ganjai issue
-
పోలీసు వ్యవస్థపై రాజకీయ విమర్శలు చేయడం తగదు: డీజీపీ గౌతమ్ సవాంగ్
సాక్షి, రాజమండ్రి(తూర్పుగోదావరి): పోలీసు వ్యవస్థపై రాజకీయ విమర్శలు చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో రాజమండ్రిలో మాదక ద్రవ్యాల నియంత్రణపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. ఏపీలో మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని స్పష్టం చేశారు. అదే విధంగా.. గంజాయి సాగు, రవాణాను అరికట్టేందుకు ఎన్ఐఎ సహకారం కూడా తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. చదవండి: Shocking Video: స్విమ్మర్‌పై మొసలి భయంకర దాడి.. -
వరంగల్ నిట్‌లో గంజాయి.. అసలు నిజం!
సాక్షి, వరంగల్ : జిల్లా కేంద్రంలోని నిట్ క్యాంపస్‌లో గంజాయి సేవిస్తూ ఫస్టియర్ విద్యార్థులు పట్టుబడ్డారని మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో వర్సిటీ రిజిస్ట్రార్ స్పష్టతనిచ్చారు. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ ఎస్. గోవర్థన్ రావు మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుబడిన విషయాన్ని నిర్ధారిస్తూనే ఈ సంఘటన అక్టోబర్ 27వ తేదీ రాత్రిపూట జరిగిందని తెలిపారు. ఆ రోజు సెక్యూరిటీ సిబ్బంది రొటీన్ చెకప్‌లో భాగంగా తనిఖీ చేస్తున్నప్పుడు 1.8కె హాస్టల్ గదిలో మొదటి సంవత్సరం చదువుతున్న 12 మంది విద్యార్ధులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారని పేర్కొన్నారు. అయితే మీడియాలో వచ్చినట్టుగా వారివద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకోలేదని వెల్లడించారు. తక్కువ మోతాదులో మొదటిసారి వారు గంజాయి వాడారని విచారణలో తేలిందని తెలియజేశారు. ఈ విషయంపై క్రమశిక్షణా కమిటీ వేసామని, ఆ కమిటీ ముందు విద్యార్థులు తమ తప్పు ఒప్పుకున్నారని వివరించారు. వీరిపై చర్య తీసుకునే విషయంలో త్వరలో తుది నిర్ణయం వెలువడుతుందని ఆ ప్రకటనలో తెలిపారు. -
గంజాయి ఘాటు..
సాక్షి, వరంగల్ రూరల్ : వ్యవసాయాధారిత పేరొందిన జిల్లాకు గంజాయి మహ్మమ్మారి సోకింది. యథేచ్ఛగా సాగు చేస్తున్నా సంబంధిత అధికారులు దృష్టి సారించకపోవడం విడ్డూరం. గంజాయి మత్తెక్కిస్తూ జీవితాలను బలి తీసుకుంటోంది. ప్రమాదకరమైన మత్తు యథేచ్ఛగా చేతులు మారుతోంది. క్షణాల్లో జీవితాలను పీల్చి పిప్పి చేసే మహమ్మారి నిషామత్తులో చదువుకున్నవారు, చదువులేని వారు బలవుతున్నారు. గుప్పుమంటున్న గంజాయి మత్తుకు నేటి యువత చిత్తవడం ఆందోళన కలిగించిన అంశం. గ్రామీణ జిల్లాగా పేరొందిన రూరల్‌లో ఎక్కువగా మిర్చి, పసుపు పంటలు సాగు చేస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు దళారులు మిర్చి పంటల్లో గంజాయి సాగు చేస్తున్నారు. మిర్చి పంటల్లో సాగు చేస్తూ ఇటీవల పట్టుబడిన సంఘటనలు కోకొల్లలు. యథేచ్ఛగా సాగుతున్న ఈ మత్తు దందాకు అడ్డుకట్ట వేయడంలో పోలీసులు, ఇతర అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది విమర్శలు వెల్లువెత్తున్నాయి. శీతాకాలం ముగిసిపోయి వేసవికాలం సమీపిస్తున్నందున ఇలాంటి సమయంలోనే గంజాయి పంట చేతికొచ్చి చేతులు మారుతుంది. అంతర పంటగా.. గంజాయిపై నిషేదం ఉండడంతో ఏజెంట్లు రోడ్ హైవే మార్గాలకు సమీపంలోని గ్రామాల్లో సాగు చేయిస్తున్నారు. గంజాయి బయటకు కనిపించకుండా ఉండేందుకు ముందుగా మిర్చి వంటి పంటలు వేస్తున్నారు. మిర్చి విత్తనాలు మొలకెత్తి కనీసం అడుగు ఎత్తు పెరిగే వరకు చూసి ఆ తర్వాత అంతర పంటగా గంజాయి సాగును మొదలు పెడుతున్నారు. బయటకు మిర్చి పంట తరహాలో కనిపించినా లోపల గంజాయి మొక్కలు ఉంటాయి. మిర్చి కన్నా గంజాయి మొక్క ఎక్కువ ఎత్తు పెరుగుతుంది. మొక్క ఎదిగే క్రమంలో మధ్యకు చీల్చుతున్నారు. దీంతో మొక్క ఎదుగుదల పైకి కనబడకుండా వాటికి సమాతరంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎవరూ గంజాయి సాగును గుర్తుపట్టని పరిస్థితి ఉండడంతో సాగుదారులకు వరంగా మారుతోంది. పట్టుబడుతున్న గంజాయి.. పోలీసుల నిఘ ఉన్నప్పటికి జిల్లాలో గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. బైక్‌లో నాలుగు కేజీల గంజాయి పెట్టుకుని జనవరి 29న సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనవరి 13న 1 కిలో గంజాయి బైక్‌లో పెట్టుకుని సరఫరా చేస్తున్న వ్యక్తిని, గత సంవత్సరం డిసెంబర్ 27న ఆటోలో నాలుగు కిలోల గంజాయిని సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇలా గత సంవత్సరం గంజాయి విక్రయాల కేసులు 14 నమోదయ్యాయి. గంజాయిని వరంగల్ రూరల్ జిల్లాలో అక్కడక్కడ సాగు చేస్తున్నారు. జనవరి 22న నర్సంపేట మండలంలోని దాసరిపల్లిలో 1.15ఎకరాల్లో మిర్చిలో అంతర పంటగా గంజాయిని సాగు చేశారు. దీనిలో రూ.10 లక్షలు విలువ చేసే 220 మొక్కలు గంజాయి మొక్కలను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. సాగు చేస్తున్న యజమాని ఇంట్లో 12 కిలోల ఎండు గంజాయి సైతం లభ్యమైంది. గతంలో ఇక్కడ సాగు చేసి ఇతర ప్రాంతాలకు విక్రయించేందుకు పంపించేవారు. గత కొంత కాలం జిల్లాలోనే సాగు చేస్తూ ఇక్కడే విక్రయిస్తున్నారని తెలుస్తోంది. మూడు దమ్ములు.. ఆరు కిక్కులు గంజాయి దందా జిల్లాలో మూడు దమ్ములు.. ఆరు కిక్కులుగా సాగుతోంది. యువతనే టార్గెట్ చేసుకుని విక్రయాలు సాగిస్తున్నారు. ఎడ్యుకేషనల్ హబ్‌గా ఉన్న జిల్లాకు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి తమ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. చిన్న చిన్న పాన్ డబ్బాలు, బేకరీలు, బస్టాండ్, రైల్వే స్టేషన్లు, కళాశాలకు సమీపాల్లో విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో విక్రయదారులే సిగరేట్లలో గంజాయిని నింపుకుని తీసువచ్చి విక్రయిస్తున్నారు ప్యాకెట్ల రూపంలో సైతం విక్రయాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. ఒక్కో సిగరేట్ రూ 50లకు, ప్యాకెట్ అయితే రూ.100 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారని సమాచారం. నగరంలోని అండర్‌బ్రిడ్జి సమీపంలోని ఓ కాలనీకి చెందిన వ్యక్తి గత కొన్ని రోజులు గంజాయిని విక్రయిస్తూ తాగుతూ దానికి బానిసై ఇటీవల ఆనారోగ్యం భారిన పడి మరణించాడు. దీంతో ఆ కాలనీలో గంజాయి విక్రయించవద్దని తీర్మాణం చేశారని సమాచారం. అడ్డాలు ఇవే.. రూరల్ జిల్లాకు వరంగల్ నగరం దగ్గర ఉండడంతో ప్రధానంగా వరంగల్ ప్రాంతంలో ఉర్సు గుట్ట, ఎస్ఆర్ఆర్ తోట, పెరుకవాడ, శాంతినగర్, లేబర్ కాలనీలోని ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగంణంలో, బొల్లికుంట, ఆటోనగర్ కాలువ, హన్మకొండ ప్రాంతంలో దర్గా రోడ్, పబ్లిక గార్డెన్, యూనివర్సిటీ ప్రాంతం, హంటర్ రోడ్లలో ఎక్కువగా యువత అడ్డాలుగా ఉండి తాగుతున్నారని సమాచారం. మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లేబర్ కాలనీ ఈఎస్ఐ ఆస్పత్రి ప్రాంగణంలో ఖాళీ క్వార్టర్లు ఉండడంతో అందులో యువత అడ్డాగా చేసుకుని గంజాయి తాగుతున్నారని తెలిసింది. గంజాయి మహమ్మారి నుంచి యువతను, పెద్దలను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ప్రత్యేక నిఘా పెట్టాం.. గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో తనిఖీలు విస్తృతంగా చేస్తున్నాం. గంజాయి విక్రయాలు చేసిన వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. – వెంకట్‌రెడ్డి, డీసీపీ -
కాలేజీల్లో గంజాయి గుప్పు
సాక్షి, హైదరాబాద్: ఇన్నాళ్లూ గుట్టుగా గుప్పుమన్న గంజాయి ఇప్పుడు క్యాంపస్‌లోకి చొరబడింది! ఇంటర్మీడియట్ ఆ పైస్థాయి విద్యార్థులను మత్తులో ముంచెత్తుతోంది. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో జోరుగా గంజాయి మాఫియా దందా సాగిస్తోంది. గంజాయి దమ్ము కొడుతున్న ప్రతి వంద మందిలో 70 మంది విద్యార్థులే. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంటులోని ఓ విభాగం రాష్ట్ర రాజధానిలో గంజాయి వినియోగంపై నిర్వహించిన సర్వేలో వెల్లడైన చేదు వాస్తవాలివీ!! గంజాయి మత్తుకు అలవాటు పడుతున్న విద్యార్థులు క్రమంగా డ్రగ్స్ వైపు మళ్లుతున్నారని ఈ సర్వేలో తేలింది. గంజాయి వాడుతున్న ప్రతి వంద మందిలో 70 మంది విద్యార్థులు, 10 మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, మిగిలిన వారిలో ఆటో రిక్షా, భవన నిర్మాణ కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 150 కిలోల గంజాయి వినియోగం జరుగుతున్నట్టు అంచ నాకు వచ్చారు. శివారుల్లోని 6 ఇంజనీరింగ్ కాలేజీల్లో దీని వినియోగం భారీగా ఉందని సర్వేలో స్పష్టమైంది. హోటల్ మేనేజ్మెంట్ కాలేజీల్లోనూ గంజాయి గుప్పుమంటున్నట్టు వెల్లడైం ది. నగరానికి వస్తున్న నైజీరియా లాంటి ఆఫ్రికన్ దేశాల విద్యార్థుల నుంచి ఈ అలవాటు క్రమంగా తెలుగు విద్యార్థులకు పాకుతోందని ఎక్సైజ్ శాఖ ఆందోళన చెందుతోంది. మార్కెట్లోకి వోసీబీ పేపర్లు గతంలో సిగరెట్లో పొగాకు తీసేసి ఖాళీ గొట్టంలో గంజాయి పొడి నింపి పీల్చేవాళ్లు. అయితే ఇది ఆలస్యం కావటం, పొగాకు బయటకు తీసే క్రమంలో పక్కవాళ్లు పసిగట్టే అవకాశం ఉండటంతో జాయింట్ కాగితం ముక్కలు వచ్చాయి. ఇవి వోసీబీ స్లిప్ పేరుతో మార్కెట్లోకి వచ్చాయి. విద్యార్థులు వీటిని ‘జాయింట్’అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ స్లిప్స్‌లో గంజాయిని చుట్ట చుట్టి సిగరెట్ తరహాలోనే కాల్చి దమ్ము కొడుతున్నారు. కాలేజీల చుట్టూ ఉన్న పాన్‌షాపు, పుస్తకాల దుకాణాల్లో ఈ స్లిప్స్ దొరుకుతున్నాయి. వీటిని కేవలం గంజాయి పీల్చడానికే తయారు చేశారని ఎక్సైజ్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. 10 గ్రాముల గంజాయి రూ.300 నుంచి రూ.700 వరకు విక్రయిస్తున్నారు. డీలర్లు.. కొరియర్ వ్యవస్థ గంజాయి దందాకు నగరంలో మన్మోహన్సింగ్, అంగూరీభాయి, శివాచారి, ధరణ్ సింగ్‌తోపాటు మరో 6 మంది పెద్ద డీలర్లు ఉన్నట్లు తేలింది. వీరు విశాఖపట్నం, నారాయణఖేడ్, అదిలాబాద్ నుంచి గంజాయి తెప్పిస్తున్నారు. ఒక్కో డీలర్ వద్ద 15 నుంచి 20 మంది వర్కర్లు పని చేస్తున్నారని, వీళ్లందరికీ స్థాయిని బట్టి కొందరికి నెల జీతం, మరి కొందరికి విక్రయాలపై కమీషన్ ఇస్తున్నట్లు సర్వే తేల్చింది. మెయిన్ డీలర్లు సేలింగ్ పాయింట్‌కు గంజాయి సరఫరా చేస్తున్నారు. ధూల్‌పేటలో 20, శంషాబాద్, ఆరాంఘర్, అత్తాపూర్‌లలో 12, లంగర్‌హౌస్, టోలీచౌకీ, గోల్కొండ, నానల్ నగర్లలో 8, గచ్చిబౌలి, మాదాపూర్, నానక్‌రాంగూడలో 6, ఫతేనగర్, బాలానగర్‌లో 5 మంగల్‌హాట్‌లో 2, సీతాఫల్మండిలో 4, కొంపల్లిలో 4, నాగోల్‌లో 4, ఇబ్రహీంపట్నంలో 6 చొప్పున గంజాయి విక్రయ స్థావరాలు ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. -
గంజాయిని అరికట్టేందుకు చర్యలు
ఏలూరు రేంజ్ డీఐజీ రామకృష్ణ రాజమహేంద్రవరం క్రైం : జిల్లాలో గంజాయి సాగు, రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టామని ఏలూర్ రేంజ్ డీఐజీ పీవీఎస్ రామకృష్ణ అన్నారు. రాజమహేంద్రవరంలోని పోలీస్ అర్బ¯ŒS జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలోని స్పెషల్ బ్రాంచ్ కార్యాలయం, డీఎస్‌ఆర్‌బీ కార్యాలయాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో జరుగుతున్న గంజాయి సాగు, రవాణాను అరికట్టేందుకు అన్ని శాఖల సమన్వయంతో కృషి చేస్తున్నామని అన్నారు. శాటిలైట్ సిస్టం ద్వారా గంజాయి సాగును గుర్తించేందుకు చర్యలు జిల్లాలోని ఏజన్సీ ప్రాంతాల్లో నక్సల్స్ కదలికలు ఉన్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో వారి ప్రభావం లేదన్నారు. కార్యక్రమంలో అర్బ¯ŒS ఎస్పీ బి.రాజ కుమారి, అడ్మి¯ŒS ఎస్పీ రజనీకాంత్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, వి.రామకృష్ణ, డీఎస్‌ఆర్‌బీ ఇ¯ŒSచార్జి డీఎస్పీ డి. శ్రీనివాసరెడ్డి, ట్రాఫిక్ సీఐ చింతా సూరిబాబు, ఎస్సైలు సంపత్, రామ్మోహనరావు, సత్యనారాయణ, ఎస్బీ ఎస్సై మల్లేశ్వరరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
గంజాయి వ్యవహారంలో వీఆర్‌కు సీఐ?
