
సాక్షి,చిత్తూరుజిల్లా:జీడి నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలంలో జనసేన నాయకుడు లోకనాథ రెడ్డి రెచ్చిపోయాడు. ప్రభుత్వ భూమి ఆక్రమణపై ప్రశ్నించినందుకు ఆగ్రహంతో ఊగిపోయాడు.
గంగమాంబ పురం పరిధిలోని సర్వే నెంబర్ 202/5లో సుమారు మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా సాగు చేస్తున్నారని లోకనాథరెడ్డిపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేశారు.
దీంతో లోకనాథ్‌రెడ్డి గ్రామస్తులు,అధికారులపై దాడికి దిగాడు. రెవెన్యూ అధికారులు,గ్రామస్తులపై ఏకంగా మారణాయుధాలతో దాడి చేశాడు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment