విషవాయువే మింగింది
పాత గుళాయిలోకి వెళ్లడం వల్లే
బదిలీ కార్మికుడు అనిల్‌కుమార్ మృతి
జీడీకే-7లో విషవాయువున్నట్లు నిర్ధారించిన అధికారులు..?
యైటింక్లయిన్‌కాలనీ(కరీంనగర్) : విషవాయువు వల్లే కార్మికుడు మింగనబోయిన అనిల్‌కుమార్ మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు అతను బహిర్భూమికి వెళ్లిన పాత గుళాయి ప్రాంతానికి బుధవారం వారు చిమ్నీలను పట్టుకెళ్లగా అవి ఆరిపోయినట్లు సమాచారం.
ఆర్జీ-2 ఏరియూ పరిధి జీడీకే-7ఎల్ఈపీ గనిలో 19వ లెవల్ 14వ డీప్ టాప్సీమ్-3లో గాలి వృథాను అరికట్టేందుకు గోడ నిర్మించడానికి నలుగురు కార్మికులతో కలిసి వెళ్లిన అనిల్‌కుమార్ మంగళవారం మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అధికారు లు లోతుగా విచారిస్తున్నారు. గోడ నిర్మాణానికి ఇటుకలు మోస్తున్న క్రమంలో మలవిసర్జన కోసం సమీపంలోని పాత గుళాయిలోకి వెళ్లి వచ్చిన అనిల్‌కుమార్ ఆ వెంటనే వాంతు లు చేసుకున్నాడని, ఏం జరిగిందో తెలసుకునేలోపే అతను తుదిశ్వాస విడిచినట్లు తోటి కార్మికులు చెబుతున్నారు. విషవాయువుతో నిండి ఉన్న ప్రాంతంలోకి వెళ్లడం వల్లే ఇలా జరిగిందంటున్నారు. అక్కడ సూవర్వైజింగ్ అధికారులుంటే ఆవైపు వెళ్లనిచ్చేవారు కాదని పేర్కొంటున్నారు.
విచారణ ప్రారంభించిన డీడీఎంఎస్
హైదరాబాద్ నుంచి వచ్చిన డీడీఎంఎస్ అధికారి ముఖర్జీ బుధవారం విచారణ ప్రారంభిం చారు. ఆయన గనిలోకి దిగి సంఘటనా స్థలా న్ని పరిశీలించిన అనంతరం కార్మికుని మృతికి దారి తీసిన పరిస్థితుల వివరాలు సేకరించా రు. గురువారం ఇక్కడే ఉండి ప్రత్యక్ష సాక్షుల తో వాంగ్మూలాలు సేకరించనున్నారు.
నల్లబ్యాడ్జీలతో కార్మికుల నిరసన
కార్మికుడి మృతిపై కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. గని ప్రమాదంగా గుర్తించి మృతుని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియాతోపాటు అన్ని విధాల న్యాయం చేయూలని డిమాండ్ చేశారు. అనంతరం బదిలీ వర్కర్లం దరూ విధులు బహిష్కరించి అనిల్‌కుమార్ అంతిమయాత్రలో పాల్గొనడానికి వెళ్లారు.
పర్యవేక్షణ లేకపోవడంవల్లే : టీబీజీకేఎస్
పని స్థలాల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని టీబీజీకేఎస్ నాయకులు మాదాసు రాంమూర్తి, సారంగపాణి, నూనె కొమురయ్య, ఐలి శ్రీనివాస్ డీడీఎంఎస్ కు వినతి పత్రం అందజేశారు. గాలికొరత, మైనింగ్ సర్ధార్‌ల కొరత ఎక్కువగా ఉందని, మైన్స్, సేఫ్టీ కమిటీ సమావేశాల్లో దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. బాధ్యులపై చర్య తీసుకుని భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఇది లా ఉండగా అనిల్‌కుమార్ మృతి సంఘటన ను యాజమాన్యం గని ప్రమాదంగా గుర్తించి నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.