కరువు నెలలో సిరులు పండించాలని సంకల్పించారు. బీడువారిన నేలలను మాగాణి భూములుగా మార్చాలని తలంచారు.. మహోన్నత ఆశయంతో నిర్మించిన నెట్టెంపాడు ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా పాలకులు పాతాళంలోకి నెట్టేశారు. అంకితం పేరుతో అశ్రద్ధచూపి ఆయకట్టుకు నీటిని అందించలేకపోయారు. అరకొరగా నిధులు విదిల్చి అంగుళం పనికూడా ముందుకు సాగనీయకుండా చేశారు. అదిగో నీళ్లు.. ఇదిగో వచ్చే! అన్నారు. ఖరీఫ్ కాకపోతే.. రబీలో ఖాయమన్నారు. కళ్లుకాయలు కాసేలా ఎదురుచూసిన రైతులకు చివరికి నిరాశే మిగిలింది. తెలంగాణ ప్రభుత్వమైనా పనులు పూర్తిచేసి సాగునీరు అందించాలని ఈ ప్రాంత రైతాంగం కోరుతోంది.
గద్వాల, న్యూస్‌లైన్: గద్వాల డివిజ న్‌లో రెండులక్షల ఎకరాలకు సాగునీ రు అందించాలనే లక్ష్యంతో జలయజ్ఞంలో భాగంగా నెట్టెంపాడు ఎత్తిపోత ల పథకానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో మంజూ రుఇచ్చారు. అదే ఏడాది డిసెంబర్‌లో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లోని 8 మండలాలకు సాగునీరు అందించే విధంగా రూ.1428 కోట్ల అంచనావ్యయంతో పథక నిర్మాణాన్ని ప్రారంభించారు.
జూ రాల రిజర్వాయర్ నుంచి 21.425 టీఎం సీల కృష్ణానది నీటిని ఎత్తిపోతల ద్వారా రెండు లక్షల ఎకరాలకు అందించడంతోపాటు 148 గ్రామాలకు రిజర్వాయర్లు, ప్రధానకాల్వల ద్వారా తాగునీరు అం దించాలని భావించారు. నెట్టెంపాడు లి ఫ్టు రెండుదశల్లో పంప్‌హౌస్‌లను ఏర్పాటుచేసి రెండు ఆన్‌లైన్ రిజర్వాయర్లకు నీటిని పంపిణీచేస్తారు. గుడ్డెందొడ్డి కుడి, ఎడమ ప్రధానకాల్వల ద్వారా 63వేల ఎకరాలు, ర్యాలంపాడు రిజర్వాయర్ ద్వారా 1.37లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలన్నది ప్రధానలక్ష్యం.
అయితే 2012 సెప్టెంబర్ 14న ఆయకట్టుకు నీళ్లిచ్చే పనులు పూర్తికాకపోయినా.. అప్పటి సీఎం ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి నెట్టెంపాడు ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 2013 రబీలో 50వేల ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పారు. నేటికీ ఆయకట్టుకు నీళ్లిచ్చే పనులను పూర్తిచేయించలేకపోయారు. ఈ ఖరీఫ్‌లో కూ డా ఎన్నివేల ఎకరాలకు నీళ్లిస్తారో కూడా చెప్పలేకపోతున్నారు.
ఎన్నికల వాగ్దానంగానే..!
పాలమూరును దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన చంద్రబాబు 1995 నుంచి 2004 వరకు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై సానుభూతి మినహా పెద్దగా చేసిందేమీలేదు. 1999 ఎన్నికల సమయంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి వదిలేసిన చంద్రబాబు మళ్లీ ప్రాజెక్టుల జోలికి వెళ్లలేదు. 2004 ఎన్నికలకు ముందు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి అపద్ధర్మ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనే 25వేల ఎకరాలకు కుదింపుచేసి శంకుస్థాపన చేశారు.
వైఎస్ హయాంలో నాలుగేళ్లలో రూ.902.38 కోట్లు ఖర్చుచేయగా, రోశ య్య ప్రభుత్వం కేవలం ఏడాదిలో రూ. 213.67 కోట్లు ఖర్చుచేసింది. ఇక కిరణ్‌కుమార్ ప్రభుత్వం నెట్టెంపాడుకు నిధుల కేటాయింపులో శ్రద్ధచూపలేదు. 2010 నుంచి 2014 వరకు నాలుగేళ్లలో కేవలం రూ.455.58 కోట్లు ఖర్చుచేశా రు. నీళ్లివ్వాల్సిన కీలకమైన పనులను మూడేళ్లుగా ప్రభుత్వం నిర్లక్ష్యం వహి స్తూ వస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు, ప్రధానకాల్వలు పూర్తి కాకుండానే 2012 సెప్టెం బర్ 14న సీఎం కిరణ్ నెట్టెంపాడును జా తికి అంకితం చేశారు. అదే ఏడాది 50వే ల ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పినా, ఇప్పటివరకు వేయి ఎకరాల ఆయకట్టుకు కూ డా ఇవ్వలేకపోయారు. నీళ్లిచ్చే పనులపై ఏనాడూ సమీక్షలు నిర్వహించలేదు.
నెట్టెంపాడు..నెట్టేశారు!
Published Thu, May 22 2014 2:43 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement
Advertisement