Garlands
-
మల్లెపూలు అనుకుంటున్నారా..కాదండోయ్!
న్యూఢిల్లీ: అమ్మాయిలకు పువ్వులకు విడదీయలేని బంధం ఉందని అంటారు. అందుకే వారిని పువ్వులతో పోలుస్తారు. ఒక తల్లి తన కూతురు సురేఖ పిళ్ళైకి ఏదైన సర్ప్రైజ్ చేయాలనుకుంది. వెంటనే ఒక టిష్యూపేపర్ తీసుకొని దానితో ఒక మల్లెపుల బొకే తయారుచేసి చేతిలో పెట్టేసింది. దీన్ని మొదట నిజమైన మల్లెపూల బొకేగా భావించిన సురేఖ..తర్వాత పరీక్షగా చూసి షాక్ కు గురయ్యింది. అంతేకాకుండా, కుర్తాసేట్, వెండిరింగులు, బింది మొదలైనవి తయారు చేసి ఇచ్చింది. దీంతో ఆనందంతో ఉబ్బితబ్బిపోయిన సురేఖ తల్లి అధ్బుతమైన కళను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. నెటిజన్లు మొదట సురేఖలాగే మోసపోయి, తీరా అది టిష్యూపేపర్తో తయారు చేసినవని తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడిది తెగవైరల్ అయ్యింది. మీ అమ్మాగారి కళకు ఫిదా అవ్వాల్సిందే అని కామెంట్లు పెడుతున్నారు. my mom made this for me (from tissue paper) ❤️ pic.twitter.com/eISioFAmnM — Surekha (@surekhapillai) February 22, 2021 -
హంతకులకు కేంద్ర మంత్రి సన్మానం!
హజారీబాగ్: కేంద్ర మంత్రి జయంత్ సిన్హా వివాదంలో చిక్కుకున్నారు. గతేడాది ఓ మాంస వ్యాపారిని కొట్టి చంపిన కేసులో జైలు నుంచి విడుదలైన నిందితులకు శుక్రవారం ఆయన పూల మాలలు వేసి సన్మానించారు. ప్రతిపక్షాలు మంత్రి చర్యను ఖండించాయి. నిందితులకు మిఠాయిలు తినిపించిన జయంత్ సిన్హా..న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచాలని, తప్పకుండా న్యాయం జరుగుతుందని వారికి భరోసా ఇచ్చారు. తన నియోజకవర్గానికి చెందిన వారంతా విడుదలవడం ఎంతో సంతోషంగా ఉందని, వారికి న్యాయం జరిగేలా చూడటం తన బాధ్యత అని పేర్కొన్నారు. తమకు లాయర్ను ఏర్పాటుచేసిన మంత్రికి 8 మంది నిందితులు ధన్యవాదాలు తెలిపారు. విద్వేషపూరిత, విభజన రాజకీయాలు సమాజాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. జయంత్ సిన్హా తీరు హేయమైనదని జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బెయిల్పై నిందితులు.. మంత్రి ఘన స్వాగతం
రాంచీ : ఓ వైపు కేంద్రం నకిలీ వార్తలు, వదంతుల వల్ల దేశంలో పెరిగిపోతున్న హింసను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంటే... మరోవైపు స్వయంగా అధికార పార్టీ నేతలే హింసాత్మక చర్యలకు పాల్పడిన వారికి ఘనస్వాగతం పలకడం వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటన జార్ఖండ్లో చోటు చేసుకుంది. గో మాంసం అమ్ముతున్నాడనే నెపంతో ఓ ముస్లిం వ్యక్తిని చంపి జైలుకెళ్లి, ఆపై బెయిల్పై వచ్చిన వారికి పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి జయంత్ సిన్హా. ఆ వివరాలిలా.. గో మాంసం అమ్ముతున్నాడనే నేపంతో గతేడాది జూన్ 29న జార్ఖండ్ రాంఘడ్కు చెందిన అలిముద్దిన్ అన్సారీ(40) అనే వ్యక్తిపై 12 మంది దాడి చేశారు. ఈ దాడిలో అన్సారీని తీవ్రంగా కొట్టడంతో అతను అక్కిడిక్కడే మృతి చెందాడు. ఈ దాడిలో పాల్గొన్న వారిలో 11 మందికి ఫాస్ట్ట్రాక్ కోర్టు మరణశిక్ష విధించింది. మరొకరు మైనర్ కావడంతో అతన్ని జువైనల్ హోంకు తరలించింది. శిక్ష పడిన వారిలో స్థానిక బీజేపీ నాయకుడు కూడా ఉన్నారు. అయితే కోర్టు తీర్పును జయంత్ సిన్హా వ్యతిరేకించారు. కేసును మరోసారి సమీక్షించాలని, సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ హైకోర్టు వీరిలో 8 మందికి బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా సిన్హా తన ఇంటి వద్ద వీరికోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బెయిల్ మీద వచ్చిన వారికి స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలకడమే కాక వారిని పూల మాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ ఎమ్మేల్యే శంకర్ చౌదరీ ‘మీ ఎనిమిది మంది తరుపున వాదించి, మీకు బెయిల్ వచ్చేలా చేసిన అడ్వకేట్ బీబీ త్రిపాథికి మీరు కృతజ్ఞతలు తెలపాలి. అతను మీ పాలిట దేవుడు’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు మీడియాలో ప్రసారం కావడంతో ప్రతిపక్ష పార్టీలు బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉండగా జయంత్ సిన్హా ఎన్నికైంది కూడా రాంఘడ్ నియోజక వర్గం నుంచే కావడం గమనార్హం. -
అకటా.. పూలకు కటకట!
ఎన్నికల సీజన్లో అన్నిటితో పాటు పూలకూ డిమాండ్ విపరీతంగా పెరిగింది. పూలు, పూల దండలు, బొకేల ధరలు చుక్కలనంటుతున్నాయి. మార్కెట్లోకి వస్తున్న పూలన్నీ ఎన్నికల ప్రచారం కోసం అమ్ముడవుతుండగా.. గుళ్లల్లో, దర్గాల్లో పూజలకు, ప్రార్థనలకు అవసరమైన పూలు, పూల దండలు లభించక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గురువారాల్లో దర్గాల్లో, సాయిబాబా దేవాలయాల్లో పుష్పాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దేవాలయాలకు ప్రసిద్ధి గాంచిన వారణాసి తదితర పట్టణాల్లో ప్రస్తుతం పూలకున్న డిమాండ్ అంతాఇంతా కాదు. మామూలు రోజుల్లో రూ. 5 ధర పలికే పూలు ప్రస్తుతం రూ. 50 పెట్టినా దొరకడం లేదు. వారణాసిలో బీజేపీ అభ్యర్ధిగా నరేంద్రమోడీ బరిలో ఉండటంతో అక్కడ పుష్పాలు హాట్ కేకులుగా మారాయి. ఎన్నికల ప్రచారంలో గులాబీ పూలకు, గులాబీ రేకులకు డిమాండ్ బాగా ఉందని పూల వ్యాపారస్తులు చెబుతున్నారు. యూపీలో గులాబీ రేకుల ధర కిలో రూ.200లకు చేరింది. అరేబియన్ జాస్మిన్కు కూడా మంచి డిమాండ్ ఉంది. కాస్త చౌకగా బంతిపూలు మాత్రమే లభిస్తున్నాయి.