గద్వాల, న్యూస్‌లైన్: పల్లెల్లో పేదోడికి పట్టెడన్నం దొరికేలా ఉపాధిని కల్పించడంతో పాటు, వలసల నివారణ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకా న్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో జరిగిన అక్రమాలపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి వసూళ్లు చేస్తామంటున్న అధికారుల ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో ‘ఉపాధి’ పనుల్లో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.
సామాజిక తనిఖీల పేరిట ప్రతి మండలంలోనూ రెండు, మూడుసార్లు ప్రజల సమక్షంలో వి చారణ నిర్వహించారు. అందులో తేలిన అక్రమాలపై కిందిస్థాయి సిబ్బందిపై చర్య లు తీసుకోవడమే తప్పా, రికవరీలో చిత్తశుద్ధి చూపడం లేదు. డివిజన్‌లోనే అత్యధికంగా గట్టు మండలంలో అక్రమాలు జరిగి నట్లు అధికారులు గుర్తించారు. మండలం లో మొత్తం రూ.1.92 కోట్లు అక్రమాలు జరిగి నట్లు గుర్తించినా... ఇప్పటివరకు రూ.54,322 లు మాత్రమే వసూలు చేశారు.
ఉద్యోగం లో ఉన్న వారి అక్రమాలపై వసూళ్లను నెల వారీగా వేతనంలో కోత విధించడం, ఉద్యోగులు కాని వారి నుంచి రికవరీ యాక్ట్ ద్వా రా వసూళ్లు చేస్తామని అధికారులు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను ఉపయోగించి వసూళ్లు చేసే అధికారాన్ని మండల తహశీల్దార్లకు అప్పగించామని జిల్లా అధికారులు చెబుతున్నా, ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని తహశీల్దార్లు చెబుతున్నారు.రెవెన్యూ రికవరీ యాక్టు ద్వారా నిధులను కాజేసి వారి నుంచి వసూళ్లు ప్రారంభించకపోయినా, ఉపాధి అక్రమాలపై సామాజిక తనిఖీలను చేస్తూనే ఉన్నారు. అధికారులు ఏస్థాయిలో అక్రమాలను తేల్చినా అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయి.
గద్వాల డివిజన్‌లో
ఉపాధి అక్రమాల చిట్టా...
గట్టు, అలంపూర్, అయిజ మండలాలలో దాదాపు రూ. 18 కోట్ల విలువ చేసే ఉపాధి పనుల రికార్డులు గల్లంతయ్యాయి. ఇం దులో అలంపూర్ మండలంలో రూ. 10 కో ట్లు, గట్టులో రూ. 5 కోట్లు, అయిజలో రూ.3.5 కోట్ల విలువైన పనుల రికార్డులను సామాజిక తనిఖీల వేదిక వద్దకు రాకుండా గల్లంతు చేశారు. రికార్డులు ఎలా గల్లంతయ్యాయి, బాధ్యులు ఎవరనే విషయంపై జిల్లా అధికారులు తీవ్రం గా స్పందించి విచారణ చేపట్టక పోవడంతో నేటికీ రికార్డుల విషయం అంతుపట్టని ప్రశ్నగానే మిగిలింది. సామాజిక తనిఖీల్లో అక్రమాలను గుర్తించినా...ఉన్నతాధికారుల నుంచి కఠిన చర్యలు లేకపోవడంతో ఉపాధి అక్రమాలకు అంతేలేకుండా పోయింది. నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నప్పటికీ బెదరని కొందరు అధికారులు కొత్తరకం తరహాలో ప్రభుత్వ ధనాన్ని కా జేస్తూనే ఉన్నారు. గట్టులో రూ.1.92 కోట్లు అక్రమంగా కాజేసినట్లు అధికారులు తేల్చినా, ఈ లెక్కనుకు దించే ప్రయత్నాలు జరిగా యి. అయిజలో రూ.18 లక్షలు, వడ్డేపల్లిలో రూ.13 లక్షలు, ఇటిక్యాలలో రూ.12 లక్షలు, ధరూరులో రూ.8 లక్షలు, మల్దకల్‌లో రూ.15 లక్షలు, గద్వాలలో రూ.4 లక్షల వరకు అక్రమాలు జరిగినట్లు తేలింది.
సిబ్బందిపై చర్యలు...
గట్టు మండలంలో ఉపాధి హామీ అక్రమాలకు కారకులుగా భావించి ఒక ఎంపీడీఓ, 18మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐదుగు రు టెక్నికల్ అసిస్టెంట్లను గతంలో తొల గించారు. అయిజలో ఇద్దరు ఫీల్డ్ స్టాఫ్‌పై చర్యలు తీసుకున్నారు. మల్దకల్ మండలంలో ఐదుగురు ఫీల్డ్ అసిస్టెంట్లను, ఇద్ద రు టెక్నికల్ అసిస్టెంట్లను పక్కన పెట్టా రు. ధరూరు మండలంలో నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు, 21మంది మేటీలను తొల గించారు. గద్వాల మండలంలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్, ఇద్దరు టీఎఫ్‌లకు షోకాజ్‌లిచ్చారు.
సామాజిక తనిఖీలు సరే... రికవరీ ఏమైనట్లు?
Published Sat, Sep 14 2013 4:31 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement