GD Nellore
-
టీడీపీ మునస్వామి.. థామస్ ఎలా అయ్యాడు?
‘డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావుగారంటారు ధనముంటే అప్పలమ్మనే అప్సరసని పొగిడేస్తారు కాషే ఉంటే ఫేస్‌కు విలువస్తుంది నోటే ఉంటే మాటకు బలమొస్తుంది..’ ఇది ఓ తెలుగు సినిమాలో ఫేమస్ పాట. అచ్చం ఇలాంటిదే జీడీనెల్లూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. టీడీపీ తురఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న వీ.ఎం.థామస్ కులం, మతం, చదవులపై పలు అనునాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్మీడియెట్ టీసీలో వీ.మునస్వామిగా ఉన్న ఆయన పేరు ఆ తర్వాత కొంత కాలానికి వీ.ఎం.థామస్‌గా మారిపోవడం వెనుక ఆంతర్యమేమిటో అంతుపట్టడంలేదు. ఇక ప్రపంచ ప్రఖ్యాత సంతాన సాఫల్య వైద్యునిగా పేరుగడిస్తున్న ఆయన చదువుపైనా హిందూ ధర్మ పరిరక్షణ సమితి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు నిజనిజాలు నిగ్గు తేల్చాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని గంగాధరనెల్లూరు నియోజకవర్గం టీడీపీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి మునస్వామి (థామస్) 1990–91లో కార్వేటినగరం మండల కేంద్రంలోని ఆర్కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ పూర్తిచేశారు. ఆ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీచేయబోతున్న ఆయనపై పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మునస్వామి మతం, విద్యార్హతలు, నేరచరిత్ర పైన సమగ్ర విచారణ చేయాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్ మిట్టపల్లి సతీష్‌రెడ్డి జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఇంటర్మీడియెట్ కోర్సు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (టీసీ)లో వీ.మునస్వామిగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఉన్న పాస్‌పోర్టు, కులధ్రువీకరణ పత్రంలో వీ.మునస్వామి థామస్‌గా ఎలా అయ్యారనే విషయాన్ని సమగ్ర విచారణ చేయించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంబీబీఎస్ చేయకున్నప్పటికీ డాక్టర్‌గా చెలామణి అవుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం థామస్ అనే క్రిస్టియన్ పేరు మీద చెలామణి అవుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. థామస్ పేరులోనే క్రిస్టియానిటీ ఉందని, కావున అతని ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసి, థామస్ నామినేషన్‌ను తిరస్కరించి, ఎన్నికల్లో అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. తప్పుడు పత్రంతో ఎన్నికల్లో పోటీ క్రైస్తవ మతం స్వీకరించిన థామస్‌కు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మతం మారిన ఎస్సీలను బీసీలుగా గుర్తించాలని చట్టం చెబుతోందన్నారు. అయినప్పటికీ ఆయన తప్పుడు కులధ్రువీకరణ పత్రం సమర్పించి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారన్నారు. ఆయన ఎంబీబీఎస్ చదవక పోయినా పీహెచ్‌డీని అడ్డుపెట్టుకుని డాక్టర్‌గా చలామణి అవుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తను ప్రపంచ ప్రఖ్యాత సంతాన సాఫల్య వైద్యునిగా ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే ఆయన నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని, 2017లో తన వద్ద డాక్టర్‌గా పనిచేసి మానేసిన డాక్టర్ ఎస్.రమ్యను హత్య చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలున్నాయన్నారు. ఆ కేసులో ఆయనతో పాటు ఆరుగురు అరెస్టు కాగా, తరువాత ఆ కేసు ఏమైందో తెలియడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా కులధ్రువీకరణపత్రం 2022లో కార్వేటినగరం మండలంలో పనిచేసిన తహసీల్దార్ క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండానే నిబంధనలకు వ్యతిరేకంగా థామస్‌కు కులధ్రువీకరణ పత్రం జారీచేశారని తెలిసింది. 2022లో కార్వేటినగరం తహసీల్దార్‌గా పనిచేసిన షబ్బర్బాషా 26–04–2022న వీ.మునస్వామికి వీ.మునస్వామి థామస్ అని కులధ్రువీకరణ పత్రం ఎలా ఇచ్చారు?.. కులంపై వివాదం వచ్చినపుడు సంబంధిత గ్రామంలో నలుగురిని అడిగి పంచనాయా చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కులధ్రువీకరణ పత్రం ఎలా జారీచేశారని ఫిర్యాదుదారులు ప్రశ్నిస్తున్నారు. థామస్ మత మార్పిడి విషయాన్ని సమగ్రంగా విచారణ చేయాలని జై హిందుస్థాన్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అక్కిలిగుంట మధు ఈనెల మార్చి 15న జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్‌కు వినతి పత్రం అందజేశారు. ఆయన అందజేసిన వినతిలో సహజంగా పాస్ పోర్టు మంజూరు సమయంలో ఒక అక్షరం తప్పు ఉన్నా అధికారులు ఆమోదించరన్నారు. అలాంటిది మునస్వామి థామస్ అని పాస్‌పోర్టులో పొందారన్నారు. పేరు మార్చుకోవాలంటే గెజిట్ నోటిఫికేషన్ ఉండాలని, మతం మార్చుకుని ఉంటే సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. కాబట్టి పాస్‌పోర్టు సమయంలో మత మార్పిడి ధ్రువీకరణ పత్రం, గెజిట్ నోటిఫికేషన్ సమర్పించి ఉంటారని, సంబంధిత కార్యాలయం నుంచి నివేదిక తెప్పించుకుని విచారణ చేయాలని ఆ ఫిర్యాదులో కోరారు. వీటిపై సమగ్ర విచారణ 1.ఇంటర్ సర్టిఫికేట్లో వీ.మునస్వామి అని ఉన్న పేరు, పాస్‌పోర్టులో వీ.ఎం.థామస్‌గా ఎలా మారింది? 2.ఆయన జన్మస్థలం అల్లాగుంటని టీసీలోనూ, చైన్నె అని పాస్‌పోర్టులోనూ పేర్కొన్నారు. ఇందులో ఏది నిజం? 3. ఆయన వైద్యశాస్త్రం చదివారా..? లేక డాక్టరేట్ పొందిన వ్యక్తా? 4. ఆయనపై ఉన్న హత్యా ప్రయత్నం కేసు ఏమైంది. విచారణ కొనసాగుతోందా..? లేక కేసు కొట్టి వేశారా? పకడ్బందీగా విచారణ ఆధార్ కార్డులో వీ.ఎం, థామస్ అని ఉంది. ఏప్రిల్ 2022లో పనిచేసిన తహసీల్దార్ జారీచేసిన కులధ్రువీకరణ పత్రంలో వీ.మునస్వామి థామస్ అని జారీచేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నుంచి అందిన ఫిర్యాదులను సమగ్రంగా విచారిస్తున్నాం. ఆ ఫిర్యాదులకు సంబంధించిన రుజువులను పంపుతాం. ఈ ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేసి వాస్తవాలు తెలుసుకుంటాను. – పుష్పకుమారి, తహసీల్దార్, కార్వేటినగరం మండలం -
వైఎస్ జగన్ తో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం
-
లోకేశ్ పాదయాత్రలో హెడ్ కానిస్టేబుల్ మృతి
