ganapati sachidananda swamy
-
దత్త పీఠాధిపతి పుట్టిన రోజు వేడుకలకు సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి, అమరావతి: అవదూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ 80వ పుట్టిన రోజు వేడుకలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని దత్తపీఠం ప్రతినిధులు ఆహ్వానించారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన దత్తపీఠం ప్రతినిధులు ఆహ్వాన పత్రాన్ని అందించారు. సీఎంను కలిసిన వారిలో దత్తపీఠం ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ హెచ్వీ ప్రసాద్, ట్రస్టీ రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులున్నారు. చదవండి: ఏది నిజం: రోడ్లపై గుంతలా? రామోజీ కళ్లకు గంతలా? -
ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏపీలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన అద్భుతంగా సాగుతోందని, పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడంతో పాటు ప్రజా సంక్షేమానికి కృషిచేస్తున్నారంటూ గణపతి సచ్చిదానంద స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లోకకల్యాణం, ప్రజా సంక్షేమం కోసం వారణాసిలో నిర్వహిస్తున్న అతిరుద్ర యాగం పదో రోజు సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. తండ్రి వైఎస్సార్ బాటలో జగన్ నడుస్తున్నారని, అనువంశిక అర్చకుల వారసత్వ హక్కులను పునరుద్ధరిస్తూ సీఎం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని, ప్రతీ ఒక్కరూ ఆహ్వానించదగ్గ నిర్ణయమన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టడం మంచి నిర్ణయమని, దీనిపై పలువురు వివాదం చేయడం సరైనది కాదన్నారు. విదేశాలకు వెళ్లడానికి వీసా ఇంటర్వ్యూకి వెళ్లాలన్నా ఇంగ్లిషు అవసరమన్న విషయం మర్చిపోకూడదన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్న వారి పిల్లల్నంతా ఇంగ్లిషులోనే చదివిస్తున్నారంటూ విమర్శించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన వారికి సమయం ఇవ్వకుండానే విమర్శలు చేయడం తగదన్నారు. -
సీఎం జగన్‌కు గణపతి సచ్చిదానంద ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి పాలన అద్భుతంగా సాగుతోందని, పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేయడంతో పాటు ప్రజా సంక్షేమానికి కృషిచేస్తున్నారంటూ గణపతి సచ్చిదానంద స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లోకకళ్యాణం ప్రజా సంక్షేమం కోసం వారణాసిలో నిర్వహిస్తున్న అతిరుద్ర యాగం పదవ రోజు సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ తండ్రి వైఎస్సార్ బాటలో జగన్ నడుస్తున్నారని, అనువంశిక అర్చకుల వారసత్వ హక్కుల పునురుద్ధరిస్తూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని, ప్రతీ ఒక్కరూ ఆహ్వానించదగ్గ నిర్ణయమన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం మంచి నిర్ణయమని దీనిపై వివాదం చేయడం సరైనది కాదన్నారు. విదేశాలకు వెళ్లడానికి వీసా ఇంటర్వ్యూకి వెళ్లాలన్నా ఇంగ్లీషు అవసరమన్న విషయం మర్చిపోకూడదన్నారు. రాష్రంలో ఇప్పుడు ఇంగ్లీషు మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్న వారి పిల్లలంతా ఇంగ్లీషులోనే చదివిస్తున్నారంటూ విమర్శించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన వారికి సమయం ఇవ్వకుండానే ఇలా విమర్శలు చేయడం తగదన్నారు. హిందూధర్మ పరిరక్షణ అన్నది ప్రతీ ఒక్కరి బాధ్యతని, దత్తపీఠం ఆధ్వర్యంలో పేద ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కాగా ప్రకృతి వైపరీత్యాల నివారణ కోసం చేపట్టిన అతిరుద్ర యాగానికి పలువురు భక్తులు హాజరయ్యారు. -
హనుమాన్ చాలీసా పారాయణకు హాజరైన సీఎం, పవన్
సాక్షి, విజయవాడ : నగరంలోని పద్మావతి ఘాట్ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అవధూత, దత్తపీఠాధిపతి పరమపూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్యర్యంలో శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం, విశ్వశాంతి మహాయజ్ఞం కార్యక్రమాలను నిర్వహించారు. భారీ స్థాయిలో నగర ప్రజలు ఈ వేడుకలకు తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. -
హనుమాన్ చాలీసా పారాయణకు హాజరైన సీఎం, పవన్
-
రాజేంద్రుడికి కళానిధి అవార్డు
మైసూరు దత్త పీఠంలో సద్గురు గణపతి సచ్చిదానంద స్వామి పుట్టినరోజు సందర్భంగా డా.రాజేంద్ర ప్రసాద్‌కు కళానిధి అవార్డుని అందించారు. నాలుగు దశాబ్దాలకు పైగా హీరోగా, కామెడీ స్టార్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నందుకు గాను ఆయన్ను ఈ పురస్కారంతో గౌరవించారు. ఈ సందర్భంగా గణపతి సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ - ‘నాకు హాస్యం అంటే చాలా ఇష్టం. హాస్యానికి కిరిటాన్ని పెట్టిన నటకిరీటికి ఈ కళానిధి అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది’ అన్నారు. డా.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ - ‘నాలుగు దశాబ్దాలుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షక్షకులను మెప్పించాను. నటుడిగా ఎన్నో అవార్డులను అందుకున్నప్పటికీ సద్గురు గణపతి సచ్చిదానంద స్వామి వారి చేతుల మీదుగా కళానిధి అవార్డును స్వీకరించడం ఆనందంగా ఉంది’ అన్నారు. -
ఏడాదంతా పుష్కర స్నానం చేయవచ్చు
ముక్త్యాల(జగ్గయ్యపేట):భక్తులు పుష్కర స్నానాలు ఏడాదంతా చేయవచ్చని మైసూరు అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. గ్రామంలోని కోటిలింగ హరిహర మహా క్షేత్రం పుష్కర ఘాట్‌లో మంగళవారం తెల్లవారు జామున పుష్కర స్నానమాచరించి భక్తులకు హితోపదేశం చేశారు. పుష్కరాలు 12 రోజులు జరుగుతాయని, అయితే భక్తులు స్నానాలు 12 రోజుల్లోనే చేయాలని లేదని, ఏడాదిలోపు ఎప్పుడైనా చేయవచ్చన్నారు. మూడు కోట్ల మంది దేవతలు నదిలో ఉంటారని అందుకే నది శక్తివంతంగా ఉంటుందన్నారు. ఈ ప్రాంతమంతా కొద్ది రోజుల్లో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుందని, ఇక్కడ ఆశ్రమం నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్, ఈవో దూళిపాళ్ల సుబ్రహ్మణ్యం, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.