నలుగురి కథ
గెహనా వశిష్ట్, నికిత సింగ్, శీతల్ కపూర్, అర్చా శ్రీవాత్సవ్ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘గ్లామర్ గర్ల్స్’. హృదయ్ శంకర్ మిశ్రా దర్శకత్వంలో గుల్ మహ్మద్ అక్బర్, సలీమ్, జి.శంకర్‌గౌడ్ తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తోన్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శ కుడు ఎన్.శంకర్ కెమెరా స్విచ్చాన్ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు క్లాప్ ఇచ్చారు.
హృదయ్ శంకర్ మిశ్రా మాట్లాడుతూ– ‘‘తెలుగులో యజ్ఞం, వర్షం, పౌర్ణమి, లక్ష్మీ నరసింహా’ చిత్రాలకు పనిచేశా. 12 భాషల్లో దర్శకత్వం వహించిన నేను తొలిసారి తెలుగు సినిమాని డైరెక్ట్ చేయడం ఆనందంగా ఉంది. ఇది ఒక అమ్మాయి కథ కాదు. అందమైన కలలు కనే ప్రతి అమ్మాయి కథ’’ అన్నారు. ‘‘40 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నా. మంచి సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు శంకర్ గౌడ్. ‘‘మంచి టీమ్ కుదిరింది’’ అన్నారు గుల్ మహ్మద్.