Gallows
-
47 ఏళ్ల క్రితం ఆఖరి ఉరి
ప్రణయ్ హత్య కేసులో తీర్పు వెలువడింది. ఏ2గా సుభాష్ శర్మను కోర్టు దోషిగా నిర్ధారిస్తూ మరణశిక్ష విధించింది. అయితే శిక్ష అమలు కావడానికి మూడు అంకాలు దాటాల్సి ఉంటుంది. ఇక్కడ తెరపైకి వచ్చే అంశం ఏమిటంటే.. ప్రస్తుతం రాష్ట్రంలోని ఏ జైలులోనూ గ్యాలోస్ (ఉరికంబం ఉండే ప్రాంతం సాంకేతిక నామం) లేదు. తలారులుగా పిలిచే హ్యాంగ్ మన్ పోస్టులు అసలే లేవు.రాష్ట్రపతి వరకు అప్పీల్‌కు చాన్స్..ప్రస్తుతం ట్రయల్ కోర్టు సుభాష్ శర్మకు మరణశిక్ష విధించింది. అతను ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేసే అస్కారం ఉంది. అంతేకాదు ట్రయల్ కోర్టు కూడా ఈ శిక్ష విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తుంది. ఈ క్రమంలో ‘రిఫర్డ్ ట్రయల్’గా పిలిచే విధానంలో హైకోర్టు విచారణ చేయవచ్చు. మరణశిక్షను హైకోర్టు సమర్థిస్తే.. సుప్రీంకోర్టులో అప్పీల్ చేయవచ్చు. అక్కడా చుక్కెదురైతే క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయవచ్చు. రాష్ట్రపతి తిరస్కరిస్తే.. దోషులకు విధించిన మరణశిక్ష పూర్తిగా ఖరారైనట్లే. దీంతో శిక్ష విధించినన్యాయస్థానానికి సంబంధించిన రాష్ట్రంలో.. మరణశిక్షను అమలు చేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 47 ఏళ్ల క్రితం..ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఆఖరి ఉరిశిక్షను 47 ఏళ్ల క్రితం ముషీరాబాద్ సెంట్రల్ జైలులో అమలు చేశారు. 1978లో భారత వైమానిక దళంలో పనిచేసిన ఎయిర్‌మన్ రామవతార్ యాదవ్‌పై హత్య కేసు నిరూపితమై, మరణశిక్ష ఖరారు కావడంతో ఉరి తీశారు. అప్పట్లో ముషీరాబాద్ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్‌గా ఉన్న సుబ్బారెడ్డి పర్యవేక్షణలో శిక్షను అమలైంది. తర్వాతి కాలంలో ముషీరాబాద్ సెంట్రల్ జైలును చర్లపల్లి ప్రాంతానికి మార్చారు.ఇక్కడ జైలు నిర్మిస్తున్నప్పుడు గ్యాలోస్ (ఉరికంబం) కోసం ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసినా ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉరికంబం ఉన్న జైలు ఒక్క రాజమండ్రి సెంట్రల్ జైలు మాత్రమే. ఇక తెలంగాణ జైళ్ల శాఖలో హ్యాంగ్‌మన్‌గా పిలిచే తలారీ పోస్టులు లేవు. చాలా ఏళ్లుగా ఉరిశిక్ష అమలు లేకపోవడంతో కొందరు హెడ్–వార్డెర్లకే ఈ అంశంలో ప్రాథమిక శిక్షణ ఇస్తున్నారు.రాజమండ్రి జైల్లో 49 ఏళ్ల క్రితం...రాజమండ్రి సెంట్రల్ జైలులో చివరిసారిగా 1976 ఫిబ్రవరిలో ఉరిశిక్షను అమలు చేశారు. ఓ హత్య కేసులో దోషిగా తేలిన అనంతపురం జిల్లాకు చెందిన నంబి కిష్టప్పను ఉరి తీశారు. తర్వాత కొందరు ఖైదీలను ఉరిశిక్ష అమలు కోసం ఈ జైలుకు తరలించినా అమలు కాలేదు. 1875 నుంచీ గ్యాలోస్ ఉండి, ఇప్పటికీ కొనసాగుతున్న కేంద్ర కారాగారం రాజమండ్రి సెంట్రల్ జైల్ మాత్రమే.స్వాతంత్య్రం అనంతరం దేశవ్యాప్తంగా వివిధ కారాగారాల్లో దాదాపు 100 మందిని ఉరితీశారు. అందులో అత్యధికంగా 42 శిక్షలను రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే అమలు చేశారు. ఉరి అమలుకు ముందు సదరు ఖైదీని ఆఖరి కోరిక ఏమిటని అడగటం ఆనవాయితీ. కిష్టప్ప తన ఆఖరి కోరికగా లడ్డూ తింటానని కోరగా.. జైలు అధికారులు అతడికి లడ్డూలు అందించారు. రాజమండ్రి జైలు తలారీ ధర్మరాజు ఆ ఉరి తీశారు.