ganesh idols immersion
-
గణేష్ నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) విగ్రహాలను హుస్సేన్ సాగర్, చెరువుల్లో నిమజ్జనం చేయవద్దని స్పష్టం చేసింది. పీవోపీ విగ్రహాలన్నింటిని జీహెచ్ఎంసి ఏర్పాటు చేసిన కృత్రిమ తాత్కాలిక నీటి కుంటలలో నిమజ్జనం చెయ్యాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులను యధాతథంగా అమలు చేయాలని నగర సీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. గత వాదనల సమయంలోనే(సెప్టెంబర్ 8).. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ)తో తయారు చేసిన గణేశ్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయరాదని .. ఈ విషయమై గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొంది హైకోర్టు. ఎవరెవరి వాదనలు ఎలాగంటే.. ఇదిలా ఉంటే.. పీవోపీ విగ్రహాల తయారీపై నిషేధం ఎత్తేయాలని.. సీపీసీబీ నిబంధనలను కొట్టేయాలని పేర్కొంటూ గణేశ్‌మూర్తి కళాకారుల సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ కొనసాగించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది.. ధూల్‌పేట్ వాసులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపకుండా ప్రస్తుత ఉపాధిపై దెబ్బకొట్టడం సరికాదని పేర్కొన్నారు. మరో న్యాయవాది వేణుమాధవ్ వాదనలు వినిపిస్తూ గత ఏడాది హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయలేదని.. తాత్కాలిక కొలనుల్లో నిమజ్జనం చేశామని పేర్కొన్నారు. -
గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. ఆరుగురు యువకులు మృతి
చండీగఢ్: హర్యానాలో గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. మహేంద్రగఢ్, సోనిపత్ జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన వేరు వేరు ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మహేంద్రగఢ్‌లో ఏడు అడుగుల వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు కాలువలోకి దిగిన 9 మంది యువకులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. వీరిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మిగతా ఐదుగురిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోనిపత్ జిల్లాలో జరిగిన మరో ఘటనలో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు సరయూ నదిలోకి దిగిన ఇద్దరు యువకులు నీటమునిగి చనిపోయారు. ఈ విషాద ఘటనలపై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గణేష్ నిమజ్జనంలో పాల్గొనేందుకు వెళ్లి వీరంతా ప్రాణాలు కోల్పోవడం తన హృదయాన్ని కలచివేసిందని ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే సహాయక చర్యల్లో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ప్రశంసించారు. महेंद्रगढ़ और सोनीपत जिले में गणपति विसर्जन के दौरान नहर में डूबने से कई लोगों की असामयिक मृत्यु का समाचार हृदयविदारक है। इस कठिन समय में हम सभी मृतकों के परिजनों के साथ खड़े हैं। NDRF की टीम ने कई लोगों को डूबने से बचा लिया है, मैं उनके शीघ्र स्वस्थ होने की प्रार्थना करता हूँ। — Manohar Lal (@mlkhattar) September 9, 2022 చదవండి: అడ్డు తొలగించుకునేందుకే హత్య.. భార్య అంగీకారంతోనే.. -
హుస్సేన్ సాగర్ లో కొనసాగుతున్న నిమజ్జనాలు
-
హుస్సేన్ సాగర్ లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు
-
గణేష్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేస్తాం
-
జోరుగా కొనసాగుతున్న నిమజ్జనం
హైదరాబాద్ : హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జన కార్యక్రమం జోరుగా కొనసాగుతోందని జీహెచ్ఎంసీ కృష్ణబాబు తెలిపారు. ఈ ఏడాది 75వేలకు పైగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశం ఉందన్నారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన సమయంలో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కృష్ణబాబు తెలిపారు.న హుస్సేన్ సాగర్‌తో పాటు నగరంలోని పలుచోట్ల నిమజ్జనం వేగవంతం చేసినట్లు చెప్పారు. నిమజ్జనం అనంతరం ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించేందుకు 2300 మంది కార్మికులను ఏర్పాటు చేసినట్లు కృష్ణబాబు తెలిపారు. ఆయన బుధవారం నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన కార్యక్రమాలను పరిశీలించారు. విగ్రహాల నిమజ్జనానికి 59 పెద్ద క్రేన్లు, 79 మొబైల్ క్రేన్లతో పాటు 85మంది గజ ఈతగాళ్లను నియమించినట్లు కృష్ణబాబు తెలిపారు. -
వినాయక నిమజ్జనానికి 15 వేల మంది పోలీసు బలగాలు
రేపు హైదరాబాద్ నగరంలో జరగనున్న వినాయకుని నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ కమిషనరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన నిమజ్జనం సందర్భంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చర్యలు జరగకుండా పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్టు చేస్తున్నట్లు వివరించారు. హుసేన్సాగర్ వద్ద 71 భారీ క్రెయిన్లు ఏర్పటు చేసినట్లు తెలిపారు. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో 800 సీసీ కెమెరాలు ఉంచినట్లు చెప్పారు. 155 మంది ప్రత్యేక స్థాయి అధికారులు నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారని చెప్పారు.15 వేల మంది పోలీసు బలగాలను నగరంలో మోహరించినట్లు పేర్కొన్నారు. అలాగే 175 ఏపీఎస్పీ బలగాలు, 32 బాంబు స్క్వాడ్ బృందాలు, 25 స్నిఫర్ డాగ్స్‌లను నిరంతంరం పహరా కాస్తుంటాయని సీపీ అనురాగ్ శర్మ తెలిపారు.