ప్రధాని మోదీని తీసుకొస్తా: ఎంపీ పొంగులేటి
* దత్తత గ్రామం గంగారంలో ఎంపీ పొంగులేటి
సతుపల్లి: దేశంలోనే అత్యంత ఆదర్శ గ్రామంగా గంగారంను తీర్చిదిద్దుతానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం జీపీలో శుక్రవారం రాత్రి దత్తత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానిమోదీని గంగారం తీసుకొస్తానన్నారు.
గ్రామంలో తాగునీరు, డ్రెయినేజీలు, రోడ్లు, పచ్చదనం తదితర కార్యక్రమాలపై జిల్లా యం త్రాంగం దృష్టి సారిస్తుందన్నారు. గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలన్నారు.