gangaram village
-
ఆ గ్రామాల్ని ఖాళీ చేయించొద్దు
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కోమట్లగూడెం, కొడిసెలగట్టు అటవీ గ్రామాల నుంచి జనాన్ని ఖాళీ చేయించవద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోమట్లగూడెంకు చెందిన కిన్నెర బుచ్చక్క సహా 25 మంది, కొడిసెలగట్టు గ్రామస్తుడు పి.కన్నయ్య సహా 24 మంది దాఖలు చేసిన రిట్ పిటిషన్లను గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ విచారించారు. అటవీ చట్టాన్ని అమలు చేశాకే వారిని అక్కడి నుంచి వారిని తరలించాలని ఆదేశించారు. అటవీ ప్రాంతం లో నివాసం ఉంటున్న ఎస్టీ తెగకు చెందిన పిటిషనర్లను చట్ట వ్యతిరేకంగా ఖాళీ చేయిస్తున్నారని న్యాయవాది రాజ్‌కుమార్ వాదించారు. గ్రామ సభ నిర్వహించాక, అటవీ నివాస గుర్తింపు చట్ట నిబంధనల ప్రకారం అటవీ ప్రాంతంలో ఉండే వారిని గుర్తించాలని, దానిని జిల్లా/రాష్ట్ర కమిటీలకు పంపిన తర్వాత చట్ట పరిధిలోకి రాని వారికి నోటీసులిచ్చి అటవీ ప్రాంతం నుంచి తరలించాలని చెప్పారు. చట్ట పరిధిలోనే చర్యలు తీసుకుంటున్నామ ని ప్రభుత్వ న్యాయవాది నరేంద్రరెడ్డి చెప్పారు. వాదనలు విన్న న్యాయ మూర్తి.. ప్రతివాదులైన అటవీ, పంచాయతీరాజ్, హోం శాఖలకు నోటీసులు జారీ చేశారు. విచారణను వచ్చే నెల 17కి వాయిదా వేశారు. -
విష జ్వరంతో చిన్నారి మృతి
కాటారం (కరీంనగర్ జిల్లా) : విష జ్వరంతో ఓ ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కాటారం మండలం గంగారం గ్రామంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గంగారం గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి, అశ్విని దంపతులకు శ్రీకృతి(5) సంతానం. కాగా చిన్నారి గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో గురువారం తల్లిదండ్రులు చిన్నారిని మెరుగైన వైద్యం కోసం వరంగల్ తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందింది. కన్నబిడ్డ కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
ప్రధాని మోదీని తీసుకొస్తా: ఎంపీ పొంగులేటి
* దత్తత గ్రామం గంగారంలో ఎంపీ పొంగులేటి సతుపల్లి: దేశంలోనే అత్యంత ఆదర్శ గ్రామంగా గంగారంను తీర్చిదిద్దుతానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం జీపీలో శుక్రవారం రాత్రి దత్తత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానిమోదీని గంగారం తీసుకొస్తానన్నారు. గ్రామంలో తాగునీరు, డ్రెయినేజీలు, రోడ్లు, పచ్చదనం తదితర కార్యక్రమాలపై జిల్లా యం త్రాంగం దృష్టి సారిస్తుందన్నారు. గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలన్నారు.