Gas Cylinders Supply
-
KSR: ఏపీ మహిళలకు బాబు బిగ్ షాక్.. ఒక సిలిండర్ మాత్రమే..!
-
నాయకా.. న్యాయమా?.. రూ.500 సిలిండర్ వర్తింపేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడు నెలలు గడుస్తోంది.. కానీ.. రూ.500కు వంటగ్యాస్ అమలు మాత్రం పేద కుటుంబాలకు అందని ద్రాక్షగా మారింది. ఆరు గ్యారంటీలలో భాగంగా సిలిండర్‌పై సబ్సిడీ అందిస్తున్నా.. మెజార్టీ బీపీఎల్ కుటుంబాలకు వర్తించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. పేద కుటుంబాలు గృహాలక్ష్మి పథకానికి అర్హత సాధించినా.. మహాలక్ష్మి పథకం మాత్రం అందని దారక్షగా తయారైంది. లోక్‌సభ ఎన్నికల ముందు గ్యాస్ సబ్సిడీ వర్తింపు అమలు ప్రారంమైంది. ఆరు నెలల క్రితం నిర్వహించిన ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా బీపీఎల్ కుటుంబాలను గుర్తించారు. మిగతా పథకాల మాదిరి మహాలక్ష్మి పథకానికి కూడా తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. కానీ పథకం వర్తింపు మాత్రం కొందరికే వర్తింపజేయడంతో నిరుపేదల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ నిబంధనలపై పౌరసరఫరాల అధికారులతో పాటు ఆయిల్ కంపెనీలకు సైతం స్పష్టత కరువైంది.ఇది పరిస్థితి..గ్రేటర్ పరిధిలో గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు 30.18 లక్షలపైగా ఉండగా అందులో సుమారు 24.74 లక్షల కుటుంబాలు మహాలక్ష్మి పథకం కింద రూ. 500కు వంట గ్యాస్ సిలిండర్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో సుమారు 19.01 లక్షల కుటుంబాలు మాత్రమే తెల్లరేషన్ కార్డులు కలిగి ఉన్నాయి. దరఖాస్తుదారుల్లో కేవలం 10 శాతం కుటుంబాలకు కూడా సబ్సిడీ వర్తించకపోవడం గమనార్హం.నగదు జమ రూ.40.71గృహోపయోగ వంట గ్యాస్ వినియోగదారులుకు బ్యాంక్ ఖాతాలో నగదు బదిలీ పథకం కింద సబ్సిడీ రూ. 40.71 మాత్రమే జమ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరతో నిమిత్తం లేకుండా వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో పరిమితంగా నగదు జమ చేస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ప్రకారం 14.5 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.855. పలుకుతోంది. గృహ వినియోగదారులందరూ సిలిండర్ ధరను పూర్తిగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థల ద్వారా సబ్సిడీని నగదు బదిలీ కింద వినియోగదారుల ఖతాలో జమ చేస్తూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గత మూడు నెలలుగా ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా కొందరు లబ్ధిదారులకు మాత్రమే సిలిండర్ ధరలో రూ. 500 మినహాయించి మిగిలిన సొమ్మును నగదు బదిలీ ద్వారా వినియోగదారుల ఖాతాలో వేస్తోంది. -
Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా అమలు చేస్తున్న రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం కొందరికే పరిమితమైంది. తెల్లరేషన్ కార్డు కలిగి విద్యుత్ జీరో బిల్లుకు అర్హత సాధించినా.. వంటగ్యాస్ సబ్సిడీ మాత్రం వర్తించని పరిస్థితి నెలకొంది. దీంతో నిరుపేదలకు ఎప్పటి మాదిరిగా వంటగ్యాస్ ధర భారంగా తయారైంది. మూడు నెలల క్రితమే మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకం అమలు ప్రారంభమైంది. ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా బీపీఎల్ కుటుంబాలను అర్హులుగా గుర్తించి జీరో బిల్లు, వంటగ్యాస్ సబ్సిడీకి లబి్ధదారులుగా ఎంపిక చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు పథకాలకు కూడా తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. వాస్తవంగా మహా నగరంలో సుమారు 17.21 లక్షల కుటుంబాలు తెల్లరేషన్‌కార్డులు కలిగి ఉండగా అందులో సుమారు 11 లక్షల కుటుంబాలకు మాత్రమే విద్యుత్ జీరో బిల్లు వర్తించింది. రూ.500కు వంట గ్యాస్ మాత్రం అందులో కేవలం రెండు లక్షల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తోంది. గ్యారంటీ పథకాల కింద బీపీఎల్‌గా అర్హత సాధించినా సబ్సిడీ వర్తించకపోవడంతో పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.855కు సిలిండర్.. మహా నగరంలో బహిరంగ మార్కెట్ ప్రకారం‡ ప్రస్తుతం 14.5 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.855 పలుకుతోంది. గృహ వినియోగదారులు సిలిండర్ ధరను పూర్తిగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థల ద్వారా సబ్సిడీని నగదు బదిలీ కింద వినియోగదారుల ఖతాలో జమచేస్తూ వస్తోంది. తాజాగా ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా అర్హత సాధించిన వంట గ్యాస్ లబ్ధిదారులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సిలిండర్ ధరలో రూ.500 మినహాయించి మిగిలిన సొమ్మును నగదు బదిలీ ద్వారా వినియోగదారులు ఖాతాలో చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ అందరికి వర్తిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మాత్రం కొందరికే పరిమితమైంది. కేంద్రం సబ్సిడీ రూ. 40.71 మాత్రమేకేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సబ్సిడీని పరిమితం చేసింది. సిలిండర్ ధర ఎంత పలికినా.. సబ్సిడీ సొమ్ము మాత్రం రూ.40.71లు మాత్రమే వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తోంది. పదేళ్ల క్రితం వరకు సబ్సిడీపై రూ.414కు మాత్రమే వంట గ్యాస్ ధర సరఫరా జరిగేది. మిగతా ధరను కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే భరించేది. ఆ తర్వాత వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం వర్తింపుజేయడంతో బహిరంగ మార్కెట్ ధర ప్రకారం సిలిండర్ సరఫరా చేసి ఆ తర్వాత సబ్సిడీ నగదు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తూ వచ్చారు. 