రేపు హైదరాబాద్ నగరంలో జరగనున్న వినాయకుని నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ కమిషనరేట్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన నిమజ్జనం సందర్భంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చర్యలు జరగకుండా పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్టు చేస్తున్నట్లు వివరించారు.
హుసేన్సాగర్ వద్ద 71 భారీ క్రెయిన్లు ఏర్పటు చేసినట్లు తెలిపారు. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో 800 సీసీ కెమెరాలు ఉంచినట్లు చెప్పారు. 155 మంది ప్రత్యేక స్థాయి అధికారులు నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారని చెప్పారు.15 వేల మంది పోలీసు బలగాలను నగరంలో మోహరించినట్లు పేర్కొన్నారు. అలాగే 175 ఏపీఎస్పీ బలగాలు, 32 బాంబు స్క్వాడ్ బృందాలు, 25 స్నిఫర్ డాగ్స్లను నిరంతంరం పహరా కాస్తుంటాయని సీపీ అనురాగ్ శర్మ తెలిపారు.