నారా లోకేష్‌ ఆధ్వర్యంలోనే ఫేక్‌ పోస్టులు: అంబటి రాంబాబు | Ysrcp Leader Ambati Rambabu Comments On Tdp Social Media Posts | Sakshi
Sakshi News home page

నారా లోకేష్‌ ఆధ్వర్యంలోనే ఫేక్‌ పోస్టులు: అంబటి రాంబాబు

Published Fri, Dec 6 2024 12:42 PM | Last Updated on Fri, Dec 6 2024 3:04 PM

Ysrcp Leader Ambati Rambabu Comments On Tdp Social Media Posts

సాక్షి,గుంటూరు: కూటమి ప్రభుత్వ పెద్దలపై మాజీ మంత్రి,వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఫైరయ్యారు. కూటమి నేతల ఆధ్వర్యంలో సోషల్‌‌మీడియాలో వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.శుక్రవారం(డిసెంబర్‌ 6)పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌ వద్ద అంబటి మీడియాతో మాట్లాడారు.‘టీడీపీ సోషల్‌మీడియాపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. లేదంటే కోర్టులను ఆశ్రయిస్తాం’అని అంబటి హెచ్చరించారు. 

అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే.. 

  • ఇవాళ గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో రెండు ఫిర్యాదులిచ్చాం
  • నామీద, మా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ గారి  మీద టీడీపీ అఫీషియల్‌ ట్విట్టర్ ఖాతా ద్వారా అసభ్యకర పోస్టులు పెడుతున్నారు
  • జై టీడీపీ అనే ట్విట్టర్ పేజీలో వైఎస్‌ జగన్‌ గారి మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెడుతున్నారు
  • మా నాయకుడిని అవమానించే విధంగా పోస్టులు పెడుతున్నారు
  • సీమరాజు అనే వ్యక్తి మా వైఎస్సార్‌సీపీ కండువా వేసుకొని మమ్ములను పచ్చి బూతులు తిడుతున్నారు
  • ఈ పోస్టింగులపై యాక్షన్ తీసుకోవాలని ఫిర్యాదు చేశాం.
  • ఈ పోస్టులతో మా మనోభావాలు దెబ్బతింటున్నాయి
  • డీజీపీ నుంచి ఎస్ఐ వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై అక్రమ కేసులు పెడుతున్నారు
  • సీమరాజు ఇకనైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి
  • నారా లోకేష్ సృష్టించిన రోబో సీమరాజు
  • నారా లోకేష్ ఆధ్వర్యంలోనే సీమరాజు ఇండస్ట్రీ మాదిరిగా స్టూడియో పెట్టుకొని సోషల్ మీడియాలో వైఎస్సార్‌సీపీపై రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారు
  • వైఎస్ జగన్ గారు వారి సతీమణి భారతి గారి మీద  కూడా అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు
  • తక్షణమే పోలీసులు సీమరాజు మీద యాక్షన్ తీసుకోకుంటే కోర్టుకు వెళ్తాం
  • 14 రోజుల అనంతరం ప్రైవేట్ కేసులు వేస్తాం
  • హైకోర్టు, అక్కడ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం
  • భయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు
  • చట్ట ప్రకారం వ్యవహరించాలని డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నాం
  • చట్టాలు వాటి పని అవి చేసుకునే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది
  • గత నెల 18, 19 తేదీలలో గుంటూరు నగరంలోని అనేక పోలీస్ స్టేషన్‌లలో సోషల్ మీడియా పోస్టులపై ఫిర్యాదులు చేశాం
  • ఇంతవరకు కేసులు నమోదు చేయలేదు.. మాకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది
  •  న్యాయం జరిగే వరకూ చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం
     


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement