సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని ఆలేరు మండలం కందిగడ్డతండా సమీపంలో ఈనెల 7న కరుడుగట్టిన ఉగ్రవాదులు వికారుద్దీన్ అండ్ కోను హతమార్చిన ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలిసింది. ఈ ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సిట్ ద్వారా దర్యాప్తు జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం.
అయితే, ఈ ఘటనపై ఇప్పటికే వికారుద్దీన్ తండ్రితోపాటు పలు ప్రజాసంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. వికారుద్దీన్ తండ్రితో పాటు మరికొందరు ఎస్కార్ట్ పోలీసులపై కేసులు పెట్టాలని ఆలేరు పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై ఇప్పటికే మెజిస్టీరియల్ విచారణకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారిని ఈ విచారణ జరపాలని ఆయన జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై సిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
ఎన్‌కౌంటర్‌పై ‘సిట్’
Published Mon, Apr 13 2015 4:00 AM | Last Updated on Sat, Aug 11 2018 8:07 PM
Advertisement