nayeemuddin case
-
వారికి చుక్కలు చూపెడుతున్న నయీం గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబసభ్యులు ఐటీ అధికారులను ముప్ప తిప్పలు పెడుతున్నారు. నయీం ఆస్తులకు సంబంధించి సిట్ నుంచి పూర్తి వివరాలు సేకరించిన ఐటీ అధికారులు ఇప్పటికే 9 సార్లు నయీం కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు. అయితే ఐటీ శాఖ అధికారులు ఇచ్చిన ఏ నోటీసుకూ పయూం కుటుంబ సభ్యులు స్పందించ లేదు. నయీం భార్య, తల్లి, సోదరి కి ఇంతకు ముందు చాలా సార్లు నోటీసులు పంపిన దానిపై వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇదిలా ఉండగా ...1000 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి నయీం కుటుంబ సభ్యుల నుంచి వివరణ కోరిన ఐటీ శాఖ తాజా గా నయీం అనుచరుడు పాశం శ్రీనుకు నోటీసులు ఇచ్చింది. -
నయీం కేసులో మరో కీలక మలుపు
నయీం గ్యాంగులో కీలక సభ్యుడు, అతడితో కలిసి కిడ్నాపులు, మోసాలు, నేరపూరిత కుట్రలు, భూ ఆక్రమణలు, బెదిరించి డబ్బు వసూళ్లు తదితర నేరాలకు పాల్పడిన సామా సంజీవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై పీడీ యాక్టు నమోదు చేశారు. హయత్‌నగర్ పరిధిలోని సాహెబ్‌నగర్ ప్రాంతానికి చెందిన సంజీవరెడ్డి నయీం గ్యాంగులో కీలక సభ్యుడని, అతడితో కలిసి ఆరు నేరాల్లో ఇతడిపై కేసులు ఉన్నాయని రాచకొండ పోలీసు కమిషనరేట్ ఒక ప్రటకనటలో తెలిపింది. పహాడి షరీఫ్, ఆదిభట్ల పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రధానంగా ఇతడు నేరాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడి పనులు ప్రజాభద్రతకు ముప్పుగా పరిణమించాయని, అతడిని కొన్నాళ్ల పాటు సమాజానికి దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో పీడీ చట్టం కింద కొంతకాలం పాటు జైల్లో ఉంచామని పోలీసులు తెలిపారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలను కాపాడేందుకు అతడిపై పీడీ చట్టం పెట్టాల్సిందిగా పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశించారన్నారు. కాగా, మరోవైపు నయీం అనుచరుడు పుల్లూరి మహేష్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నయీం ఎన్కౌంటర్ జరిగినప్పటి నుంచి మహేష్ పరారీలో ఉన్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి అతడి మృతదేహం కనిపించడంతో ఏమై ఉంటుందా అన్న ఆసక్తి నెలకొంది. -
నయీం కేసులో చర్యలకు సీఎం గ్రీన్ సిగ్నల్
నయీం కేసులో చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. డీజీపీ నివేదిక ఆధారంగా చర్యలకు సిద్ధమవుతోంది. నయీంతో సంబంధమున్న రాజకీయ నేతలు, అధికారులపై వేటు వేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతల నుంచే ప్రక్షాళన మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. దీంతో రాజకీయ, అధికార ప్రముఖులకు గుండెల్లో గుబులు మొదలైంది. ప్రాథమిక సమాచారం మేరకు ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు ఎమ్మెల్సీలు, 21 మంది అధికారులు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. నయీంతో సంబంధాలు ఉన్న విపక్ష నేతలపై కూడా విచారణ వేగవంతం అయ్యింది. ప్రభుత్వం కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతోందన్న విమర్శలు రాకుండా ఉండేందుకు ముందుగా సొంత పార్టీ నేతలపై చర్యలు తీసుకుని, ఆ తర్వాతే విపక్షాల జోలికి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నింటినీ ఇప్పటికే ఆయనకు అధికారులు అందజేసినట్లు తెలుస్తోంది.