నయీం కేసులో సిట్ విస్తరణ
Published Mon, Sep 12 2016 5:02 PM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో అక్రమాల విచారణను వేగవంతం కోసం ఏర్పాటు చేసిన సిట్ ను విస్తరిస్తూ డీజీపీ అనురాగ్ శర్మ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు 8 మంది ఇన్‌స్పెక్టర్లు, అడిషనల్ ఎస్పీతో ఐజీ నేతృత్వంలోని బృందం విధులు నిర్వహిస్తోంది. అదనంగా మరో ముగ్గురు లేదా నలుగురు డీఎస్పీలు, ఐదుగురు సీఐలను సిట్‌లో నియమించనున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ... ఇప్పటి వరకు 71 కేసులు నమోదయ్యాయని, ఈ కేసుల్లో 82 మంది అరెస్టు చేశామని తెలిపారు. నయీంతో సంబంధాలున్న పోలీసుల అధికారులపై విచారణ చేస్తామని, త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పారు.
Advertisement