ganapathi sachhidananda swamy
-
గురువాణి: యువత భగవద్గీత సారాన్ని తెలుసుకోవాలి
మహాభారతం పంచమవేదంగా చెప్పబడుతోంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీతలోని సారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా యువత భగవద్గీత చదివి సారాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవాలి. శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఫలితాన్ని ఆశించకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ముందుకెళ్లాలి. గీతాసారాన్ని తెలుసుకుంటే మాట్లాడే ప్రతి మాట, ప్రతి అడుగు తిరుగులేని కచ్చితత్వంతో ఉంటాయి. అన్ని సమస్యలకు పరిష్కారం చూపించే సారం గీతలో ఉంది. దత్తాత్రేయుడిగా గురువు అవతారమెత్తిన మహావిష్ణువు కృతయుగంలో శ్రీరాముడిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి మానవాళికి మార్గదర్శకులయ్యారు. వీరి అవతారాలకు భారతదేశం వేదిక కావడం అదృష్టం. దీంతో ప్రపంచ దేశాలకు భారతదేశం ఎనలేని విజ్ఞానాన్ని అందించినట్లైంది. భారతదేశం ఎప్పుడూ ప్రపంచంలోని అన్ని దేశాలు బాగుండాలని కోరుకుంటూ వస్తోంది. ఇతర దేశాలతో ప్రేమపూర్వకంగా ఉంటూ వస్తున్న భారతదేశ విధానాన్నే స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకెళ్లాలి. దీంతో యువతలో సానుకూల దృక్పథం కలుగుతుంది. అనేక దేశాల అభివృద్ధిలో కీలక ΄ాత్ర ΄ోషిస్తున్న భారత యువత అక్కడ భారత సంస్కృతి, సాంప్రదాయాల గురించి గర్వంగా చెప్పుకోవాలి. అదేవిధంగా ప్రకృతి, పంచభూతాలను ఎవరు నడిపిస్తున్నారనే విషయాలను తెలుసుకోవాలి. దీంతో అందరికీ సద్బుద్ధి కలుగుతుంది. పరమాత్మను పరిపూర్ణంగా శరణు వేడడమే అన్నింటికీ పరిష్కార మార్గం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత మానవాళికి దిశానిర్దేశం చేస్తోంది. భాగవతంలో శ్రీకృష్ణుడి అవతారం ్ర΄ారంభం నుంచి ముగింపు వరకు ఉంటుంది. త్రేతాయుగంలో శ్రీరాముడిగా కష్టాలు అనుభవిస్తూ ధర్మమార్గంలో ఎలా నడవాలో చూపించిన పరమాత్మ, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడో భాగవతం చదివితే తెలుస్తుంది. చిన్నతనం నుంచే భగవద్గీత, రామాయణం, మహాభారతం, భాగవతం గురించి తెలుసుకుంటే యువత తిరుగులేని సానుకూల దృక్పధాన్ని సాధిస్తుంది. – తూమాటి భద్రారెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ -
విశాఖ శ్రీశారదా పీఠానిది జ్ఞాన పరంపర
పెందుర్తి: పరంపర అంటే వంశ పారంపర్యం కాదని, జ్ఞానంతో కూడినదై ఉండాలని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. పురాతన పీఠాల కన్నా ముఖ్యమైన జ్ఞాన పరంపర విశాఖ శ్రీశారదాపీఠం సొంతమన్నారు. కర్ణాటక పర్యటనలో భాగంగా ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతితో కలిసి హోళె నర్సిపూర్‌లోని గురుస్థానాన్ని స్వరూపానందేంద్ర సరస్వతి సందర్శించారు. పరమ గురువు సచ్చిదానందేంద్ర స్వామి శివైక్యమైన ప్రాంతంలోని గురు సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆధ్యాత్మిక ప్రకాశ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ ముద్రించిన గ్రంథాలను పరిశీలించారు. ప్రముఖ వేదాంతి ప్రకాశానందేంద్రతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సచ్చిదానందేంద్ర పాద రేణువే విశాఖ శ్రీశారదాపీఠమన్నారు. ఆయన శిష్యునిగా ఎంతో గర్వపడుతున్నానని.. తన పరమ గురువుల శిష్యరికం ఎన్నో జన్మల పుణ్యఫలమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో దైర్యంగా ధర్మపోరాటాలు చేస్తున్నామంటే అది సచ్చిదానందేంద్ర సరస్వతి అనుగ్రహమే అన్నారు. సంస్కృతంలో ఉన్న తైత్తిరీయోపనిషత్తును తెలుగులోకి అనువదించి వేద విద్యార్థులకు పాఠంగా బోధించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గణపతి సచ్చిదానంద జన్మదినోత్సవానికి హాజరు మైసూర్‌లోని దత్త పీఠాన్ని స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి సందర్శించారు. గణపతి సచ్చిదానంద స్వామి 80వ జన్మదిన వేడుకల్లో పాలుపంచుకున్నారు. సచ్చిదానందకు జ్ఞాపిక బహూకరించారు. అనంతరం స్వామీజీలను సచ్చిదానంద ఘనంగా సత్కరించారు. పలు అంశాలపై ఇరువురు చర్చించారు. -
'ఎప్పుడు స్నానం చేసినా.. పుష్కర స్నాన ఫలమే'
రాజమండ్రి కల్చరల్ : పుష్కర తేదీల్లో వివాదాలు అనవసరమని, మంచి పనులు ఎప్పుడైనా చేయవచ్చని మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామి అన్నారు. రాజమండ్రి గౌతమ ఘాట్‌లోని దత్తముక్తి క్షేత్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘చాంద్రమానం, సౌరమానం.. ఈ వివాదాల జోలికి పోకండి. మంగళవారం సూర్యోదయం నుంచి ఈ ఏడాదిలో ఎప్పుడు గోదావరిలో స్నానం చేసినా, పుష్కర స్నాన ఫలితం లభిస్తుంది’ అని అన్నారు. ‘కృత, త్రేతా, ద్వాపర, కలియుగాల్లో ప్రకృతి ఆరాధన ఉంది. చెట్టును, పుట్టను, పామును, నదిని, సముద్రాన్ని, పర్వతాలను అన్నిటినీ మనం ఆరాధిస్తాం. అయితే, అవసరం ఉన్నంత మేరకే ప్రకృతిని వినియోగించుకోవాలి. ఒక చెట్టును నరికితే, పది చెట్లు నాటాలి’ అని చెప్పారు. పంచభూతాలపై విశ్వాసం పెంచుకోవడానికే పుష్కరాల వంటి వైదిక ప్రక్రియలు ఉపయోగపడతాయన్నారు. ఇంటివద్ద స్నానం చేసి నదీ స్నానానికి రావాలని, నదీ స్నానానికి ముందు ఒంటిని, మనసును పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. గోదావరికి ప్రతీక రాజమండ్రి అని, ఇది గొప్ప క్షేత్రమని అన్నారు. పుష్కర స్నానంవల్ల జ్ఞానం, ఆరోగ్యం, సంపద కలుగుతాయన్నారు. ‘పుష్కర జలాలను అమెరికా తీసుకు వెళ్తున్నాను. అక్కడ ప్రతిష్ఠించనున్న హనుమంతుని విగ్రహానికి గోదావరి పుష్కర జలాలతో అభిషేకాలు చేస్తాను’ అని స్వామీజీ చెప్పారు. విలేకర్ల సమావేశంలో కంటిపూడి సర్వారాయుడు, వీఎస్ ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.