Nayeem Cases
-
నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్న అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం ప్రధాన అనుచరుడిగా చలామణీ అయిన శేషన్న అలియాస్ రామచంద్రుడిని పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. మహాబూబ్నగర్జిల్లా అచ్చంపేటకు చెందిన శేషన్న సుదీర్ఘకాలం నయీంతో కలిసి పనిచేశారు. నయీంకు సంబంధించిన యాక్షన్టీంకు నేతృత్వం వహించారు. 2016 ఆగస్టులో షాద్‌నగర్‌లో జరిగిన నయీం ఎన్కౌంటర్ తర్వాత శేషన్న అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏపీలోని కర్నూల్లోనూ పలు సెటిల్ మెంట్లు చేస్తున్నాడు. హైదరాబాద్‌లోని హుమాయున్‌నగర్‌లో నమోదైన కేసులో శేషన్న వాంటెడ్‌గా ఉన్నాడు. ఇతడిని పోలీసులు సోమవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి అదుపులోకి తీసుకున్నారు. కొన్నాళ్లుగా ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్న శేషన్న దగ్గరి నుంచి పలు డాక్యుమెంట్లతో పాటు 9 ఎంఎం పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. చదవండి: (‘జనసేన నాయకులు అన్యాయం చేశారు’) -
నయీం కుడి భుజం శేషన్న జాడేది..?
సాక్షి, హైదరాబాద్ : ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్న ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. ఎన్కౌంటర్ సమయంలో నయీం దగ్గర దొరికిన ఏకే–47తో పాటు అతడి డెన్ల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పేలుడు పదార్థాల గుట్టు వీడాలంటే శేషన్న దొరకాల్సిందే.. శేషన్న పట్టుకునే విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సైతం ఘోరంగా విఫలమైంది. నయీం హతమై నాలుగున్నరేళ్లు కావస్తున్నా ఇప్పటికీ నయీం యాక్షన్ టీమ్ ఇన్చార్జ్ ఆచూకీ లభించలేదంటే సిట్ పనితీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. అతడు చిక్కలేదా..? పోలీసులు పట్టుకోవట్లేదా..? అన్న విషయం స్పష్టం కావట్లేదు. మరోపక్క నయీం రాసిన డైరీల ఆచూకీ లభించకపోవడంలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. ఆ టీమ్ అత్యంత కీలకం.. షాద్‌నగర్ శివార్లలోని మిలీనియం టౌన్షిప్లో 2016 ఆగస్టు 8న జరిగిన ఎన్కౌంటర్లో నయీం హతమయ్యాడు. ఇది జరిగిన నాటి నుంచి అతడి కేసుల్ని దర్యాప్తు చేసిన, చేస్తున్న పోలీసులు, సిట్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా కేసులు నమోదు చేశారు. కేసుల కంటే ఎక్కువ సంఖ్యలోనే అతడి అనుచరుల్ని పట్టుకున్నారు. వీరంతా అప్పటివరకు తెరచాటుగా ఉంటూ నయీం ఆదేశాల మేరకు పని చేస్తూ వచ్చారు. భూ కబ్జాలకు పాల్పడటం, బెదిరింపుల ద్వారా వసూళ్లు, ల్యాండ్ సెటిల్మెంట్లలో కీలకపాత్ర పోషించడంతో పాటు నయీం ఆస్తులకు బినామీలుగా, ఆస్తిపత్రాలు, నగదు తదితరాలను దాచే డెన్లకు కేర్ టేకర్స్‌గా పని చేశారు. ఈ ముఠాకు భిన్నమైన యాక్షన్ టీమ్ ఒకటి నయీం కనుసన్నల్లో పనిచేసేది. వీరి పేర్లు, వ్యవహారాలు గతంలో అనేక సార్లు వెలుగులోకి వచ్చాయి. కరుడుగట్టిన నేరగాళ్లు, మాజీ మావోయిస్టులు, పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన, ఎక్కని వారితో కూడిన ఈ టీమ్ నల్లగొండ, హైదరాబాద్, సైబరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో యాక్టివ్‌గా పనిచేసింది. అనేక కేసుల్లో వీరి ప్రస్తావన ఉంది. ఆయుధాల గుట్టు వీడేనా? ఈ యాక్షన్ టీమ్ సాధారణ సమయంలో ఎవరి కంటపడేది కాదు. నయీం ఆదేశాల మేరకు నిర్దేశిత సమయంలో రంగంలోకి దిగడం.. హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడి ఆపై షెల్టర్ జోన్స్‌కు వెళ్లిపోవడం వీరి పని. ప్రతి కేసులోనూ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి మరో టీమ్ సిద్ధంగా ఉండేది. నయీంకు చెందిన యాక్షన్ టీమ్ చేసిన ఏ నేరమైనా.. మేమే చేశామంటూ తమ మీద వేసుకునే ఈ టీమ్ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోతుండేవారు. ఈ నేపథ్యంలో ఆయా కేసుల్లో యాక్షన్ టీమ్‌కు చెందిన వారు కేవలం కుట్రదారులుగానే నమోదయ్యారు. అంతకాలం రాజ్యమేలిన ఈ యాక్షన్ టీమ్ నయీం ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. నయీం వద్ద, అతడి డెన్లలోనూ దొరికిన భారీ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ విషయం నయీంతో పాటు యాక్షన్ టీమ్‌కు నేతృత్వం వహించిన శేషన్నకు మాత్రమే తెలిసే అవకాశముంది. గాలించినా ఫలితం శూన్యం.. కేవలం ఆయుధాల సమాచారమే కాదు.. నయీం వ్యవహారంలో అనేక చిక్కుముడుల్ని విప్పగలిగేది శేషన్న మాత్రమే. నయీం ‘వారసత్వాన్ని’కొనసాగించే ప్రయత్నం ఆ యాక్షన్ టీమ్ చేయవచ్చని తొలినాళ్లలో పోలీసులు అనుమానించారు. నయీంకు చెందిన యాక్షన్ టీమ్‌లో ఏడుగురున్నట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. అయితే మహబూబ్‌నగర్ జిల్లా మన్ననూరు కేంద్రంగా కార్యకలాపాలు నడిపి.. పటోళ్ల గోవవర్ధన్రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మావోయిస్టు శేషన్ననే అత్యంత కీలకం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసు వర్గాలకు చెందిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ముమ్మరంగా గాలించాయి. ఓ దశలో శేషన్న పోలీసుల అదుపులోనే ఉన్నాడనే వార్తలు వచ్చినా.. ఎవరూ ధ్రువీకరించలేదు. ఈ గాలింపు మొదలై ఇప్పటికీ నాలుగున్నరేళ్లు కావస్తున్నా శేషన్న పోలీసులకు దొరకలేదు. గ్యాంగ్‌స్టర్‌నే పట్టుకున్న పోలీసులు అతడి కుడిభుజాన్ని పట్టుకోలేకపోవడం సిట్ పనితీరుపై సందేహాలకు తావిస్తోంది. డైరీలెన్ని? అవెక్కడ? సుదీర్ఘ కాలం మావోయిస్టులతో కలసి పనిచేసిన నయీంకు డైరీ రాసే అలవాటుంది. నయీం 2010 వరకు రాసిన డైరీలను సొహ్రబుద్దీన్ కేసు భయంతో తగలపెట్టాడని గతంలో చిక్కిన అతడి అనుచరుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నుంచి ఎన్కౌంటర్ జరిగే వరకు ప్రతి అంకాన్నీ నయీం తన డైరీల్లో రాసుకున్నాడు. ఎవరెవరితో సంబంధాలున్నాయి? ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు చేశాడు? ఆయా దందాల్లో ఎంత డబ్బు వచ్చింది? దాన్ని ఎవరెవరికి పంచాడు? ప్రధాన అనుచరులెవరు.. ఇలా ఎన్నో అంశాలు డైరీల్లో రాసినట్లు సమాచారం. ఎన్కౌంటర్ తర్వాత షాద్‌నగర్‌తో పాటు హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ఉన్న డెన్ల నుంచి పోలీసులు డైరీలు స్వాధీనం చేసుకున్నారనీ వార్తలు వెలువడ్డాయి. అయితే అవెన్ని? ఎక్కడున్నాయి? వాటిలో ఏముంది.. అనేది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. -
నయీం కేసు: ఆ డైరీని బయట పెట్టాలి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో పోలీసుల పేర్లను తొలగించడంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ అభ్యంతరం తెలిపింది. సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగలేదని, కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. నయీం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ రాసింది. నాలుగేళ్లుగా దర్యాప్తు చేస్తున్నా.. బాధితులకు న్యాయం జరగలేదని, నేరస్తులకు శిక్ష పడలేదని లేఖలో పేర్కొంది. ఈ కేసును సీబీఐకి అప్పగించి పారదర్శకంగా దర్యాప్తు జరిపించాలని గవర్నర్‌ను కోరింది. (చదవండి : నయీం కేసులో మరో సంచలనం) నయీం డైరీని బయట పెట్టాలి నయీం కేసులో సిట్ దర్యాప్తు పారదర్శకంగా లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి ఆరోపించారు. కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. నయీం కేసులో పోలీసులకు క్లీన్ చిట్ ఇవ్వడం అనుమానం కలిగిస్తోందన్నారు. నయీం ఇంట్లో డబ్బులు లెక్కించడానికి రెండు కౌంటింగ్ మిషన్లు తీసుకెళ్లి.. 