Gas Refilling
-
Dhoolpet : సిలిండర్ రీఫిల్లింగ్ సెంటర్లో ప్రమాదం... ఇద్దరు మృతి
-
Dhoolpet : సిలిండర్ రీఫిల్లింగ్ సెంటర్లో ప్రమాదం... ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్: ధూల్‌పేట్ టక్కరివాడిలో గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ చేస్తున్న కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒకరు మృతిచెందగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. టక్కరివాడిలోని లాల్‌భవన్ వెనుక ప్రాంతంలో వీరూ సింగ్ (50) కుటుంబ సభ్యులతో కలిసి గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాన్ని నడుపుతున్నాడు. సాయంత్రం వేళ అతని భార్య సుత్ర సింగ్ కిచెన్‌లో వంట చేస్తుండగా.. కొద్ది దూరంలోనే వీరూ సింగ్ అతని కుమారులు మానవ్‌సింగ్(22), షేరుసింగ్ (25)లు సిలిండర్లలో గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గ్యాస్ లీకై మంటలు చెలరేగి ఒక్కసారిగా సిలిండర్ భారీ శబ్ధంతో పేలింది. ఈ సంఘటనలో మానవ్‌సింగ్ మృతిచెందగా వీరూ సింగ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద కుమారుడు షేరుసింగ్, భార్య సుచిత్ర సింగ్‌లు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. పేలుడు శబ్ధానికి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక అయామయానికి గురై బయటకు పరుగులు తీశారు. పేలుడు సవచారం అందుకున్న గోషామహాల్ ఏసీపీ నరేందర్ రెడ్డి, మంగళ్‌హాట్ ఇన్స్పెక్టర్ రణవీర్రెడ్డి, గోషామహాల్ కార్పొరేటర్ లాల్‌సింగ్, స్థానికుల సహాయంతో నలుగురిని కంచన్‌బాగ్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మానవ్‌సింగ్ మృతిచెందాడు. తండ్రి వీరసింగ్ 70 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. తల్లి, పెద్ద కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఉలిక్కిపడ్డ టక్కరివాడి అక్రమంగా గ్యాస్ రీఫిలింగ్ చేస్తున్న కేంద్రంలో భారీ పేలుడు జరగడంతో టక్కరివాడి ప్రాంతం ఉలిక్కిపడింది. స్థానికులంతా తీవ్ర భయాందోళనకు గురై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏం జరిగిందో తెలియక మొదట అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. రీఫిల్లింగ్ కేంద్రంలో ఒక సిలిండర్ బ్లాస్ట్ కాగా మరో సిలిండర్‌లో గ్యాస్ లీక్ అవుతుండగా స్థానికంగా నివసించే ఓ వ్యక్తి గమనించి..ఆ సిలిండర్‌ను కట్టెతో జరిపి రోడ్డుపై పడేశాడు. దీంతో ప్రవదం తప్పింది. అనంతరం స్థానికులంతా పోలీసులతో కలిసి ఇంట్లో ఉన్న అన్ని సిలిండర్లను బయట పడవేశారు. కరోనాతో కుదేలై..గ్యాస్ రీఫిల్లింగ్ గతంలో ఆటోరిక్షా నడుపుతూ వీరూ సింగ్ కుటుంబాన్ని పోషించేవాడు. గత సంవత్సరం నుండి కరోనా మహమ్మారితో ఆటో నడపక...ఉపాధి కోల్పోయాడు. ఈ క్రమంలో కుటుంబ పోషణ కోసం గ్యాస్ రీఫిల్లింగ్ చేయడం ప్రారంభించాడు. ఇద్దరు కువరులు కూడా ఉద్యోగాలు కోల్పోయి..ఇంటి పట్టునే ఉంటూ తండ్రికి సహాయపడుతూ వస్తున్నారు. చివరకు గ్యాస్ బండ పేలుడులో చిన్న కుమారుడు మానవ్‌సింగ్ దుర్మరణం పాలవగా...తండ్రి వీనైసింగ్ తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నాడు. కాగా వీరూ సింగ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, రూ.25 లక్షలు పరిహారంగా ఇవ్వాలని గోషామహల్ కార్పొరేటర్ లాల్‌సింగ్ డిమాండ్ చేశారు. సంఘటనా స్థలాన్ని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సందర్శించారు. మంగళ్‌హాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మరింత ఈజీ: వాట్సాప్‌లో గ్యాస్ ఇలా బుక్ చేసుకోండి
బంజారాహిల్స్/ హైదరాబాద్: గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవడంలో వినియోగదారులకు మరింత ఉపయోగపడే రీతిలో సంబంధిత గ్యాస్ ఏజెన్సీలు సులభతరం చేశాయి. ఎల్పీజీ సిలిండర్ల వినియోగదారులు ఇప్పుడు వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. గతేడాది గ్యాస్ కంపెనీలు తమ వినియోగదారుల సౌలభ్యం కోసం వివిధ ఆన్లైన్ ప్రక్రియలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. గ్యాస్ ఏజెన్సీ వద్ద, డీలర్‌ను సంప్రదించడం లేదా వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకునే అవకాశం ఇప్పటిదాకా ఉండేది. ఇక నుంచి వాట్సాప్ ద్వారా కూడా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఎలా బుక్ చేసుకోవాలి... ఇండెన్ కస్టమర్లు 7718955555కు కాల్ చేసి ఎల్పీజీ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో అయితే 7588888824కు సందేశం పంపించవచ్చు. హెచ్‌పీ గ్యాస్ కస్టమర్లు 9222201122కు వాట్సాప్ మెసేజ్ పంపడం ద్వారా సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ నంబర్ మరిన్ని సేవా వివరాలను కూడా అందజేస్తుంది. భారత్ కస్టమర్లు సిలిండర్లను బుక్ చేసుకోవాలంటే తమ రిజిస్టర్ మొబైల్ నుంచి 1800224344 నంబర్‌కు మెసేజ్ చేయాలి. దీని తర్వాత వినియోగదారుల బుకింగ్ అభ్యర్థనను గ్యాస్ ఏజెన్సీ అంగీకరిస్తుంది. బుకింగ్ సమయంలో వినియోగదారులు తప్పనిసరిగా తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మాత్రమే వాట్సాప్ పంపాలి. మరింత సులభం.. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలో గల 8 గ్యాస్ ఏజెన్సీల వినియోగదారులకు ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం లభించింది. సుమారు లక్ష మందికి మేలు చేకూరనుంది. వాట్సాప్ ద్వారా బుకింగ్ సౌకర్యం కల్పించడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఉపయోగకరం వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే సౌలభ్యం వినియోగదారులకు ఎంతగానో దోహదపడుతుంది. సామాన్య మధ్య తరగతి ప్రజలకు కూడా ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండటం, వాట్సాప్ వాడుతుండటంతో ఈ ప్రక్రియ వారికి బాగా దోహదపడుతుంది. ఇప్పటి వరకు ఉన్న పలు విధానాల ద్వారా కొంత ఇబ్బంది కలిగేది. ఇప్పుడు తేలికగా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. – బి.శ్రీనివాస్, బీఎస్ ఎంటర్ప్రైజెస్ -
పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరికి గాయాలు
రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆదర్శనగర్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో రాము అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షత గాత్రుడ్ని సమీప ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో అక్రమంగా గ్యాస్ రిఫిల్లింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పేలుడుధాటికి ఇంటి గోడ కూడా కూలిపోయింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లో భారీ పేలుడు