించారు. అయిజలో ఇద్దరు ఫీల్డ్ స్టాఫ్‌పై చర్యలు తీసుకున్నారు. మల్దకల్ మండలంలో ఐదుగురు ఫీల్డ్ అసిస్టెంట్లను, ఇద్ద రు టెక్నికల్ అసిస్టెంట్లను పక్కన పెట్టా రు. ధరూరు మండలంలో నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు, 21మంది మేటీలను తొల గించారు. గద్వాల మండలంలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్, ఇద్దరు టీఎఫ్‌లకు షోకాజ్‌లిచ్చారు.