2015లో సిలిండర్‌ను మార్కెట్ ధర ప్రకారం రూ. 697కు కొనుగోలు చేస్తే సబ్సిడీగా రూ.239.65 నగదు బదిలీ ద్వారా వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేది. బహిరంగ మార్కెట్లో సిలిండర్ ధర పెరిగిన దానిని బట్టి సబ్సిడీ నగదు కూడా పెరిగేది. ఆ తర్వాత క్రమంగా సబ్సిడీ ఎత్తివేతలో భాగంగా పరిమితి విధించారు. ప్రస్తుతం ధర ఎంత ఉన్నా.. సబ్సిడీ మాత్రం ఒక స్లాబ్‌కు పరిమితమైంది.వంటగ్యాస్ కనెక్షన్లు ఇలా హైదరాబాద్ జిల్లా 13.22లక్షలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 15.96 లక్షలు -
నిత్యావసరాలనూ వదలట్లేదు!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరంలో ‘పగటి పూట’ నిత్యావసరాల రవాణాపై సైతం ఆంక్షలు తప్పడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు పగటి పూట నిత్యావసరాలైన వంట గ్యాస్, ఇంధనం సరఫరా చేసే భారీ వాహనాలను సైతం అడ్డుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. గత నెలలో ట్రాన్స్‌పోర్టు సమ్మె కొంత ప్రభావం చూపగా, తాజాగా పగటి పూట సిటీలో భారీ వాహనాలకు నో ఎంట్రీ అమలు చేస్తుండడంతో..ఇంధన ఉత్పత్తుల రవాణాపై తీవ్ర ప్రభావం పడుతోంది. రాత్రిపూట అనుమతి ఉన్నా..రవాణా మాత్రం అంతంతమాత్రంగా తయారైంది. ఏకంగా ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారులను కలిసి లోడ్ వాహనాల అడ్డిగింపును దృష్టికి తీసుకొని వెళ్లినా..ఫలితం లేకుండా పోయింది. ఆయిల్ కంపెనీల టెర్మినల్స్‌లో గ్యాస్, ఇంధనం నిల్వలు పుష్కలంగా ఉన్నా...రవాణా ఆంక్షలతో వచ్చిన సరుకు వచ్చినట్లే పంపిణీ జరుగుతుండటంతో గోదాములు వెలవెలబోతున్నాయి. రాత్రి పూట సరఫరాతో పెట్రోల్, డీజిల్ బంకుల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా... వంట గ్యాస్ పంపిణీ మాత్రం చుక్కలు చూపిస్తోంది. రీఫిల్ డిమాండ్ లక్షన్నరపైనే.. మహానగరంలో దినసరి వంట గ్యాస్ డిమాండ్ సుమారు లక్షన్నర ఎల్పీజీ సిలిండర్లపైనే ఉంటుంది. తాజా పరిస్థితులతో పంపిణీ మాత్రం అంతంత మాత్రంగా తయారైంది. మూడు ప్రధాన చమురు సంస్థలకు చెందిన 125 ఏజెన్సీల పరిధిలో గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు సుమారు 30 లక్షలపైనే ఉన్నాయి. మరో వైపు వాణిజ్య అవసరాలకు సైతం లక్షల వరకు సిలిండర్ల డిమాండ్ ఉంటుంది. పగటి పూట రవాణాపై అంక్షలు వంటగ్యాస్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎల్పీజీ లోడ్ వాహనాలను అనుమతించాలి సిటీలో పగటి పూట కూడా ఎల్పీజీ లోడ్ వాహనాలను అనుమతించాలి. భారీ వాహనాలకు నో ఎంట్రీ పేరుతో ఎల్పీజీ సిలిండర్ల లోడ్లను అడ్డుకోవడం తగదు. ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. శివార్లలోని టెర్మినల్స్ నుంచి నగరంలోకి వస్తున్న సిలిండర్ల లోడ్ వాహనాలను పోలీసులు అడుగడుగునా అడ్డుకుని నిలిపివేస్తున్నారు. రాత్రి పూట మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో వంట గ్యాస్ పంపిణీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తక్షణమే ఎల్పీజీ వాహనాలను మినహాయించాలి. – అశోక్ కుమార్, అధ్యక్షుడు, వంట గ్యాస్ డీలర్ల సంఘం, హైదరాబాద్ -
