సాక్షి, నల్లగొండ : గ్యాంగ్ స్టర్ నయీమ్ మేనకోడలు శాహేదా సాజిద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ పట్టణ పరిధిలోని కేశరాజుపల్లి శివారులో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవింగ్ చేస్తూ.. లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరగినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. శాహేద్ నల్లగొండ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా ఘటన సంభవించింది. కారు అతివేగమే ప్రమాదానికి కారణంగా అక్కడి వారు చెబుతున్నారు. ఆమె మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చరీకి తరలించారు. కాగా మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌కు చెందిన బెస్త కిష్టయ్య, జోడు ఆంజనేయులుల జంట హత్య కేసుల్లో ఆమె నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అంతేకాదు నయీమ్ చేసిన పలు హత్యల్లోనూ ఆమె విచారణను ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment