gang ster nayeem
-
గ్యాంగ్‌స్టర్ నయీమ్ మేనకోడలు మృతి
సాక్షి, నల్లగొండ : గ్యాంగ్ స్టర్ నయీమ్ మేనకోడలు శాహేదా సాజిద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ పట్టణ పరిధిలోని కేశరాజుపల్లి శివారులో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవింగ్ చేస్తూ.. లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరగినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. శాహేద్ నల్లగొండ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా ఘటన సంభవించింది. కారు అతివేగమే ప్రమాదానికి కారణంగా అక్కడి వారు చెబుతున్నారు. ఆమె మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చరీకి తరలించారు. కాగా మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌కు చెందిన బెస్త కిష్టయ్య, జోడు ఆంజనేయులుల జంట హత్య కేసుల్లో ఆమె నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అంతేకాదు నయీమ్ చేసిన పలు హత్యల్లోనూ ఆమె విచారణను ఎదుర్కొంటున్నారు. -
నయీం కేసులో సిట్ విస్తరణ
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో అక్రమాల విచారణను వేగవంతం కోసం ఏర్పాటు చేసిన సిట్ ను విస్తరిస్తూ డీజీపీ అనురాగ్ శర్మ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు 8 మంది ఇన్స్పెక్టర్లు, అడిషనల్ ఎస్పీతో ఐజీ నేతృత్వంలోని బృందం విధులు నిర్వహిస్తోంది. అదనంగా మరో ముగ్గురు లేదా నలుగురు డీఎస్పీలు, ఐదుగురు సీఐలను సిట్‌లో నియమించనున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ... ఇప్పటి వరకు 71 కేసులు నమోదయ్యాయని, ఈ కేసుల్లో 82 మంది అరెస్టు చేశామని తెలిపారు. నయీంతో సంబంధాలున్న పోలీసుల అధికారులపై విచారణ చేస్తామని, త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పారు. -
నయీం కేసులో ఇప్పటివరకూ 50మంది అరెస్ట్
హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఇప్పటివరకూ 50 మందిని అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. గతంలో అరెస్ట్ అయిన 39మంది బంధువులు, అనుచరులు సహా మరో 11మందిని అరెస్ట్ చేసినట్లు మంగళవారమిక్కడ వెల్లడించారు. మాజీ మావోయిస్టు శేషన్న సహా మరో అయిదుగురు కీలక అనుచరుల కోసం గాలిస్తున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. పరారీలో ఉన్నవారు అరెస్ట్ అయితే కేసులో కీలక సమాచారంతో పాటు మరిన్ని ఆస్తులు, డంప్ దొరికే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు నయీం ప్రధాన అనుచరుడు పాశం శీనును మూడు రోజులపాటు కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ కు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 3 వరకు సిట్ అధికారులు శీనును విచారించనున్నారు. -
నయీం కేసులో విస్మయకర విషయాలు
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో విస్మయకర విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా ఈ కేసు విచారణలో పది రోజుల పసికందు విక్రయం బయటపడింది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం ఏనెమీది తండాకు చెందిన దత్తు అనే వ్యక్తి మిర్యాలగూడలో ఉండే నయీం అత్త సుల్తానాకు పది రోజుల పసికందును విక్రయించినట్లు గుర్తించారు. దత్తు నుంచి కొనుగోలు చేసిన పసికందును సుల్తానా నయీంకు అప్పగించింది. ఈ వ్యవహారంలో ఇద్దరు ఆర్ఎంపీలు కీలక పాత్ర పోషించినట్లు గుర్తించిన సిట్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.