జగన్‌ను కలిసి మద్దతు తెలిపిన అరుణాచల్ మాజీ సీఎం
ఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గెగాంగ్ అపాంగ్ ఈ రోజు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకుకు వైఎస్ఆర్ సిపి చేస్తున్న పోరాటానికి ఆయన మద్దతు తెలిపారు.
జగన్ దేశవ్యాప్తంగా పర్యటించి జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు సహకరించమని కోరిన విషయం తెలిసిందే. పలువురు నేతలు జగన్ చేపట్టిన సమైక్య ఉద్యమానికి మద్దతు తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు అపాంగ్ కూడా మద్దతు తెలిపారు.