టీడీపీ నేతలను నిలదీస్తున్న మహిళలు
శ్రీరంగరాజపురం: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తలపెట్టిన ‘ఇదేమి ఖర్మ’ కార్యక్రమం ఆ పార్టీ నేతలకు షాక్ ఇచ్చింది. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని శ్రీరంగరాజపురం మండలం వీవీపురం పంచాయతీ పరిధిలోని ఆరిమాకులపల్లెలో శుక్రవారం ఆ పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చిట్టిబాబునాయుడు స్థానిక మహిళలకు వేసిన ప్రశ్నలకు వారు దిమ్మతిరిగేలా సమాధానం చెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఆయన అక్కడి నుంచి చిన్నగా జారుకున్నారు. ‘అదేంటి.. ఈ ఊరోళ్లు ఇలా మొహం మీదే మాట్లాడుతున్నారు’ అంటూ టీడీపీ మండల అధ్యక్షుడు జయశంకర్ నాయుడు, ఇతర నేతలు గుండయ్య, వెంకటరమణ, రవి, సిద్దయ్య తదితరులు చిట్టిబాబునాయుడును అనుసరించారు. స్థానిక మహిళలు, టీడీపీ నేత మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది.
టీడీపీ నేత : సకాలంలో పింఛన్లు అందుతున్నాయా?
మహిళలు : ప్రతి నెలా 1వ తేదీ తెల్లవారుతుండగానే వలంటీర్ వచ్చి నిద్రలేపి.. మరీ అందిస్తున్నారు
టీడీపీ నేత : అందరికీ ఇవ్వడం లేదట కదా?
మహిళలు : మాకందరికీ ఇస్తున్నారు. ఇంకా ఎవరికైనా రాకపోతే పెట్టుకోండని (దరఖాస్తు చేసుకోవాలని) చెబుతున్నారు.
టీడీపీ నేత : మిగతా పథకాలు అందుతున్నాయా?
మహిళలు : అన్నీ అందుతున్నాయి.
టీడీపీ నేత : రోడ్లు అసలు బాగున్నాయా?
మహిళలు : మీ హయాంలోనే గుంతలు పడ్డాయి. ఇప్పుడు బాగు చేశారు కదయ్యా..
టీడీపీ నేత : రాష్ట్రానికి ఒక్క రాజధాని ఉంటేనే మేలు కదా?
మహిళలు : ఏం మేలు? మూడు రాజధానులు ఉంటే మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయి.. మీకేంటి అభ్యంతరం?
టీడీపీ నేత : పథకాలకు డబ్బులు అడుగుతున్నారా?
మహిళలు : అప్పట్లా జన్మభూమి కమిటీల్లేవు. ఎవరూ రూపాయి అడగడం లేదు. నేరుగా మా ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నాయి. అందుకే జగనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలి.
Comments
Please login to add a commentAdd a comment