sniffer dogs
-
మొదటిసారి డ్రగ్స్ కోసం స్నిఫర్ డాగ్స్ తో పోలీసుల రైడ్స్
-
చీతాల రక్షణ కోసం.. సూపర్ సైన్యం
ప్రాజెక్టు చీతాలో భాగంగా.. నమీబియా నుంచి తెప్పించిన చీతాలను భద్రంగా చూసుకునే పనిలో ఉన్నారు కునో నేషనల్ పార్క్(మధ్యప్రదేశ్) అటవీశాఖ అధికారులు. నెలపాటు అవి క్వారంటైన్‌లోనే ఉండాలి గనుక.. బయటి ప్రాంతపు ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే వీటి పహారా కోసం రెండు గజరాజులను మోహరించారు. ఇక ఇప్పుడు నాలుగు కాళ్ల కమాండర్లు వాటిని పరిరక్షించేందుకు శిక్షణ తీసుకోవడంలో తలమునకలయ్యాయి. నమీబియా చీతాల సంరక్షణ కోసం సూపర్ స్నిఫర్ బృందాన్ని సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఐటీబీపీ(ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్) సెంటర్ వద్ద శిక్షణ తీసుకున్న ఇలూ అనే ఆడ జర్మన్ షెపర్డ్ ఈ బృందంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనితో పాటు దేశంలోని వివిధ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల వద్ద పని చేసిన ఐదు శునకాలు ఇలూకు తోడు కానున్నాయి. నమీబియా చీతాలను వేటగాళ్ల బారి నుంచి రక్షించడంలో ఈ స్నిఫర్ బృందం కీలకంగా వ్యవహరించబోతోంది. ► మూడు నెలల ప్రాథమిక శిక్షణ, మరో నాలుగు నెలల అడ్వాన్స్డ్ శిక్షణ పూర్తి చేసుకున్నాక వీటిని కునో నేషనల్ పార్క్ వద్ద మోహరిస్తారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఇవి రంగంలోకి దిగుతాయి. ► శిక్షణలో.. పెద్దపులి, చిరుతల చర్మాలను, ఎముకలను, ఏనుగు దంతాలు, ఇతర భాగాలను, వన్యప్రాణులను అక్రమంగా తరలించడాన్ని ఇవి పసిగట్టి అప్రమత్తం చేస్తాయి. ► దేశంలో సూపర్ స్నిఫర్ స్క్వాడ్స్ ఇప్పటికే విధులు నిర్వహిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, తమిళనాడులో ఇప్పటికే ఈ తరహా టీంలు పని చేస్తున్నాయి. ► సూపర్ స్నిఫర్ స్క్వాడ్స్‌లో.. శునకాలు నెలల వయసు ఉన్నప్పటి నుంచే శిక్షణ ప్రారంభిస్తారు. శిక్షణ మొదటి రోజు వాటి రిటైర్మెంట్ వరకు ఒకే శిక్షకుడు వెంటే ఉంటాడు. ► కేవలం చీతాలకు మాత్రమే కాదు.. కునో నేషనల్ పార్క్‌లోని ఇతర వన్యప్రాణులను సైతం వేటగాళ్ల నుంచి రక్షించేందుకు ఈ బృందం పని చేస్తుందని ఇలూ శిక్షకుడు సంజీవ్ శర్మ చెప్తున్నారు. ► ఐటీబీపీ కేంద్రాల్లో శిక్షణ పొందిన శునకాలు.. వన్యప్రాణుల నేరాలను గుర్తించడంలో ఎక్కువ విజయాన్ని సాధించాయి. వేటగాళ్లను పట్టించడంలో.. వన్యప్రాణుల అవశేషాలను పట్టించడంలో ఇంతకు ముందు అవి ఎంతో కీలకంగా వ్యవహరించాయి. ► భారత దేశంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) కూడా వైల్డ్‌లైఫ్ స్నిఫర్ డాగ్ బృందాల సేవలను వినియోగించుకుంటున్నాయని ఐటీబీపీ అధికారులు చెప్తున్నారు. ► రైల్వే నెట్‌వర్క్‌ల గుండా జరిగే అక్రమ రవాణా, అరుదైన జీవజాలం తరలింపు ప్రయత్నాలను ఇవి భగ్నం చేసిన సందర్భాలను సైతం గుర్తు చేస్తున్నారు. ► వన్యప్రాణుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు.. 2008లో TRAFFIC, WWF-Indiaలు సంయుక్తంగా వైల్డ్ లైఫ్ స్నిఫర్ డాగ్ ట్రైనింగ్ ప్రోగ్రాంను ప్రారంభించాయి. వీటి ద్వారా శిక్షణ పొందిన శునకాలు.. ఇప్పుడు వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం వద్ద మోహరించబడ్డాయి. -
రాంబో బాణాలు.. రాకెట్ బాంబులు
న్యూఢిల్లీ: భద్రతా దళాలపై దాడులు చేయడం కోసం నక్సలైట్లు సరికొత్త ఆయుధ సంపత్తిని సమకూర్చుకున్నారు. రాంబో బాణాలు, రాకెట్ బాంబులు వంటి ఆధునిక, ప్రాణాంతక సామగ్రితో భద్రతా దళాలకు సవాలుగా నిలుస్తున్నారు. ఈ మేరకు వామపక్ష తీవ్రవాద శిబిరంలో నెలకొన్న ధోరణులపై అధ్యయనం చేసిన ఉమ్మడి భద్రతా దళం (జేఎస్సీ) తాజా నివేదిక వెల్లడించింది. భద్రతా బృందాలకు చెందిన స్నిఫర్ డాగ్స్‌ను ఏమార్చేందుకు మావోయిస్టులు ముడి బాంబులను జంతువుల మలంలో దాచేస్తున్నారని తెలిపింది. 2017 తొలి త్రైమాసికంలో భద్రతా దళాల స్నిఫర్ డాగ్స్ ఈ కారణంగానే గాయపడటం లేదా మృతి చెందాయంది. నక్సల్స్ దాడులకు ఉపయోగించే సరికొత్త పద్ధతుల్లో ప్రముఖమైంది.. పేలుడు పదార్థంతో కూడిన రాంబో బాణం అని పేర్కొంది. గన్ పౌడర్ లేదా మందుగుండు కలిగిన ఆ బాణం లక్ష్యాన్ని తాకగానే పేలుతుంది. రాంబో బాణాలు ఎక్కువ నష్టాన్ని కలిగించకపోయినా భద్రతా సిబ్బందిలో ఆందోళన కలిస్తాయని.. తద్వారా దాడి చేయడానికి మావోలకు ఉపయోగపడతాయంది. -
మోదీ భద్రతకు ఇజ్రాయెల్ జాగిలాలు
న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీ భద్రతలో అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత పేరున్న స్నిఫర్ డాగ్స్‌ను దిగుమతి చేసుకున్నారు. పేలుడు పదార్థాలు, బాంబులను సమర్థవంతంగా కనిపెట్టడంతో పాటు నేరస్థులను పట్టుకోవడంలోనూ స్నిఫ్ అండ్ అటాక్ డాగ్స్ కీలకంగా వ్యవహరిస్తుంటాయి. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల భద్రతకు ఇపుడు వీటిని వినియోగిస్తున్నారు. ఇప్పడు అలాంటి జాగిలాలనే భారత ప్రభుత్వం ఇస్రాయిల్ నుంచి తెప్పించింది. గత ఏడాది 30 అటాక్ డాగ్స్, బాంబు స్నిఫర్ డాగ్స్, చేజర్స్ లను జెరుసలామ్ నుంచి తెప్పించినట్లు సీనియర్ సెక్యురిటీ అధికారి ఒకరు తెలిపారు. తాజాగా ఇస్రాయిల్ రక్షణ రంగంలో మేటిగా నిలిచిన కానైన్లు - లాబ్రడార్లు, జర్మన్ షెప్పర్లు, బెల్జియన్ మాలిటియోస్ జాతులను దిగుమతి చేసుకున్నారు. ఎందుకంటే ప్రధాని నరేంద్రమోదీకి ముప్పు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు భద్రతా అధికారులు తెలిపారు. వీటి ధర మాత్రం అధికారులు గోప్యంగా ఉంచారు. మోదీ గత నెలలో ఇస్రాయిల్ పర్యటనలో ఆదేశ ప్రధాని బెంజామిన్ నెటాన్యుహుతో భద్రత, రక్షణ తదితర అంశాల గురించి మోదీ చర్చించారు. ఈ డాగ్స్ కి దాదాపు 6నెలలపాటు శిక్షణ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ శిక్షణ కాలంలో కుక్కలకు ప్రత్యేకమైన ఆహారం, నివాస వాతావరణం ఏర్పాటు చేశారు.అంతేకాకుండా వాటికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. తరచూ వైద్యలు చేత పరీక్షలు కూడా చేయిస్తూ ఉంటారని భద్రతా అధికారి తెలిపారు. భారత మాజీ ప్రధానుల కుటుంబాలకు సైతం ఈ భద్రత వర్తిస్తుంది. -
తనిఖీలకు జాగిలాలూ సై..
కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ధరణికోట, ధ్యానబుద్ధ, అమరేశ్వర ఘాట్‌ల్లో జాగిలాలు, మెటల్ డిటెక్టర్లతో నిర్విరామంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. – అమరావతి (పట్నంబజారు) -
పేలుడు పదార్థాలనే మాత్రమే శునకాలు గుర్తిస్తాయట!
వాషింగ్టన్: ఏదో అనుమానాస్పద వస్తువు కనబడింది.. లేదా ఓ చోట బాంబు పెట్టినట్లుగా సమాచారం వచ్చింది.. ఏముంది వెంటనే పేలుడు పదార్థాలను గుర్తించే శునకాలను (స్నిఫర్ డాగ్స్)ను వెంటబెట్టుకుని భద్రతా సిబ్బంది వచ్చేస్తారు. అవి వాసన చూసేసి.. బాంబులను గుర్తిస్తాయి. అంతేకాదు.. అసలైన పేలుడు పదార్థాల వాసనకు, అదే తరహాలో ఇతర వాసనలకు మధ్య తేడానూ అవి గుర్తించగలవని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. మరి శునకాలకు ఈ శక్తి ఎలా వచ్చిందనే అంశంపై అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ-పర్దూ యూనివర్సిటీ ఇండియానాపోలిస్ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. సాధారణంగా పేలే గుణం లేని కార్బన్ సహిత పదార్థాలు విడుదల చేసే రసాయనాలు ద్వారా కూడా బాంబుల తరహా వాసనను విడుదల చేస్తాయి. అలాంటి రసాయనాలతో శునకాలను పరిశీలించినా, అవి మాత్రం అసలైన పేలుడు పదార్థాలనే గుర్తించాయని పరిశోధనకు నేతత్వం వహించిన గూడ్ పాస్టర్ చెప్పారు. -
వినాయక నిమజ్జనానికి 15 వేల మంది పోలీసు బలగాలు
రేపు హైదరాబాద్ నగరంలో జరగనున్న వినాయకుని నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ కమిషనరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన నిమజ్జనం సందర్భంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చర్యలు జరగకుండా పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్టు చేస్తున్నట్లు వివరించారు. హుసేన్సాగర్ వద్ద 71 భారీ క్రెయిన్లు ఏర్పటు చేసినట్లు తెలిపారు. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో 800 సీసీ కెమెరాలు ఉంచినట్లు చెప్పారు. 155 మంది ప్రత్యేక స్థాయి అధికారులు నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారని చెప్పారు.15 వేల మంది పోలీసు బలగాలను నగరంలో మోహరించినట్లు పేర్కొన్నారు. అలాగే 175 ఏపీఎస్పీ బలగాలు, 32 బాంబు స్క్వాడ్ బృందాలు, 25 స్నిఫర్ డాగ్స్‌లను నిరంతంరం పహరా కాస్తుంటాయని సీపీ అనురాగ్ శర్మ తెలిపారు.