అదో ప్రత్యేకమైన గ్యాలోస్..రాజమండ్రి సెంట్రల్ జైల్లోని గ్యాలోస్ 1980 వరకు ప్రధాన ద్వారం పక్కనే బహిరంగ ప్రదేశంలో ఉండేది. ఉరిశిక్ష అమలు తర్వాత మృతదేహాన్ని ఉరికంబం కింద ఉండే ప్రత్యేక చాంబర్లో దింపుతారు. అక్కడి నుంచి నేరుగా ట్రే ద్వారా సంబంధీకులకు అప్పగించాలని, మృతదేహాన్ని జైలుగదుల మీదుగా బయటికి తీసుకురావద్దనే ఉద్దేశంతో అలా ఏర్పాటు చేశారు. 1980 తర్వాత గ్యాలోస్‌ను అడ్మినిస్ట్రేటివ్ భవనం పరిసరాల్లోకి మార్చారు.2013లో ఈ గ్యాలోస్ ఉన్న ప్రాంతంలోనే రూ.7.5 కోట్లతో కొత్తగా పరిపాలనా భవనాన్ని నిర్మించారు. అయితే గ్యాలోస్‌ను అక్కడి నుంచి మార్చడం ఇష్టం లేక భవనం కింద భూగర్భంలో ఏర్పాటు చేశారు. ఈ తరహా గ్యాలోస్ కలిగిన కారాగారం దేశంలో మరోటి లేదు. అంతేకాదు నిర్మాణాలు ఎన్ని మారినా ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి ఇనుప ఉరికంబాన్నే వినియోగిస్తున్నారు. తరచూ దీనికి నూనె రాస్తూ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
నిర్భయ కేసు: ఉరికంబాలు సిద్ధం!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్యకేసులోని నలుగురు దోషులకు ఒకేసారి ఉరిశిక్ష వేసేందుకు రంగం సిద్ధమైంది. దేశంలో నలుగురు దోషులకు ఒకేచోట, ఒకేసారి ఉరిశిక్షను అమలు చేస్తున్న జైలుగా.. తీహార్ జైలు రికార్డు సృష్టించనుంది. గతంలో తీహార్ జైలులో ఒక ఉరికంబం మాత్రమే ఉండగా.. ఒకేసారి నలుగురు దోషుల ఉరితీతకు ఉరికంబాలు అవసరం అవుతుండడంతో జైలు అధికారులు ఆ దిశగా ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. అంతేకాక ఉరితీత సమయంలో జేసీబీ అవసరం కానున్న నేపథ్యంలో.. ఇప్పటికే తీసుకువచ్చి తీహార్ జైలు ప్రాంగణంలో ఉంచారు. జేసీబీ యంత్రం సహాయంతో ఉరి తీయడానికి ఫ్రేమ్, భూగర్భంలో కొద్దిమేర గుంత తవ్వడానికి, ఉరిశిక్ష అనంతరం దోషుల మృతదేహాలను తరలించడానికి ఉపయోగించబడుతుంది. వివరాల్లోకి వెళితే.. 2012, డిసెంబర్ 16న పారామెడికల్ విద్యార్థిని నిర్భయను అత్యంత అమానవీయంగా హత్యాచారం చేశార. సామూహిక అత్యాచారం అనంతరం ఆమెను కదులుతున్న బస్సులోంచి కిందకు తోసివేశారు. తీవ్రంగా గాయపడ్డ ఆమె సింగపూర్‌లో చికిత్స పొందుతూ డిసెంబరు 29, 2012న ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో ఆరుగురు నిందితులు అరెస్టయ్యారు. నిందితుల్లో ఒకరు జైలులోనే ఆత్మహత్య చేసుకోగా మరో నిందితుడు మైనర్ కావడంతో మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించారు. మిగతా నలుగురు దోషులకు ఉరిశిక్షను ఖరారుచేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. కాగా నిర్భయ దోషులకు డెత్ వారెంట్ల జారీపై విచారణను పటియాలా హౌజ్ కోర్టు జనవరి 7వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. చదవండి: నిర్భయ కేసు : లాయర్‌కు భారీ జరిమానా..! -
వారు నిరూపిస్తే ఉరికైనా సిద్ధం- మంత్రి
► రాజీనామాకు ఒత్తిడి ►మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ►పాలల్లో ఫార్మా డిలైట్ గుర్తింపు ►సిట్టింగ్ జడ్జి విచారణకు స్టాలిన్ డిమాండ్ చెన్నై : ప్రైవేటు పాలలో రసాయనాలు లేవు అని నిరూపిస్తే, ఉరి కంభంలో వేలాడేందుకైనా తాను సిద్ధం అని పాడి, డెయిరీల అభివృద్ధి శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ స్పష్టం చేశారు. పాలల్లో పలు మిశ్రమాలతో కూడిన ఫార్మా డిలైట్ అన్న రసాయనాన్ని గుర్తించామన్నారు. ప్రైవేటు పాలల్లో రసాయనాలు కలుపుతున్నట్టుగా మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను ప్రైవేటు సంస్థలు ఖండిస్తున్నాయి. ప్రైవేటు పాల వ్యాపారం దెబ్బ తినే ప్రమాదంతో ఏజెంట్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డీఎండీకే అధినేత విజయకాంత్ లాంటి వాళ్లు ఒకరిద్దరు మంత్రి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. మరి కొందరు ఇన్నాళ్లు ఎందుకు మౌనం వహించారోనని ప్రశ్నిస్తున్నారు. ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ అయితే, తాజా పరిణామాలు, వ్యవహారాన్ని తీవ్రంగానే పరిగణించారు. గతంలో ప్రభుత్వ రంగం సంస్థ ఆవిన్‌లో సాగిన అవినీతి మాయాజాలాన్ని గుర్తు చేస్తూ, ఆ విచారణ ఏమైనట్టో ప్రశ్నించారు. ప్రైవేటు పాల విషయంగా సాగుతున్న మిక్సింగ్ గురించి మంత్రి ఆలస్యంగానైనా నోరు మెదిపి ఉండడం అనుమానాలకు దారి తీస్తున్నాయని శనివారం తూత్తుకుడిలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో శివకాశిలో మీడియాతో మాట్లాడుతూ స్టాలిన్ వ్యాఖ్యలను మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ఆహ్వానించడం గమనార్హం. ఉరికి సిద్ధం : రసాయనాల వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని స్టాలిన్ డిమాండ్ చేయడాన్ని తాను ఆహ్వానిస్తున్నానని ప్రకటించారు. ప్రైవేటు పాలలో రసాయనాలు ఉన్న విషయం నిర్ధారణ అయిందన్నారు. గిండి, మాధవరంలలోని ప్రభుత్వ పరిశోధనా కేంద్రంలో సాగిన పరిశీలనలో కొన్ని రకాల మిశ్రమాలతో ఫార్మా డిలైట్ అన్న రసాయనాన్ని గుర్తించడం జరిగిందన్నారు. మైసూర్‌లోని కేంద్ర ప్రభుత్వ పరిశోధనా కేంద్రానికి సైతం శాంపిల్స్ పంపించామని, అక్కడి నుంచి నివేదిక రాగానే, ప్రైవేటు పాల సంస్థల భరతం పట్టే విధంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. విజయకాంత్ లాంటి వాళ్లు ప్రైవేటు పాల సంస్థలకు మద్దతుగా వ్యాఖ్యానిస్తుండడం, మరి కొందరు అయితే, తనను పదవికి రాజీనామా చేయించే విధంగా ఒత్తిడికి దిగడం శోచనీయమని విమర్శించారు. తాను ఎన్నడూ ప్రైవేటు పాల సంస్థల వద్ద చేతులు చాచ లేదని, అవినీతికి పాల్పడాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ప్రైవేటు పాలలో రసాయనాలు లేవు అని నిరూపిస్తే, పదవికి తానే రాజీనామా చేస్తానని, ఉరి కంబంలో వేలాడేందుకు కూడా సిద్ధం అని స్పష్టం చేశారు. గత ఏడాది ఈ శాఖ మంత్రిగా తాను పగ్గాలు చేపట్టిన కొన్ని నెలల్లోనే రసాయనాల వ్యవహారం ఫిర్యాదు రూపంలో చేరిందని, రహస్యంగా విచారించి, నిర్ధారించుకున్న అనంతరం ప్రస్తుతం బయట పెట్టానంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. రాజీనామాకు ఒత్తిడి తెచ్చినా, ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా, ప్రైవేటు పాల రసాయనాల భరతం పట్టే విషయంలో తాను వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.