సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబసభ్యులు ఐటీ అధికారులను ముప్ప తిప్పలు పెడుతున్నారు. నయీం ఆస్తులకు సంబంధించి సిట్ నుంచి పూర్తి వివరాలు సేకరించిన ఐటీ అధికారులు ఇప్పటికే 9 సార్లు నయీం కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు. అయితే ఐటీ శాఖ అధికారులు ఇచ్చిన ఏ నోటీసుకూ పయూం కుటుంబ సభ్యులు స్పందించ లేదు. నయీం భార్య, తల్లి, సోదరి కి ఇంతకు ముందు చాలా సార్లు నోటీసులు పంపిన దానిపై వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇదిలా ఉండగా ...1000 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి నయీం కుటుంబ సభ్యుల నుంచి వివరణ కోరిన ఐటీ శాఖ తాజా గా నయీం అనుచరుడు పాశం శ్రీనుకు నోటీసులు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment