
ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆందోళనలు జరుపుతున్నారు. చంద్రబాబు, పట్టాభి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, అమరావతి: ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆందోళనలు జరుపుతున్నారు. చంద్రబాబు, పట్టాభి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. విజయవాడ సితార సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలో వైఎస్సార్‌సీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నెల్లూరు జిల్లా వింజమూరులో ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
వైఎస్సార్ జిల్లా: కడప అంబేద్కర్ కూడలిలో వైఎస్సార్‌సీపీ ఆందోళన జరిపింది. పులివెందులలో వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలను వైఎస్సార్‌సీపీ దగ్ధం చేసింది.
అనంతపురం: బుక్కరాయ సముద్రంలో టీడీపీ దిష్టిబొమ్మ దహనం చేశారు. పట్టాభి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన తెలిపారు.