సాక్షి, చిత్తూరు/గంగాధర నెల్లూరు/ పాలసముద్రం: మొన్న చంద్రబాబు సభలు పలువురు ప్రజలను బలి తీసుకోగా, నేడు ఆయన కుమారుడు లోకేశ్ సభ ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు తీసుకుంది. రహదారులు, ఇరుకు రోడ్లు, మార్జిన్లు తదితర ప్రాంతాల్లో సభలు, ర్యాలీల వల్ల జరిగే విపరిణామాలకు ఇటీవలి చంద్రబాబు సభలే ఉదాహరణలు. ఇటువంటి ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం విశాలమైన మైదానాల్లో సభలు పెట్టుకోవాలని జీవో తెచ్చింది. అయినా, చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రలో భద్రతాపరమైన అంశాలను ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఆయన పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన లేదు. కార్యకర్తలు కూడా నామమాత్రంగా వస్తున్నారు. జనం రాకపోవడంతో లోకేశ్ అనుమతుల్లేకుండానే ఎక్కడపడితే అక్కడ పాదయాత్ర ఆపి మాట్లాడుతున్నారు. జనం ఎక్కువగా ఉన్నట్లు కనిపించేందుకు ఇరుకు రోడ్లు, మార్కెట్ ప్రాంతాల్లో లోకేశ్ సభలు నిర్వహిస్తున్నారు. ప్రజల భద్రతకు భంగం కలిగించేలా నిర్వహిస్తున్న ఈ సభలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ నేతలూ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఫ్రస్ట్రేషన్ పెరిగిన టీడీపీ కార్యకర్తలు పోలీసులకు ఎదురుతిరుగుతున్నారు. ఈ సందర్భంగా తోపులాటలు జరుగుతున్నాయి. ఇలాంటి సభే హెడ్ కానిస్టేబుల్ మరణానికి కారణమైంది. గురువారం గంగాధర నెల్లూరు మండలం సంశిరెడ్డిపల్లెలో నిర్వహించిన పాదయాత్రలో ఈ విషాద ఘటన జరిగింది. సంశిరెడ్డిపల్లెలో లోకేశ్ అనుమతుల్లేకుండానే, జాగ్రత్తలు తీసుకోకుండానే మాట్లాడటం ప్రారంభించారు. దీంతో పోలీసులు అడ్డు చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. టీడీపీ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ తీవ్ర అలజడి సృష్టించారు. ఈ సమయంలో అక్కడే బందోబస్తు విధుల్లో ఉన్న చిత్తూరు జిల్లా ఐరాల పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎ.రమేష్ (54) తీవ్ర అస్వస్థతతో గుండెపోటుకు గురయ్యారు. పోలీసులు వెంటనే ఆయన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే హెడ్ కానిస్టేబుల్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో పోలీసు కుటుంబాలు, ఆయన స్వస్థలమైన యాదమరి మండలంలోని కుచుంపల్లెలో విషాదం నెలకొంది. హెడ్‌కానిస్టేబుల్ మృతికి పోలీసు ఉన్నతాధికారులు సంతాపం తెలిపారు. టీడీపీ సభల్లో ఇది మరో దుర్ఘటన అని, నిబంధనలు పాటించకుండా టీడీపీ నేతలు మూర్ఖంగా ప్రవర్తించడంవల్లే హెడ్ కానిస్టేబుల్ మరణం సంభవించిందని పలువురు వ్యాఖ్యానించారు. శూలం గుచ్చుకొని కార్యకర్తకు గాయాలు ఎండీ మంగళం సమీపంలోని ఆలయం వద్ద లోకేశ్ మరో సభ నిర్వహించారు. ఇదీ నిబంధనలకు విరుద్ధంగానే జరిగింది. ఇక్కడ ఆలయం వద్ద ఉన్న శూలం గుచ్చుకుని మండలంలోని టీడీపీ కార్యకర్తకు గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈసారైనా గెలిపించండి: లోకేశ్ వేడుకోలు గంగాధర నెల్లూరులో 2009 నుంచి టీడీపీని గెలిపించలేదని, ఈసారైనా గెలిపించండి అంటూ నారా లోకేశ్ ప్రజలను అభ్యర్థించారు. ఆయన గురువారం గంగాధర నెల్లూరు మండలం దేవళంమిట్ట నుంచి పాలసముద్రం వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కడపగుంటలో మాట్లాడుతూ చంద్రబాబు పాలిచ్చే ఆవులాంటివాడని అన్నారు. మూడున్నరేళ్లుగా జగన్ రెడ్డి హయాంలో ఎస్సీలకు న్యాయం జరగలేదని ఆరోపించారు. ఇక్కడి ఎమ్మెల్యే నారాయణస్వామి ఏం పీకారని ప్రశ్నించారు. సమిసిరెడ్డిపల్లి వద్ద రోడ్డుపై పర్మిషన్ లేకుండా మాట్లాడొద్దన్న పోలీసుల్ని యూజ్‌లెస్‌ఫెలోస్ అంటూ దుర్భాషలాడాడు. తనకు చట్టం తెలుసంటూ రాజ్యాంగం పుస్తకాన్ని చూపించారు. రంగాపురంలో మద్యం సీన్ పాలసముద్రం మండలం రంగాపురంలో గురువారం సాయంత్రం లోకేశ్ సభకు జనాలను తరలించేందుకు చుట్టుపక్కల పల్లెలతోపాటు తమిళనాడుకు కూడా వాహనాలు ఏర్పాటుచేశారు. అయినా జనం రాలేదు. వచ్చిన వారు కూడా చాలా మంది టీడీపీ నేతలిచ్చిన మద్యం తాగి, బిర్యానీ తిని అక్కడే పడిపోయారు. రెండు గంటలు ఆలస్యంగా సభకు వచ్చిన లోకేశ్ జనం లేకపోవడంతో చిర్రుబుర్రులాడారు. చదవండి: ‘లోకేష్ పప్పు కాబట్టే.. చంద్రబాబు అలా చేశారు’ -
టీడీపీ నేత ప్రశ్నలు.. దిమ్మతిరిగేలా జనం జవాబులు
శ్రీరంగరాజపురం: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తలపెట్టిన ‘ఇదేమి ఖర్మ’ కార్యక్రమం ఆ పార్టీ నేతలకు షాక్ ఇచ్చింది. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని శ్రీరంగరాజపురం మండలం వీవీపురం పంచాయతీ పరిధిలోని ఆరిమాకులపల్లెలో శుక్రవారం ఆ పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చిట్టిబాబునాయుడు స్థానిక మహిళలకు వేసిన ప్రశ్నలకు వారు దిమ్మతిరిగేలా సమాధానం చెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఆయన అక్కడి నుంచి చిన్నగా జారుకున్నారు. ‘అదేంటి.. ఈ ఊరోళ్లు ఇలా మొహం మీదే మాట్లాడుతున్నారు’ అంటూ టీడీపీ మండల అధ్యక్షుడు జయశంకర్ నాయుడు, ఇతర నేతలు గుండయ్య, వెంకటరమణ, రవి, సిద్దయ్య తదితరులు చిట్టిబాబునాయుడును అనుసరించారు. స్థానిక మహిళలు, టీడీపీ నేత మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది. టీడీపీ నేత : సకాలంలో పింఛన్లు అందుతున్నాయా? మహిళలు : ప్రతి నెలా 1వ తేదీ తెల్లవారుతుండగానే వలంటీర్ వచ్చి నిద్రలేపి.. మరీ అందిస్తున్నారు టీడీపీ నేత : అందరికీ ఇవ్వడం లేదట కదా? మహిళలు : మాకందరికీ ఇస్తున్నారు. ఇంకా ఎవరికైనా రాకపోతే పెట్టుకోండని (దరఖాస్తు చేసుకోవాలని) చెబుతున్నారు. టీడీపీ నేత : మిగతా పథకాలు అందుతున్నాయా? మహిళలు : అన్నీ అందుతున్నాయి. టీడీపీ నేత : రోడ్లు అసలు బాగున్నాయా? మహిళలు : మీ హయాంలోనే గుంతలు పడ్డాయి. ఇప్పుడు బాగు చేశారు కదయ్యా.. టీడీపీ నేత : రాష్ట్రానికి ఒక్క రాజధాని ఉంటేనే మేలు కదా? మహిళలు : ఏం మేలు? మూడు రాజధానులు ఉంటే మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయి.. మీకేంటి అభ్యంతరం? టీడీపీ నేత : పథకాలకు డబ్బులు అడుగుతున్నారా? మహిళలు : అప్పట్లా జన్మభూమి కమిటీల్లేవు. ఎవరూ రూపాయి అడగడం లేదు. నేరుగా మా ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నాయి. అందుకే జగనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. -
చంద్రబాబు పీఏ చెప్పినా...
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలో పచ్చ తమ్ముళ్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణం నువ్వంటే నువ్వంటూ తెలుగు తమ్ముళ్లలోని రెండు వర్గాలు ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకుని ఘర్షణకు దిగారు. దీంతో సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సాక్షాత్తూ చంద్రబాబు పీఏ మనోహర్ జోక్యం చేసుకుని సర్ధి చెప్పినా ఆయన మాటను రెండు వర్గాలు పెడ చెవిన పెట్టాయి. దీంతో కుప్పం పట్టణ టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక గత రెండు రోజులుగా పరిష్కారం కావడం లేదు. ముచ్చటగా మూడో రోజు శుక్రవారం కూడా తమ్ముళ్ల ఘర్షణతో అధ్యక్షుడి ఎన్నిక జరగలేదు. -
జననేతకు జేజేలు