
సాక్షి, రాజమండ్రి(తూర్పుగోదావరి): పోలీసు వ్యవస్థపై రాజకీయ విమర్శలు చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో రాజమండ్రిలో మాదక ద్రవ్యాల నియంత్రణపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. ఏపీలో మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని స్పష్టం చేశారు. అదే విధంగా.. గంజాయి సాగు, రవాణాను అరికట్టేందుకు ఎన్‌ఐఎ సహకారం కూడా తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment