విష జ్వరంతో చిన్నారి మృతి
కాటారం (కరీంనగర్ జిల్లా) : విష జ్వరంతో ఓ ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కాటారం మండలం గంగారం గ్రామంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గంగారం గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి, అశ్విని దంపతులకు శ్రీకృతి(5) సంతానం. కాగా చిన్నారి గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో గురువారం తల్లిదండ్రులు చిన్నారిని మెరుగైన వైద్యం కోసం వరంగల్ తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందింది. కన్నబిడ్డ కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.