గద్వాల, న్యూస్‌లైన్: గద్వాల డివిజన్‌లోని గట్టు మండలంలో సన్‌బార్న్ అనే ప్రైవేట్ సంస్థ నిర్మించతలపెట్టిన సౌరవి ద్యుత్ కేంద్రం అతీగతి లేకుండాపోయింది. మూడేళ్లక్రితమే రైతుల నుంచి కంపెనీ ప్రతినిధులు కేం ద్రం ఏర్పాటుకు అవసరమయ్యే భూమిని సేకరిం చినా ఈ ప్రతిపాదనకు మోక్షం లేకుండానే కాలం గ డుపుతున్నారు. జిల్లాలోనే అత్యంత వర్షాభావ ప రిస్థితులను ఎదుర్కొంటున్న గట్టు, ధరూరు, మల్దక ల్ మండలాలను కరువు ప్రాంతాలుగా పేర్కొం టారు.
గట్టు మండలంలో 1992లో శాటిలైట్ ద్వా రా తీసిన చిత్రం ఆధారంగా కరువును తలపించే ప రిస్థితులు నెలకొని ఉన్నాయని శాస్త్రవేత్తలు సూ చించారు. అతితక్కువ వర్షపాతం నమోదయ్యే గ ట్టు మండలంలో ఇసుక నేలలు ఉన్నారు. ఈ ప్రాం తంలో వేడిగాలుల ఉధృతి కూడా ఉంటుంది. ఎండవేడిలో రేడియేషన్, గాలివీచే వే గం కూడా ఎక్కువే. పరిస్థితులు అనుకూలించే ఇలాంటి ప్రాంతంలో సౌరవి ద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అనుకూలం గా ఉంటుందని పలు ప్రైవేట్ సంస్థలు గుర్తించాయి. ఈ క్రమంలోనే ఇక్కడ సౌరవిద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పేందుకు సన్‌బార్న్ అనే కంపెనీ నాలుగేళ్ల క్రితం ముందుకొచ్చింది.
రేడియేషన్ ఆధారంగా గుర్తింపు
సూర్యకాంతి రేడియేషన్ ఆధారంగా ఇ క్కడ సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటుచేసి, 50 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేయాలనే లక్ష్యంతో ప్రవాస భారతీ యులకు చెందిన సన్‌బార్న్ అనే ప్రైవేట్ కంపెనీ సంకల్పించింది. సంస్థ ప్రతి నిధులు మూడేళ్ల క్రితం గట్టు మండలా న్ని సందర్శించి, స్థానిక రాజకీయ నా యకుల సహకారంతో వ్యవసాయానికి ఉపయోగపడని సుమారు 200 ఎకరాల భూమిని సౌరవిద్యుత్ కేంద్రం నిర్మా ణం కోసం సేకరించారు. గతంలోనే 80 శాతం భూములను రైతుల నుంచి కొనుగోలు చేసి డబ్బు చెల్లించారు. మిగతా భూములకు ఇంకా డబ్బులు చెల్లించాల్సి ఉంది. కంపెనీ ఏర్పాటు ప్రక్రియ మూడేళ్లుగా ఆరంభం కాకపోవడంతో పొలాలను అమ్మిన రైతులే పంటలు సాగుచేసుకుంటున్నారు.
విద్యుదుత్పత్తి ఇలా..
సన్‌బార్న్ కంపెనీ 50 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో దాదాపు వెయ్యికోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును నిర్మించాలని భావించింది.
రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న సౌరవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో మాదిరిగా ఇక్కడ ఫొటో విద్యుత్‌ను ఉత్పత్తి చేయరు. సిలికాన్ ప్లేట్ల ఆధారంగా వచ్చిన విద్యుత్‌ను నీటిని వేడి చేసే బాయిలర్లకు అనుసంధానం చేస్తారు. బాయిలర్ల నుంచి ఉత్పత్తి అయ్యే ఆవిర్ల ద్వారా జనరేటర్లను నడిపి ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని సంకల్పించారు.
సౌర వెలుగులు సోకేనా?
Published Mon, Aug 12 2013 6:23 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM
Advertisement
Advertisement