గ్యాస్ ధరపై సామాన్యులకు గుడ్ న్యూస్
-
గోనుగొప్పల వాగులో చిక్కుకున్న సిలిండర్ల లారీ
-
గ్యాస్ సబ్సిడీ అంతంతే!
నగరంలోని ఖైరతాబాద్‌కు చెందిన శ్రీనివాస్ ప్రతి రెండు నెలలకు ఒకసారి ఎల్పీజీ సిలిండర్‌ను ఆన్లైన్లో బుకింగ్ చేస్తున్నాడు. మూడు నాలుగు రోజుల వ్యవధిలో సిలిండర్ డోర్ డెలివరి కూడా జరుగుతోంది. వంటగ్యాస్‌కు నగదు బదిలీ పథకం అమలవుతుండడంతో మార్కెట్ ధర చెల్లిస్తూ వస్తున్నాడు. కానీ, సబ్సిడీ సొమ్ము మాత్రం బ్యాంక్ ఖాతాలో జమ కావడం లేదు. గత పది మాసాల కాలంలో ఐదు సిలిండర్లు తీసుకున్నా నయా పైసా ఖాతాలో పడలేదు. ఆలస్యంగా గుర్తించిన శ్రీనివాస్ డిస్ట్రిబ్యూటర్ దష్టికి తీసుకెళ్లాడు. ఆన్లైన్లో పరిశీలించి బ్యాంక్ లింకేజి కట్ అయిందని, తిరిగి పునరుద్ధరించుకోమని ఉచిత సలహా ఇచ్చారు. ఇదీ ఒక శ్రీనివాస్ సమస్య కాదు.. నగరంలో వేలాది మంది వంట గ్యాస్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్య. సాక్షి, సిటీబ్యూరో: వంట గ్యాస్ సబ్సిడీ సొమ్ము చుక్కలు చూపిస్తోంది. నగదు బదిలీ కింద సబ్సిడీ సొమ్ము బ్యాంక్ ఖాతాలో జమ సమస్యగా తయారైంది. వినియోగదారుడు మార్కెట్ ధర చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తున్నా.. సబ్సిడీ సొమ్ము నగదుగా వెనక్కి జమ అవుతుందన్న నమ్మకం లేకుండా పోయింది. కొందరు వినియోగదారులకు నెలల తరబడి అసలు నగదు జమ అంటూ లేకుండా పోతోంది. ముఖ్యంగా గ్యాస్ సబ్సిడీ కోసం తెరిచిన బ్యాంక్ ఖాతాల్లో సబ్సిడీ నగదు జమకు అనేక సమస్యలు ఆటంకంగా మారాయి. మరోవైపు ఎల్పీజీ సిలిండర్æ బుకింగ్ సమయాల్లో సైతం చిన్న చిన్న తప్పిదాలు బ్యాంక్ లింకేజి బంధంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా గ్యాస్ సబ్సిడీ నెలల తరబడి నిలిచిపోతోంది. గ్యాస్ సబ్సిడీ నగదు రూపంలో జమకు ఒక నిర్దిష్ట సమయం అంటూ లేక పోవడంతో వినియోగదారులు గుర్తించే సరికి నాలుగైదు సిలిండర్లు డోర్ డెలివరీ అవుతున్నాయి. ఆలస్యంగానైనా గుర్తించి డిస్ట్రిబ్యూటర్ దష్టికి తీసుకెళ్లితే సబ్సిడీ నగదు సొమ్ము జమ తమకు సంబంధం లేదంటూ చేతులేత్తుస్తూ ఒక ఉచిత సలహా పారేయడం సర్వసాధారణంగా తయారైంది. వాస్తవంగా పథకం అమలు ఆరంభంలో కొంత ఇబ్బందులు ఎదురైనా ఆ తర్వాత సక్రమంగానే బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ సొమ్ము జమ అవుతూ వచ్చింది. కానీ, తిరిగి పాత పరిస్థితి ఇప్పుడు పునరావృతం అవుతోంది. వినియోగంలో లేకుంటే అంతే.... వంట గ్యాస్ కనెక్షన్‌కు అనుసంధామైన బ్యాంక్ ఖాతా వినియోగంలో లేకుంటే సబ్బిడీ సొమ్ము వెనక్కి వెళ్తోంది. కొందరు వినియోగదారులు వంట గ్యాస్ సబ్సిడీ కోసం ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతాలు తెరిచి వాటిని అనుసంధానం చేయించారు. కేవలం ఆ ఖాతాలు సబ్సిడీ సొమ్ముకు పరిమితం కావడంతో కనీస నగదు లేక కొన్నిసార్లు ఇన్‌యాక్టివ్ అవుతుంటాయి. దీంతో బయట నుంచి వచ్చిన సొమ్ము ఖాతాలో జమ కావడానికి సాంకేతిక సమస్యలు తయారవుతున్నాయి. దీంతో గ్యాస్ సబ్సిడీ కాస్త ఆయిల్ కంపెనీలకు వెళ్లిపోతుంది. ఒక సారి సబ్సిడీ వెనక్కి వస్తే ఆ తర్వాత సబ్సిడీ విడుదల నిలిచిపోతుంది. బ్యాంక్ లింకేజి బంధం కూడా తెగిపోతుంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ బుకింగ్ సమయాల్లో సైతం పొరపాటున గ్యాస్ సబ్సిడీ వదులుకునే ఆప్షన్‌కు నెంబర్ ప్రెస్ అయితే సబ్సిడీ కాస్త నిలిచిపోయి బ్యాంక్ లింకేజి బంధం తెగుతోంది. దీంతో సబ్సిడీ సొమ్ము అందడం లేదు. బ్యాంక్ లింకేజీనిపునరుద్ధరించుకోవాలి వంట గ్యాస్ కనెక్షన్‌తో అనుసంధానమైన బ్యాంక్ ఖాతా వినియోగంలో లేకుంటే సబ్సిడీ నగదు జమ కాదు. బుకింగ్ సమయంలో గ్యాస్ సబ్సిడీ వదలుకునే ఆప్షన్ పొరపాటున నొక్కినా సబ్సిడీ నిలిచిపోతుంది. బ్యాంక్ లింకేజి కట్ అవుతోంది. సబ్సిడీ సొమ్ము కావాలంటే బ్యాంక్ ఖాతాలను వినియోగంలోకి తీసుకొని రావాలి. తిరిగి బ్యాంక్ ఖాతాలను గ్యాస్ కనెక్షన్‌తో అనుసంధానం చేసుకొవాలి. బ్యాంక్ లింకేజీలను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.– అశోక్‌కుమార్, అధ్యక్షుడు, వంటగ్యాస్ డీలర్ల సంక్షేమ సంఘం, హైదరాబాద్ -
గ్యాస్ సిలిండర్లలో గంజాయి
బనశంకరి : గ్యాస్ సిలిండర్‌లో అక్రమంగా గంజాయి నింపి సరఫరా చేస్తున్న ముఠాలోని ఓ వ్యక్తిని బెంగళూరు నగరంలోని రామమూర్తినగర పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ వివరాలను వెల్లడించారు. రామమూర్తినగర విజినాపుర గులాబ్జాన్ అలియాస్ గులాబి అనే వ్యక్తి గ్యాస్ సిలిండర్ల కింది భాగాన్ని వృత్తాకారంలో కత్తిరించి దానికి తాళం వేసే రీతిలో మార్పులు చేశాడు. అందులో చిన్నచిన్న గంజాయి ప్యాకెట్లు నింపి బైకుపై వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ విక్రయిస్తున్నాడు. విజినాపుర ప్లాట్ఫారం రోడ్డులో ఆటోలో గంజాయి నింపిన గ్యాస్ సిలిండరును రవాణా చేస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీని ఆధారంగా మంగళవారం రామమూర్తినగర పోలీసులు ఆ ప్రాంతంలో కాపుకాసి ఆటోపై దాడి చేసి గులాబ్జాన్ను అరెస్టు చేశారు. ఇతడి నుంచి గంజాయి, ఓ ఆటో, సెల్‌ఫోన్ ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇలాగే గంజాయి సరఫరా చేస్తున్న మరో వ్యక్తి సమాచారం కూడా తెలిసిందని, అతడి కోసం తీవ్రంగా గాలిస్తుమని కమిషనర్ తెలిపారు. అంతేగాక గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసి వాటికి తాళం వేసే రీతిలో తయారు చేసిన వ్యక్తుల కోసం కూడా గాలిస్తున్నామన్నారు. -
సిలిండర్ @ రూ.2వేలు !
గొడౌన్లో గ్యాస్ లేదా...? గ్యాస్ అందుబాటులోకి రావడం లేదా....? అయితే సీలేరు రండి. రూ.2 వేలు ఇస్తే నడుచుకొని మీ ఇంటికి గ్యాస్ వచ్చేస్తుంది. గ్యాస్ సిలిండర్ ధర 2000 రూపాయలా..? అని ఆశ్చర్యపోతున్నారా!! ఔను నిజం. గ్యాస్ కావాలంటే అంత చెల్లించక తప్పదు. ఎందుకంటే ఇక్కడంతా దళారుల ఇష్టారాజ్యం. - సీలేరులో అంతే... - దళారుల చేతిలో సబ్సిడీ గ్యాస్ - ఒకే పేరుపై నాలుగైదు కనెక్షన్లు - అధిక ధరలకు ఒడిషా తరలింపు - పట్టించుకోని అధికారులు సీలేరు: సీలేరులో ప్రభుత్వ సబ్సిడీ గ్యాస్ దళారుల పాలవుతోంది. గ్యాస్ అధికారులు స్థానికంగా ఉన్న కొందరు దళారులు ఒక్కటై నకిలీ పేర్లతో పాస్ పుస్తకాలను తయారు చేసి ఒక్కొక్కరు 20 నుంచి 30 వరకు కనెక్షన్లు ఇళ్లల్లో పెట్టుకొంటున్నారు. ఈ వ్యవహారం అంతా రెండేళ్లుగా సాగుతున్నా సంబంధిత అధికారులు ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. దీంతో సీలేరుకు గ్యాస్ వచ్చిందంటే దళారుల సందడి ఎక్కువవుతుంది. ఒక్కో ఇంటిలో ఒకే పేరుపై నాలుగైదు కనెక్షన్లు, దానికి తోడు దళారుల వద్ద అధికంగా కనెక్షన్లు ఉండడంతో నిజమైన లబ్దిదారులకు గ్యాస్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే చింతపల్లి గ్యాస్ గొడౌన్లో అవినీతి వెలు గు చూడడానికి ప్రధాన కారణం సీలేరే. మరణించిన, ఊరు విడిచి వెళ్ళిన వారు, బదిలీ అయిన ఉద్యోగుల పేరిట కనెక్షన్లు ముందుగా తీసుకొని దళారులు దళారులు దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి నెలకు రెండుసార్లు గ్యాస్ సరఫరాచేయాల్సి ఉంది. అయితే ఇక్కడ దళారులు చింతపల్లి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కుమ్మక్కై గ్యాస్ సరఫరాలో జాప్యం చేస్తారు. ఈలోగా వినియోగదారుల అవసరాన్ని సాకుగా తీసుకుని తమ వద్ద ఉన్న సిలిండర్లను అధిక ధరలకు అమ్మి దళారులు సొమ్ము చేసుకుంటారు. సబ్సిడీ రేటు రూ.420గా ఉండగా, దళారులు రూ.1000 నుంచి రూ.2 వేల వరకు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. కనెక్షన్ ఉన్నా...నో గ్యాస్ ఆదివారం సీలేరులోని వినియోగదారుల కోసం 320 గ్యాస్ సిలిండర్లు సరఫరా అయ్యాయి. అయితే సరఫరా అయిన గ్యాస్ దళారుల పాలబడింది. లబ్దిదారుల్లో సగం మందికి కూడా గ్యాస్ అందకపోవడం గమనార్హం. అంటే ఒక్కొక్కరి వద్ద దగ్గర పదికి మించి బండలు ఉండడంతో వారంతా గ్యాస్‌ను సబ్సిడీ రేటుకు దక్కించుకున్నారు. వచ్చిన గ్యాస్‌లో సగం వారే తన్నుకుపోవడంతో మిగిలిన లబ్దిదారులకు గ్యాస్ అందక బిక్కమొగం వేశారు. రెండు నెలలుగా ఎదురు చూసినా తీరా గ్యాస్ వచ్చినా తమకు అందక గంటల తరబడి వేచి ఉండి ఖాళీ బండలతో లబ్దిదారులు ఉసూరుమంటూ తిరిగి వెళ్లారు. అధిక ధరలకు ఒడిషా తరలింపు అధిక ధరల కారణంగా స్థానికంగా డిమాండ్ లేకపోతే తమ వద్ద గల సిలిండర్లను దళారులు యథేచ్ఛగా పొరుగునే ఉన్న ఒడిషాకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా చిత్రకొండ, బలిమెల, మల్కన్‌గిరి వరకు బహిరంగంగా వ్యాన్లలో గ్యాస్ సిలిండర్లను తరలించడం ఇక్కడ నిత్యకృత్యం. ఇలా యథేచ్ఛగా సబ్సిడీ గ్యాస్ పక్కదారి పడుతుంటే పౌర సరఫరా అధికారులు మిన్నకుండిపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు గ్యాస్ అక్రమాలను దృష్టిలో పెట్టుకొని చింతపల్లిలో, సీలేరు దళారుల చేతిలో ఉన్న నకిలీ కనెక్షన్లు గుర్తించి నిజమైన లబ్దిదారులకు గ్యాస్ అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.