3.74లక్షల రూపాయలు మాత్రమే దొరికినట్లు చూపించడం దారుణమన్నారు. 240 కేసులు నమోదు చేసి నాలుగేళ్లయినా.. ఇప్పటి వరకు 173 చార్జషీట్లు మాత్రమే దాఖలు చేశారని విమర్శించారు. నయీం డైరీని బయట పెట్టాలన్నారు. నయీం కేసును సీబీఐతో విచారణ జరిపించి, నేరస్తులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. -
నయీం కేసులో మరో సంచలనం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. నయీం ఎన్కౌంటర్ అనంతరం వెలుగులోకి వచ్చిన ఉదంతాలపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న 25 మంది పోలీసులకు క్లీన్చిట్ ఇచ్చింది. నయీంతో సంబంధాలు ఉన్నాయని ల్యాండ్ సెటిల్మెంట్, బెదిరింపు ఆరోపణలు ఎదుర్కొన్న 25 మంది పోలీస్ అధికారులకు దీనిలో ఎలాంటి సంబంధంలేదని తేల్చింది. అధికారులపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి సాక్ష్యాధారాలు లభించని కారణంగా వారందరి పేర్లను నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పోలీసు అధికారుల పాత్రపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాసిన లేఖకు సిట్ చీఫ్ నాగిరెడ్డి శనివారం సమాధానమిచ్చారు. కాగా నయీం ఎన్కౌంటర్, తదనంతరం పరిణామాలపై సిట్ 175కుపైగా చార్జ్‌సీట్‌లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. 130కి పైగా కేసుల్లో పోలీసులతో పాటు 8మంది ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు కూడా ఉన్నాయి. వీరిలో ఇద్దరూ అడిషనల్ ఎస్పీలతో పాటు ఏడుగురు డీఎస్పీలు,13 మంది సీఐలు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. తాజాగా వీరందరికి క్లీన్‌చీట్ ఇస్తున్నట్లు సిట్ చీఫ్ నాగిరెడ్డి వెల్లడించారు. మరోవైపు నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గవర్నర్‌కు లేఖ రాసింది. ఈ కేసులో పోలీసుల పేర్లను తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. నయీం ఇంట్లో దొరికిన డైరీలో ఉన్న వివరాలను ఇప్పటివరకు ఇవ్వలేదని, 4 ఏళ్లుగా కేసును సిట్ దర్యాప్తు చేస్తున్న బాధితులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. నేరస్తులకు శిక్ష పడడాలంటే ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు కోరారు. క్లీన్ చిట్ పొందినవారిలో అడిషనల్ ఎస్పీ లు శ్రీనివాస్ రావు చంద్రశేఖర్ డీఎస్పీలు.. సీహెచ్. శ్రీనివాస్ ఎం శ్రీనివాస్ సాయి మనోహర్ ప్రకాష్ రావు వెంకట నరసయ్య అమరేందర్ రెడ్డి తిరుపతన్న ఎస్ఐలు.. మస్తాన్ రాజగోపాల్ వెంకటయ్య శ్రీనివాస్ నాయుడు కిషన్ ఎస్ శ్రీనివాసరావు వెంకట్ రెడ్డి మజీద్ వెంకట సూర్య ప్రకాష్ రవి కిరణ్ రెడ్డి బలవంత య్య నరేందర్ గౌడ్ రవీందర్ కానిస్టేబుల్ దినేష్ ఆనంద్ బాలన్న సదాత్ మియా -
వారికి చుక్కలు చూపెడుతున్న నయీం గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబసభ్యులు ఐటీ అధికారులను ముప్ప తిప్పలు పెడుతున్నారు. నయీం ఆస్తులకు సంబంధించి సిట్ నుంచి పూర్తి వివరాలు సేకరించిన ఐటీ అధికారులు ఇప్పటికే 9 సార్లు నయీం కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు. అయితే ఐటీ శాఖ అధికారులు ఇచ్చిన ఏ నోటీసుకూ పయూం కుటుంబ సభ్యులు స్పందించ లేదు. నయీం భార్య, తల్లి, సోదరి కి ఇంతకు ముందు చాలా సార్లు నోటీసులు పంపిన దానిపై వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇదిలా ఉండగా ...1000 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి నయీం కుటుంబ సభ్యుల నుంచి వివరణ కోరిన ఐటీ శాఖ తాజా గా నయీం అనుచరుడు పాశం శ్రీనుకు నోటీసులు ఇచ్చింది. -
గ్యాంగ్‌స్టర్ నయీమ్ మేనకోడలు మృతి
సాక్షి, నల్లగొండ : గ్యాంగ్ స్టర్ నయీమ్ మేనకోడలు శాహేదా సాజిద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ పట్టణ పరిధిలోని కేశరాజుపల్లి శివారులో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవింగ్ చేస్తూ.. లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరగినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. శాహేద్ నల్లగొండ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా ఘటన సంభవించింది. కారు అతివేగమే ప్రమాదానికి కారణంగా అక్కడి వారు చెబుతున్నారు. ఆమె మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చరీకి తరలించారు. కాగా మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌కు చెందిన బెస్త కిష్టయ్య, జోడు ఆంజనేయులుల జంట హత్య కేసుల్లో ఆమె నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అంతేకాదు నయీమ్ చేసిన పలు హత్యల్లోనూ ఆమె విచారణను ఎదుర్కొంటున్నారు. -
గ్యాంగ్‌స్టర్ నయీమ్ సోదరి అరెస్ట్
సాక్షి, భువనగిరి: భూ ఆక్రమణలకు పాల్పడిందని అభియోగం మేరకు గ్యాంగ్‌స్టర్ నయీమ్ సోదరి సలీమాబేగంను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ఎం.సురేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పరిధిలోని సర్వే నంబర్ 590, 586లలో భూయాజమాని కె.అభినందన్ ప్లాట్లు చేసి 2006 సంవత్సరం కంటే ముందు విక్రయించాడు. వి.శంకర్‌చారి ఆ ప్లాట్లను కొనుగోలు చేశారు. 2007 తర్వాత అభినందన్‌కు చెందిన ఐదెకరాల భూమిని సలీమాబేగం, గ్యాంగ్‌స్టర్ నయీమ్, అతని గ్యాంగ్ సభ్యుల పేరిట ఎక్కరం చొప్పున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ఎడ్ల వెంకట్‌రెడ్డికి విక్రయించారు.. ఆ భూమిని వెంకట్‌రెడ్డి లండన్ టౌన్షిప్ పేరుతో వెంచర్ చేసి ప్లాట్లు విక్రయించాడు. మొదట కొన్న ప్లాట్ల యాజమానులను చంపుతామని బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు. అదే విధంగా 2006 సంవత్సరంలో భూమి యాజమాని అయిన కూరపాటి శ్రీదేవి, కూరపాటి శ్రీనివాస్‌లను బెదిరించి వారికి చెందిన 9 ఎకరాల భూమిని సలీమాబేగం కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆభూమిని కూడా ఎడ్ల వెంకట్‌రెడ్డికి విక్రయించారు. ఇందులో భాగంగా ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు వివరించారు. భువనగిరి పరిధిలో 14 కేసులు ఆమెపై నమోదైనట్లు చెప్పారు. భువనగిరి డీసీపీ, ఏసీపీ ఆదేశాల మేరకు కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. సలీమాబేగంపై భువనగిరితోపాటు శంషాబాద్, షాద్‌నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, కోరుట్ల, ఆలేరు, నర్సింగి, ఆదిభట్ల, పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ల పరిధిలో భూములు, ప్లాట్ల కేసులు ఉన్నట్లు చెప్పారు. -
రాష్ట్ర ప్రభుత్వం నయీమ్ డైరీని బయటపెట్టాలి
-