ఉన్నతాధికారుల అదుపులో కానిస్టేబుల్? మారేడుమిల్లి : గంజాయి అక్రమ రవాణాకు సహకరించినందుకు మారేడుమిల్లి సీఐను వీఆర్‌కు పంపినట్లు సమాచారం. అలాగే ఓ కానిస్టేబుల్‌ను కూడా ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఏజెన్సీలో గంజాయి అక్రమ రవాణా వ్యవహారంలో ఇటీవల పోలీసుల పాత్ర కూడా కీలకంగా ఉందని, స్మగర్లకు పోలీసులు సహకరిస్తున్నారనే అనుమానాల నేపథ్యంలో ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు, అధికారులు లోతుగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే స్థానిక స్టేష¯ŒSకు చెందిన సీఐను వీఆర్‌కు పంపి, ఓ కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు ఆదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఇంకా కొందరి వ్యక్తుల ప్రమేయం ఉందని, ఈ మేరకు పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతా«ధికారులు ఎవరూ పూర్తిగా ధ్రువీకరించలేదు. గతంలో కూడా గంజాయి కేసులో ఇదే స్టేష¯ŒSకు చెందిన ఓ సీఐని కూడా వీఆర్‌కు పంపడం గమనార్హం -
స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులకు జోహార్లు
ఎస్సై నిరంజన్ రావుకు సాహస అవార్డుకు రిఫర్ చేస్తాం మృతి చెందిన కానిస్టేబుళ్ల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు l రాజమహేంద్రవరం క్రైం: ప్రాణాలకు తెగించి ఎక్సైజ్ పోలీసులు గంజాయి స్మగ్లర్లును పట్టుకున్నారని, ఈ సంఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందగా, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రావు తీవ్రగాయాల పాలయ్యారని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కె. వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గంజాయి నిందితులను పట్టుకునే సంఘటనలో గురువారం గాయాల పాలై మృతి చెందిన కానిస్టేబుళ్ల కుటుంబాలను పరామర్శించడానికి జిల్లాకు విచ్చేసిన ఆయన రాజమహేంద్రవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గంజాయి స్మగ్లింగ్ జిల్లాలో ప్రమాదకర స్థాయిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో 10 వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతోందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా తదితర ఎనిమిది రాష్ట్రాల నుంచి వివిధ వాహనాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్యాంకర్లు, లారీలు, కార్లలో గంజాయిని తరలిస్తున్నారని ఆయన తెలిపారు. వారిని పట్టుకోడానికి వెళ్ళే ఎక్సైజ్ సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. 2016 లో 70 కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ మురళీ కృష్ణ ఆగస్టు 19 వ తేదీన 700 కేజీల గంజాయిని పట్టుకునేందుకు సహకరించాడని తెలిపారు. ప్రత్తిపాడు మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గంజాయి స్మగ్లర్ పోలీసులను గాయపరిచి తప్పించుకునే క్రమంలో కారును స్టీరింగ్ తిప్పి తిరగబెట్టాడని అన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలకు తెగించి స్మగ్లర్లను పట్టుకున్న పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని సౌకర్యలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఎస్సై నిరంజన్ రావుకు సాహస అవార్డు ఇచ్చేందుకు కృషి చేస్తామని, అలాగే విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నక్సల్స్ డ్యూటీ నిర్వహించే పోలీస్ కానిస్టేబుల్స్ ప్రమాదంలో మృతి చెందితే రూ. 5 లక్షలు ఇస్తారని, ఎక్సైజ్ శాఖలో రూ. 50 వేలు మాత్రమే ఇస్తారని ఆయన అన్నారు. ఎక్సైజ్ శాఖ సిబ్బంది విధులు కూడా ప్రమాదభరితమైనదేనని వారికి కూడా పోలీస్ శాఖకు ఇచ్చే సౌకర్యలు కల్పించేందు చర్యలు చేపడతామని అన్నారు. గిరిజనులకు అవగాహన కల్పించి గంజాయి నిర్మూలనకు కృషి చేస్తామన్నారు. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ కమిషనర్ ఎం. సత్యనారాయణ, కాకినాడ అసిస్టెంట్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, రాజమహేంద్రవరం ఎక్సైజ్ సూపరింటెంటెండ్ ఎన్. సుర్జిత్ సింగ్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎస్. లక్ష్మీ కాంత్ తదితరులు పాల్గొన్నారు.