నయీమ్ కేసు ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: నయీమ్ కేసుల వ్యవహారంపై ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ (ఎఫ్‌జీజీ) లేఖాస్త్రం సంధించింది. ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాలతో గవర్నర్‌కు లేఖ రాసింది. కబ్జాలు, సెటిల్మెంట్లు, కిడ్నాప్‌లు, హత్యలతో రెండు దశాబ్దాలపాటు హైదరాబాద్ పరిసరాల్లో వ్యాపారులకు కంటి మీద కనుకు లేకుండా చేసిన నయీమ్ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2016లో నయీమ్‌ను ఎన్కౌంటర్ అనంతరం సాగిన దర్యాప్తు, పురోగతి, ఎవరెవరిని అరెస్టు చేశారు? ఎవరిపై చర్యలు తీసుకున్నారో వివరాలు తెలపాలంటూ ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’(ఎఫ్‌జీజీ) సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేసింది. సంస్థ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి ఆర్టీఐ ద్వారా ఈ ప్రశ్నలను సంధించారు. కానీ, పోలీసుల నుంచి దర్యాప్తు జరుగుతోందన్న సమాధానం మాత్రమే వచ్చింది. దీంతో సదరు ఆర్టీఐ కాపీతోపాటు పలు సందేహాలతో కూడిన లేఖను బుధవారం ఇక్కడ విడుదల చేశారు. మూడేళ్లవుతున్నా నత్తలా నడుస్తున్న కేసు పక్కదారి పడుతోందంటూ గవర్నర్‌కి లేఖ ద్వారా ఫిర్యాదు కూడా చేశారు. -
గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడి అరెస్ట్
సాక్షి, భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడు కత్తుల జంగయ్యను అరెస్ట్ చేసినట్లు సీఐ సురేందర్ తెలిపారు. గురువారం స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుడి వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని నారాయణగూడకు చెందిన డీఎస్ ప్రాన్సిస్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి భువనగిరి పట్టణ శివారులో ఉన్న ఎస్ఎల్ఎన్ఎస్ వెంచర్లో 1993, 1996 మధ్యలో జీపీఏ హోల్డర్ పక్కిర్ బాల్‌రెడ్డి వద్ద నాలుగు ప్లాట్లను ఒక్కొక్కటి 300 గజాల చొప్పున మొత్తం 1200 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. 2006 సంవత్సరంలో నయీం తన అనుచరులైన పాశం శ్రీను, నాజర్, కత్తుల జంగయ్యతో కలిసి ఎలాగైనా మొత్తం భూమిని కాజేయాలనే ఉద్దేశంతో దౌర్జన్యం చేసి సర్వే నంబర్ 721, 733లో ఉన్న మొత్తం 154 ఎకరాల భూమిని పక్కిరు బాల్రెడ్డికి జీపీఏ చేసిన వ్యక్తుల ద్వారా రిజిస్టర్ చేసుకుని తమ కబ్జాలోకి తీసుకున్నారు. బాధితులు ప్లాట్లలోకి వెళ్లినపుడు ఇక్కడికి వస్తే చంపేస్తాం అంటూ బెదిరించారు. తమ ప్లాట్లను అన్యాయంగా అక్రమించుకున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేయగా పట్టణంలోని స్థానిక సంజీవనగర్‌లో కత్తుల జంగయ్య ఉన్నట్లు సమాచారం రావడంతో అతని నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అతనిని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకోవడంతో కేసునమోదు చేసి కోర్టుకు రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. గతంలో కత్తుల జంగయ్యను మొత్తం 91కేసులలో అరెస్టు చేసినట్లు, పీడీ యాక్టును కూడా నమోదు చేయగా సంవత్సరం జైలు శిక్ష పడినట్లు తెలిపారు. -
నయీం అక్రమాలపై విచారణ జరపాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: నయీం గ్యాంగ్ చేసిన హత్యలు, ఆస్తుల ఆక్రమణలపై హైకోర్టు ఆధ్వర్యంలో న్యాయవిచారణ జరిపించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. కబ్జాలతో ఆస్తులు, భూములు కోల్పోయిన వారికి విచారణ ద్వారా న్యాయం చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. శుక్రవారం మఖ్దూంభవన్‌లో చాడ విలేకరులతో మాట్లాడారు. నయీం డైరీలో నేరాల చిట్టా మొత్తం ఉందని చెబుతున్నా, ఇంత వరకు డైరీని ఎందుకు బహిరంగ పర్చలేదని ప్రశ్నించారు. ఇటీవల అకాల వర్షాలు, పిడుగు లు, కరువుతో రైతులపై ముప్పేట దాడి జరుగు తున్నందున, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
పోలీస్ శాఖలో కలకలం..!
సాక్షి, యాదాద్రి : డీసీపీ రామచంద్రారెడ్డితో పాటు భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ను రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సీపీ నిర్ణయం తీసుకోవడంతో జిల్లా పోలీస్ శాఖలో ఒక్కసారిగా కలకలం రేపింది. గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరుల ఆగడాలను అదుపుచేయలేకపోవడంతో ఇతర ఆరోపణలు రావడంతోనే వేటు వేశారని తెలుస్తోంది. ఏకంగా ఉన్నతాధికారిపైనే చర్యలు తీసుకోవడంతో పోలీస్ యంత్రాం గంలో ప్రకంపనలు సృష్టించింది. నిఘా కఠినతరం పోలీస్ అధికారుల పనితీరుపై రాచకొండ సీపీ నిఘా కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. ఇంటలిజెన్స్ విభాగం ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి తప్పు చేసిన వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. సిట్, ఇంటలిజెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే భువనగిరి జోన్ డీసీపీ రామచంద్రారెడ్డిని రాచకొండ కమిషనరేట్ కార్యాలయానికి, భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ వెంకన్నగౌడ్‌ను రాచకొండ సీపీ కార్యాలయానికి అటాచ్ చేశారని సమాచారం. భూ వివాదాల్లో జోక్యం, సెటిల్మెంట్లు..! జిల్లాలో భూముల ధరల విపరీతంగా పెరగడంతో వివాదాలు తలెత్తుతున్నాయి. భూ వివాదాల్లో తలదూరుస్తున్న పోలీసులు సెటిల్మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. భువనగిరి శివా రులోని ఆర్డీఓ కోర్టులో గల సర్వే నంబర్ 730లో 5.20 ఎకరాల భూమిని నయీమ్ అనుచరులైన పాశం శ్రీను, ఎండీ నాసర్ భువనగిరి రిజిష్ట్రేషన్ కార్యాలయంలో ఇటీవల అక్రమ రిజిష్ట్రేషన్‌కు రంగం సిద్ధం చేశారన్న ఫిర్యాదులు బాధితులనుం చి ఉన్నతస్థాయికి వెళ్లాయి. దీంతో మళ్లీ నయీమ్ అనుచరుల ఆగడాలు ప్రారంభమయ్యాయన్న సమాచారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. మరో వైపు ఇటీవల జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న పలువురు ఎస్‌ఐలపైనా ఫిర్యాదులు రావడంతో వారిపై బదిలీ వేటు వేశారు. ఇద్దరు ఏసీపీ స్థాయి అధికారుల బదిలీపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాదగిరిగుట్టలో నయీమ్ బాధితులకు సహకరించకుండా వారినే దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ముగ్గురు పోలీస్ అధికారులను సీపీ మందలించినట్లు సమాచారం. అలాగే యాదగిరిగుట్ట సబ్ డివిజన్లో ఒక ఎస్ఐ విధి నిర్వహణపై ఫిర్యాదులు రావడంతో ఆయన్ను కూడా మందలించి పంపించారని తెలుస్తోంది. సీపీకి అందిన ఫిర్యాదులు! నయీమ్ అనుచరులకు కొందరు పోలీసులు సహకరిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో సీపీ సీరియస్‌గా పరిగణించి చర్యలు తీసుకున్నాడని తెలుస్తోంది. డీసీపీ తన కింది ఉద్యోగులు కొందరితో కలిసి నయీమ్ అనుచరుల భూ సెటిల్మెంట్లను చూసీ చూడనట్లు వ్యవహరించి వారికి సహకరిస్తున్నాడన్న ఫిర్యాదులు అందాయి. భువనగిరి శివారులోగల సర్వే నంబర్ 730లో ఎ5.20గుంటల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కోసం ఇటీవల నయీమ్ అనుచరులు పాశం శ్రీను, అ బ్దుల్ నాసర్ మరికొందరు కలిసి భువనగిరి రిజి స్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ సహకారంతో నయీమ్‌కు సంబంధించిన బినామీ ఆస్తులను ఇతరుల పేరున రిజిస్ట్రేషన్ చేయించేందుకు సిద్ధం అయ్యారు. ఒకరి పేరుమీద స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లారు. అయితే పట్టాదారు పాస్ పుస్తకాలు తెస్తేనే రిజిస్టర్ చేస్తామని అక్కడ అధికారులు చెప్పడంతో త్వరలో తెస్తామని చెప్పి స్టాంప్ డ్యూటీ చెల్లించామని రిజిస్టర్ చేయమని డాక్యుమెంట్ రైటర్ ద్వారా ఒత్తిడి తెచ్చారు. దీంతో సబ్‌రిజిస్ట్రార్ డాక్యుమెంట్‌ను పెండింగ్‌లో ఉంచారు. నయీమ్ అనుచరుల నుంచి తీవ్రమైన ఒత్తిడులు రావడంతో అనుమానం వచ్చిన రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారులు పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్‌ను రద్దు చేశారు. ఈ విషయంపై ఆ భూమికి సంబంధించిన బాధితులు సీపీ మహేశ్ భగవత్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తమకు అన్యాయం జరుగుతుందని పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తక్షణమే సీపీ స్పందించి వెంటనే సిట్ విచారణకు ఆదేశించారు. దీంతో శనివారం సిట్,స్పెషల్ ఇంటలిజెన్స్ అధికారులు భువనగిరికి వచ్చి రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని తనిఖీ చేశా రు. హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్‌ను విచారించారు. ఇంట లిజెన్స్ అధికారులు స్థానికంగా సేకరించిన విషయాలను సీపీకి వివరించడంతో అయన డీసీపీతో సహ భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్పై చర్యలకు ఉపక్రమించారు. అంతేకాకుండా నయీ మ్ అనుచరులైన పాశం శ్రీను, అబ్దుల్ నాసర్ ఇళ్లలోనూ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కొనసాగుతున్న విచారణ బినామీ ఆస్తుల అక్రమ రిజిస్ట్రేషన్‌కు పాల్పడుతు న్నట్లు అందిన ఫిర్యాదు మేరకు నయీమ్ అను చరులపై పోలీసులు భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిం దే. ఈ విషయమై విచారణ కొనసాగుతోంది. పుట్టగూడెంలో ఏం జరిగింది ? మరోవైపు రాజాపేట మండల పుట్టగూడెంలో రేషన్ బియ్యం అక్రమంగా డంప్ చేశారన్న సమాచారంతో శనివారం రాత్రి గ్రామానికి వెళ్లిన ఎస్ఓటీ పోలీస్‌లపై గిరిజనులు దాడి చేశారు. బియ్యంతో పాటు పోలీస్ వాహనానికి నిప్పు పెట్టారు. అయితే స్థానిక పోలీస్‌లకు మామూళ్లు ఇస్తున్నామని, దాడి చేయడానికి మీరు ఎవరని ఆగ్రహంతో ఎస్ఓటీ పోలీస్‌లపై దాడి చేసినట్లు సమాచారం. ఇటీవల ఇక్కడి ఎస్ఐని బియ్యం మామూళ్లకు సంబంధించి ఆరోపణలు రావడంతోనే బదిలీ చేసినట్లు చర్చ జరుగుతోంది. -
సిట్‌కు చట్టబద్ధత.. స్టేషన్ హోదా!
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులను దర్యాప్తు చేస్తున్న సిట్‌కు మరిన్ని అధికారాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సిట్‌కు స్టేషన్ హోదా కల్పించడంతోపాటు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది. దీంతో కేసులను సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తీసుకురావొచ్చని భావిస్తోంది. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉంది. ప్రస్తుతం సిట్‌ను డీజీపీ అనురాగ్‌శర్మ కేసుల దర్యాప్తు కోణంలోనే ఏర్పాటు చేశారు. దీనికి చట్టబద్ధమైన అధికారాలు లేవు. కేసుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అధికారం లేదు. కేసులు నమోదు చేయాలన్నా.. నిందితులను కస్టడీకి తీసుకోవాలన్నా.. సమన్లు జారీ చేయాలన్నా సంబంధిత పోలీస్‌స్టేషన్ ద్వారానే చేయాల్సి వస్తోంది. దీంతో కేసుల దర్యాప్తు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. ఈ నేపథ్యంలో చట్టబద్ధత కల్పిస్తే సిట్ నేరుగా రంగంలోకి దిగే అవకాశం ఉంది. అలాగే న్యాయస్థానాల్లో కూడా ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా ఉంటాయి.