gene
-
మద్యపాన వ్యసనానికి చెక్‌పెట్టే సరికొత్త చికిత్స విధానం!
మద్యపాన వ్యసనం ఎన్నో కుటుంబాల్లో చిచ్చు రేపింది. బంధాలను ముక్కలు చేసి ఎవర్నీ ఎవరికీ కాకుండా చేసి జీవితాలను కాలరాస్తోంది. అలాంటి మహమ్మారిలాంటి ఈ మద్యపాన వ్యసనం నుంచి బయటపడేందుకు సమర్థవంతమైన చికిత్స విధానాలు ఇప్పటివరకు అందుబాటుల్లో లేవు. డీ అడిక్షన్ సెంటర్లు ఉన్నాయి కదా! అని అంటారేమో. మందు బాబులు అక్కడ ఇచ్చే కౌన్సిలింగ్‌కి, జీవనశైలికి దాని అడిక్షన్ నుంచి బయటపడినట్లు అనిపిస్తారు అంతే. కళ్ల ముందు చుక్క కనిపించిందంటే మళ్లీ కథ మాములే. కొందరే ఆయా సెంటర్ల నుంచి మెరుగై మళ్లీ దాని జోలికి వెళ్లకుండా ఉండేందుకు యత్నిస్తారు. ఇది కూడా అంత ప్రభావంతమయ్యింది కాదు. దీని పరిష్కారం కోసం ఎన్నాళ్లుగానే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజా అధ్యయనాల్లో దీనికి ప్రభావంతమైన జన్యు చికిత్స విధానాన్ని కనుగొన్నారు. అదేంటంటే..ఈ ఆల్కాహాల్ యూజ్ డిజార్డర్(ఏయూడీ) ఓ పట్టాన వదిలించుకోలేని జబ్బు అని చెప్పొచ్చు. దీని కోసం శాస్త్రవేత్తలు చేసిని పరిశోధన కొంతవరకు పురోగతినే చూపించింది. ఈ మద్యపానానికి బానిసలుగా మారిన వాళ్ల బ్రెయిన్‌పై పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. ఎందుకు మందువైపు నుంచి వాళ్లను వాళ్లు మరల్చుకోలేకపోవడానికి కారణం ఏంటా? అనే దిశగా పరిశోధనలు చేయగా..మెదడులో ఉండే కమ్యేనికేషన్ వ్యవస్థకు సంబంధించిన మొసోలింబిక్ డోపమేన్ సిగ్నలింగ్ లోతుగా ఉన్నట్లు గురించారు. ఇది మద్యం సేవిస్తే కలిగి మంచి అనుభూతిని న్యూరోట్రాన్సిమీటర్కు ఎలా ప్రశారం చేస్తుందో నిర్థారించారు. ఈ వ్యవస్థ పనితీరులో ప్రధానమైనది గ్లియల్ డెరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్(జీడీఎన్‌ఎఫ్) అనే ప్రోటీన్. అల్కహాల్ తాగకుండా ఉండేందుకు యత్నిస్తున్న ఏయూడీ రోగుల మెదుడులోని వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా (వీటీఏ) జీడీఎన్ఎఫ్స్థాయిలు పడిపోతాయని పరిశోధనలో తేలింది. దీని కోసం జన్యు చికిత్స ఉపయోగించి వీటీఏలో జీడీఎన్‌ఎఫ్ స్థాయిలను భర్తీ చేస్తే డోపమేన్ సిగ్నలింగ్‌ను బలోపేతం అవుతుందా? అనే దిశగా పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. ఆ అధ్యయనంలో తక్కువ మోతాదులో మద్యపానం సేవిస్తే డోపమైన్ సిగ్నలింగ్ విడుదల బాగానే ఉంది. దీర్ఘకాలికంగా తాగితే మాత్రం మెదడును డీసెన్సిటైజ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత కాలక్రమేణ తక్కువ డోపమైన్‌ను విడుదల చేస్తుందని అన్నారు. ఈ వ్యసనంతో బాధపడుతున్నవారికి నిగ్రహంగా ఉందామనే సమయంలో వచ్చే అసౌకర్యం, చికాకుని తట్టుకోలే మళ్లీ తాగడం ప్రారంభిస్తుంటారని అన్నారు. ఇక్కడ తాగాలనిపించేలా మెదడు సిగ్నలింగ్ ఇచ్చే డోపమేన్ వ్యవస్థకే జన్యు చికిత్స చేస్తే సమస్యను అధిగమించవచ్చు అనేది శాస్త్రవేతల ఆలోచన. అందుకోసమని కొన్ని కోతులపై ఈ పరిశోధన చేశారు. దాదాపు 21 రోజుల పాటు కోతులకు మద్యపానం, నీరు వాటికి నచ్చినంత తాగేలా స్వేచ్ఛగా వదిలేశారు. కొద్దిరోజులకే అవి అధికంగా మధ్యపానానికి అడిక్ట్ అవ్వడం చూశారు. ఆ తర్వాత ఆ కోతులకు జీడీఎన్‌ఎఫ్ జన్యు చికిత్సను అందించారు. దీంతో అవి మద్యపానానికి బదులు నీటిని తాగడానికి ప్రయత్నించడం మొదలు పెట్టాయి. తెలియకుండానే మద్యపానాన్ని పక్కనపెట్టడం జరిగింది. వాటి రక్తంలో ఆల్కహాల్ కంటెంట్ తక్కువుగా ఉండటాన్ని కూడా గుర్తించారు. ఆల్కహాల్ యూస్ డిజార్డర్‌తో బాధపడుతున్నవారికి ఈ చికిత్స గొప్ప పరిష్కార మార్గం అని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ సమస్య ఎదుర్కొంటున్నారని, వారికి ఈ చికిత్స విధానం అద్భుత ప్రయోజనాలను ఇవ్వగలదని అన్నారు. అయితే ప్రభావవంతంగా పనిచేస్తున్న ఈ జన్యు చికిత్స మానువులకు ఎంతవరకు సురక్షితం అనేదాని గురించి ట్రయల్స్ నిర్వహించి మరింత లోతుగా అధ్యయనాలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. (చదవండి: అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడకల్లో 'ఇడ్లీ లొల్లి'..దీని మూలం ఎక్కడిదంటే..) -
పంది కిడ్నీతో కోతికి రెండేళ్ల ఆయుష్షు.. మరో మెట్టెక్కిన ఆధునిక వైద్యం!
మానవులకు జంతు అవయవ మార్పిడి చికిత్సలో వైద్యశాస్త్రం మరోముందడుగు వేసింది. జన్యు ఇంజనీరింగ్ చేసిన పంది కిడ్నీని అమర్చిన ఒక కోతి మరో రెండు సంవత్సరాల ఆయుష్షు పోసుకుంది. మానవులకు జంతు అవయవ మార్పిడి విషయంలో జరుగుతున్న ప్రయోగ పరిశోధనలలో ఇదొక మైలురాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో వెల్లడించిన వివరాల ప్రకారం పరిశోధకులు పందులలో జన్యు సవరణపై సాగిస్తున్న ప్రయోగాలలో మరింత పురోగతి సాధించారు. జంతువులలో జన్యుమార్పిడి చేసిన అవయవాలను అమర్చినప్పుడు, ఆ అవయవాలు నిద్రాణమైన వైరస్‌లను కలిగి ఉండవని, మార్పిడి అనంతరం ఆ నూతన అవయవాలు అంతర్గత దాడికి గురికావని శాస్త్రవేత్తలు గమనించారు. మానవేతర జీవులలో అవయవ మార్పిడి జరిగినప్పుడు ఆ మార్పిడి అవయవం సురక్షితంగా ఉందని, ఆ జీవికి లైఫ్ సపోర్ట్ అందిస్తుందని నూతన ప్రయోగ ఫలితాలలో తేలిందని యూఎస్ బయోటెక్ సంస్థ ఇజెనెసిస్లోని మాలిక్యులర్ బయాలజిస్ట్ వెన్నింగ్ క్విన్ తెలిపారు. జినోట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది వివిధ జాతుల మధ్య ఒక అవయవాన్ని మార్పిడి చేసే విధానం. దీని ద్వారా బాధితులకు అవయవదానంతో ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక్క అమెరికాలోనే లక్షకు పైగా బాధితులు అవయవదానం కోసం ఎదురుచూస్తున్నవారి జాబితాలో ఉన్నారు. అవయవదానం కోసం ఎదురుచూస్తూ, ఫలితం లేకపోవడంతో ప్రతిరోజూ 17 మంది మృతి చెందుతున్నారు. అవయవ మార్పిడి చికిత్సల పరిశోధనల్లో సైన్స్ మరింతగా అభివృద్ధి చెందుతోంది. గత ఏడాది వైద్యులు జన్యు ఇంజనీరింగ్ చేసిన పంది గుండెను 57 ఏళ్ల వ్యక్తికి మార్పిడి చేశారు. అయితే ఆ పంది గుండె గ్రహీత చికిత్స జరిగిన రెండు నెలల తర్వాత మరణించాడు. ఇదేవిధంగా గత నెలలో మధ్య వయస్కుడైన ఒక వ్యక్తికి కూడా పంది గుండెను అమర్చారు. బ్రెయిన్ డెడ్ స్థితికి చేరిన మనుషులలో అవయవమార్పిడి చేసేందుకు జెనోట్రాన్స్ప్లాంట్ సహరిస్తుంది. తాజా పరిశోధనలో జెనోట్రాన్స్ప్లాంట్ చేసిన అవయవాల మార్పిడి కారణంగా కోతుల జీవితకాలం పెరిగినట్లు స్పష్టమయ్యింది. మొత్తం 69 జన్యువులను పరిశోధకులు పరిశీలించగా, వాటిలో ఎక్కువశాతం గ్రహీత రోగనిరోధక వ్యవస్థ అవయవంపై దాడి చేయవని వెల్లడయ్యింది. ఇందుకోసం పంది జన్యువులో నిద్రాణమైన వైరస్‌లను సవరించారు. అవి కోతుల రోగనిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా ఉండేందుకు ఔషధ చికిత్స చేశారు. అలాగే పంది అవయవాలలో మానవ జన్యువులను ప్రవేశపెట్టారు. మానవ జన్యువులు ప్రవేశపెట్టని మూత్రపిండాలు కలిగిన కోతులలో అవయవ మార్పిడి చేసినప్పుడు ఆ కోతులు చికిత్స అనంతరం సగటున 24 రోజులు మాత్రమే జీవించాయి. మొత్తం 21 కోతులపై ఈ ప్రయోగాలు జరిగాయి. అయితే మానవ జన్యువులను ప్రవేశపెట్టిన మూత్రపిండాలు కలిగిన కోతులలో అవయవ మార్పిడి చేసినప్పుడు అవి సగటున అధికంగా 176 రోజులు జీవించాయని తేలింది. అలాగే ఈ ప్రయోగాలలో వినియోగించిన ఐదు కోతులు ఒక సంవత్సరానికి మించి జీవించాయని, ఒకకోతి ఏకంగా రెండేళ్లు ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా జీవించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. గతంలో జెనోట్రాన్స్ప్లాంటేషన్ ప్రయోగాలకు సాధారణ పందులను ఉపయోగించినప్పటికీ, నూతన పరిశోధనల్లో మినీయేచర్ పిగ్‌లను ఉపయోగించారు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన జెనోట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ ముహమ్మద్ మొహియుద్దీన్ మాట్లాడుతూ మనుషులలో జంతు అవయవ మార్పిడి చికిత్స విజయవంతం అయ్యేందుకు, ఆ అవయవాల జన్యువును మరింత సవరించాల్సిన అవసరం ఉందన్నారు. అవయవ దానం కోసం ఎదురు చూస్తున్న బాధితులకు ఈ ప్రయోగాలు వరం లాంటివని పేర్కొన్నారు. అయితే ఇది సాకారం అయ్యేందుకు మరికొంత కాలం పడుతుందని అన్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని తాకిన ‘వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్’ ఘుమఘుమలు -
ఆ జన్యువులోనే కోవిడ్ మరణాల గుట్టు!
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మందిని బలితీసుకుంది. కొన్నిదేశాల్లో ఇంకా ప్రభావం చూపుతూనే ఉంది. ఈ వైరస్ బారినపడి చనిపోయినవారిలో.. పెద్దవయసువారు, వివిధ వ్యాధులున్నవారే కాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని మధ్యవయసువాళ్లు, యువత కూడా ఉన్నారు. మరి ఇలా ఏ అనారోగ్యం లేకుండా నిక్షేపంగా ఉన్నవారు కూడా కోవిడ్‌తో చనిపోవడానికి వారిలో జన్యు వ్యత్యాసమే (జీన్ వేరియేషన్) కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంతకీ ఆ జన్యువు ఏమిటి, ఎందుకు ప్రాణాల మీదికి వస్తోంది, పరిశోధనలో తేలిన వివరాలివి.. ఊపిరితిత్తుల కణాల్లో.. సాధారణంగా పిల్లలు, యువతతోపాటు 60 ఏళ్లలోపు వయసు వారిలో రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) ఎక్కువగా ఉంటుంది. 60 ఏళ్లు దాటినవారిలో వయసు పెరిగినకొద్దీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. కానీ కోవిడ్ బారినపడి చనిపోయినవారిలో 30ఏళ్ల నుంచి 60ఏళ్ల మధ్య వయసువారు కూడా పెద్ద సంఖ్యలో ఉండటంపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ జీనోమిక్స్ విభాగం శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. తీవ్రస్థాయిలో కోవిడ్‌కు గురై ఊపిరితిత్తులు దెబ్బతిన్నవారు, తక్కువగా ప్రభావితమైన వారి జన్యుక్రమాన్ని పోల్చి చూశారు. మన ఊపిరితిత్తుల కణాల్లో ఉండే ‘ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్1’ అనే జన్యువులోని ఒక వేరియేషన్ కరోనా మరణాలు ఎక్కువగా ఉండటానికి కారణమని గుర్తించారు. ఏమిటీ ‘ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్1’? ఊపిరితిత్తుల కణాలగోడలు దృఢంగా ఉండటానికి, వైరస్ల దాడిని ఎదుర్కొని, కణాలు తిరిగి బలం పుంజుకోవడానికి ఈ జన్యువు తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ జన్యువులో రెండు రకాలు (వేరియంట్లు) ఉన్నాయని.. అందులో ఒకరకం కోవిడ్ ఇన్ఫెక్షన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తోడ్పడితే.. మరో రకానికి ఈ శక్తి తక్కువగా ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఇలా తక్కువ శక్తి ఉన్న రకం జన్యువు.. దక్షిణాసియా దేశాల వారిలో 60 శాతం, యూరోపియన్ దేశాల్లో 15 శాతం, ఆఫ్రికా వారిలో 2.4 శాతం, తూర్పు ఆసియా దేశాల వారిలో 1.8 శాతం ఉన్నట్టు తేలిందని వివరించారు. ‘రిస్క్’ రెండింతలు.. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా మన శరీరంలో నేరుగా ఎక్కువ ప్రభావం పడిన జన్యువు ‘ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్1’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన ఆక్స్ఫర్డ్ వర్సిటీ ప్రొఫెసర్ జేమ్స్ డేవిస్ చెప్పారు. అయితే కేవలం ఈ ఒక్క జన్యువు కారణంగానే పెద్ద సంఖ్యలో మరణాలు నమోదైనట్టు చెప్పలేమని.. మధుమేహం, గుండెజబ్బులు వంటివి ఉన్నవారిలో తక్కువ శక్తి ఉన్న జన్యువు ఉంటే.. మరణించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. భారతదేశంలో టైప్–2 మధుమేహం,గుండె జబ్బుల బాధితులు ఎక్కువని.. దానికితోడు తక్కువ సామర్థ్యమున్న ‘ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్1’ జన్యువు ఉన్నవారి సంఖ్య కూడా ఎక్కువేనని జేమ్స్ డేవిస్ తెలిపారు. ఈ రెండింటి కారణంగానే కరోనా రెండో వేవ్ సమయంలో భారతదేశంలోని కొన్నిప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మరణాలు నమోదయ్యాయని వెల్లడించారు. వయసు పెరిగిన కొద్దీ.. తక్కువ సామర్థ్యమున్న ‘ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్1’ జన్యువు ఉన్నవారు.. తమకంటే పదేళ్లు ఎక్కువ వయసున్న వారితో సమానంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు లోనవుతారని ప్రొఫెసర్ జేమ్స్ డేవిడ్ వెల్లడించారు. అలాంటి వారిలో 20–30 ఏళ్ల తర్వాత ప్రతి పదేళ్లకు ప్రమాద అవకాశం రెండింతలు అవుతూ ఉంటుందని వివరించారు. అయితే తక్కువ సామర్థ్యమున్న ‘ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్1’ జన్యువు ఉన్నంత మాత్రాన ప్రమాదకరమని అనుకోవద్దని.. ఇతర జన్యువులు, రోగ నిరోధక శక్తి, ఎలాంటి వ్యాధులు లేకపోవడం వంటివి రక్షణగా ఉంటాయని స్పష్టం చేశారు. -
పురుషుల ప్రాణం తీస్తోన్న వ్యాధి, కారణం తెలిసింది!
వాషింగ్టన్: జన్యుపరమైన ఒక వ్యాధితో అమెరికాలో చాలామంది పురుషులు మరణించారు. అయితే దానికి సంబంధించిన కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు. అయితే ఇటీవలే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈ వ్యాధిగల కారణాన్ని కనుగొని దీనికి విశాక్స్ అనే పేరుపెట్టింది. సాధారణంగా మన శరీరంలోకి హానికరమైన వైరస్లు కానీ, బ్యాక్టీరియాలు కానీ ప్రవేశించినప్పుడు సహజంగా మన దేహంలో ఉండే వ్యాధి నిరోధక కణాలైన తెల్ల రక్త కణాలు వాటిపై దాడి చేసి వాటిని అంతమొందిస్తాయి. అయితే ఈ వ్యాధిలో మాత్రం బయట నుంచి ఎలాంటి హాని కలిగించే జీవులు శరీరంలోకి ప్రవేశించనప్పటికి ఈ కణాలు యుద్దాన్ని చేస్తూ మన శరీరంపైనే దాడిచేసి మంటను రగిలిస్తాయి. దాని వలన నరాల్లో రక్తం గడ్డకట్టడం, తరచు జ్వరం రావడంలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వ్యాధి సోకిన వారిలో అదేమిటో వైద్యులు సరిగా గుర్తించలేకపోయేవారు. ఆ వ్యాధి సోకిన వారిలో 40శాతం మంది మరణిస్తున్నారు. వివిధ వర్గాలకు చెందిన 25వేలమందికి పైగా ప్రయోగాలు చేశామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది యూబీఏ1 అనే జన్యువులో మార్పు కారణంగా కలుగుతుందని నిపుణులు పేర్కొన్నారు. చదవండి: ఇంటికి పిలిపించి కుక్కతో కరిపించాడని.. -
పెళ్లైన 9 ఏళ్లకు అమ్మాయి కాదని తెలిసింది
కోల్‌కతా: సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఓ మహిళకు అకస్మాత్తుగా షాకింగ్ నిజం తెలిసింది. కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళితే ఆమె "అతడు" అని తేలింది. ఈ విచిత్ర ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. కోల్‌కతాలోని బీర్‌భమ్‌కు చెందిన ముప్పై యేళ్ల మహిళ కడుపు నొప్పితో కొద్ది నెలల క్రితం నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు ఆమెను పరీక్షించగా.. టెస్టిక్యులర్(వృషణ) క్యాన్సర్ బారిన పడినట్లు తెలిసింది. దీంతో పాటు మరో షాకింగ్ నిజం తెలిసింది. మెడికల్ రిపోర్టులో ఆమె పురుషుడని తేలింది. సాధారణంగా మహిళల్లో XX క్రోమోజోములు ఉంటాయి. కానీ, ఆమెలో మాత్రం పురుషుని వలె XY క్రోమోజోములు ఉన్నాయి. (కరోనాకు భారతీయ మహిళలే ఎక్కువగా బలి!) ఈ విషయం గురించి ఆమెను పరీక్షించిన వైద్యులు డా.దత్త మాట్లాడుతూ.. "ఆమె చూడటానికి అచ్చంగా మహిళలాగే కనిపిస్తుంది. గొంతుతో పాటు అన్ని అవయవాలు అమ్మాయిలానే ఉంటాయి. శరీరంలోనూ మహిళల్లో ఉండే అన్ని హార్మోన్లు ఉన్నాయి. వీటివల్లే ఆమెకు స్త్రీ రూపం వచ్చింది. అయితే ఆమెలో పుట్టుకతోనే గర్భాశయం, అండాశయం లేవు. దీని వల్ల సదరు మహిళకు ఇప్పటికీ రుతుస్రావం జరగలేదు. ఇలాంటి సంఘటనలు చాలా అరుదు. 22 వేల మందిలో ఒక్కరికి ఇలా జరుగుతుంది" అని తెలిపారు. (10 ఏళ్ల గ్యాప్‌తో కవలల జన్మ) ప్రస్తుతం ఆమెకు కీమోథెరపీ చేస్తున్నామని, ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. కాగా ఆమె పెళ్లి చేసుకుని 9 సంవత్సరాలు అవుతుండగా వీరికి పిల్లలు లేరు. దీని గురించి ఆమెకు, ఆమె భర్తకు కౌన్సెలింగ్ ఇస్తున్నామని వైద్యులు తెలిపారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె 28 ఏళ్ల సోదరికి "ఆండ్రోజెన్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్" ఉన్నట్లు నిర్ధారణ అయింది. అంటే జన్యుపరంగా అబ్బాయిలా జన్మించినప్పటికీ, పైకి మాత్రం అమ్మాయిలాగే కనిపిస్తుంది. వీరి రక్త సంబంధీకుల్లో ఇద్దరికి ఇలాంటి వ్యాధి ఉండటం వల్లే జన్యువుల ద్వారా వీరికి వ్యాపించిందని డా. దత్త తెలిపారు. (కన్నీటితో కడుపు నింపలేక.. ) -
ఊబకాయానికి కారణమైన జన్యువును గుర్తించారు!
కొంతమంది ఎంత తిన్నా కొంచమైనా లావెక్కరు. ఇంకొందరు ఎన్నిపాట్లు పడ్డా అంగుళమైనా తగ్గరు. దీనికి కారణమేమిటి? ఓ జన్యువు అంటున్నారు డ్యూక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త వాన్ బెన్నెట్ అంటున్నారు. శరీర కండరాలు అన్నింటిలో ఉండే అన్‌కైరిన్ –బీ అనే జన్యువు వల్ల కొంతమంది ఊబకాయులుగా తయారవుతూంటారని ఆయన తన తాజా పరిశోధన వ్యాసంలో వివరించారు. ఈ జన్యువును దాదాపు 30 ఏళ్ల క్రితమే గుర్తించారు. దీంట్లో వచ్చే మార్పులు అనేక వ్యాధులకు కారణమని తెలుసు. అయితే ఇటీవల వాన్ బృందంలోని శాస్త్రవేత్త ఒకరు ఇలాంటి జన్యువే ఉన్న ఎలుకలు మిగిలిన వాటికంటే లావుగా ఉండటాన్ని గుర్తించడంతో ఊబకాయంలో దీని పాత్రపై పరిశోధనలు మొదలయ్యాయి. మానవుల్లోని అన్‌కైరిన్– బీ జన్యువును ఎలుకల్లోకి జొప్పించి చూసినప్పుడు అవి కూడా లావెక్కడాన్ని గమనించిన వాన్ ఊబకాయానికి ఇది ఒక కారణమై ఉంటుందన్న అంచనాకు వచ్చారు. ఈ జన్యువు లేకపోతే కణాల్లోకి ప్రవేశించే కొవ్వును నియంత్రించే గ్లట్ 4 అనే ప్రొటీన్ మాయమవుతోందని, అలాగే అన్‌కైరిన్ –బీలో కొన్ని మార్పులు చేస్తే కణాల్లోకి ప్రవేశించే గ్లూకోజ్ గణనీయంగా పెరుగుతున్నట్లు తాము గుర్తించామని వాన్ తెలిపారు. యూరోప్ జనాభాలో 1.4 శాతం మంది, యూరపియన్ అమెరికన్స్‌లో 8.4 శాతం మందిలో ఊబకాయాన్ని కలిగించే అన్‌కైరిన్ – బీ జన్యుమార్పులు ఉన్నాయని వాన్ తెలిపారు. ఈజన్యువును గుర్తించడం వల్ల భవిష్యత్తులో ఊబకాయాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మరింత స్పష్టత వస్తుందని అంచనా. -
ముగ్గురికి జన్మించిన బిడ్డ!
న్యూయార్క్: ప్రపంచంలోనే తొలిసారిగా ముగ్గురి ద్వారా ఓ బాబు జన్మించాడు. వివాదాస్పద సరికొత్త సంతానోత్పత్తి విధానంతో ముగ్గురి నుంచి సేకరించిన డీఎన్ఏ ద్వారా జోర్డాన్ జంటకు జన్మించాడు. బాబు తల్లి లీగ్ సిండ్రోమ్ అనే జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతోంది. దీంతో పుట్టే పిల్లలకు మెదడు, కండరాలు, నాడీ కణాల అభివృద్ధి లోపం ఏర్పడి చనిపోతారు. వారికి పెళ్లయిన పదేళ్ల తర్వాత బిడ్డ పుట్టినా లీగ్ సిండ్రోమ్ ఉండటంతో ఆరేళ్లకు చనిపోయింది. రెండోసారి ఓ బాబు పుట్టినా 8 నెలలకే మరణించాడు. దీంతో ఈ జంట న్యూయార్క్‌కు చెందిన ‘న్యూ హోప్’ ఫెర్టిలిటీ సెంటర్లోని జాన్ జాంగ్‌ను సంప్రదించారు. తల్లి అండం నుంచి కేంద్రకాన్ని తీసుకుని దాత అండంలోకి ప్రవేశపెట్టారు. ఈ అండాన్ని తండ్రి శుక్రకణాలతో ఫలదీకరణం చెందించారు. పిండాన్ని తల్లి అండాశయంలోకి చొప్పించారు. ఈ ఏడాది ఏప్రిల్ 6న జన్మించిన బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. -
గార్డియన్ ఏంజెల్ ... ఆ జన్యువు!
మెడిక్షనరీ ఇక మనం ఒక కొత్త నినాదాన్ని అందుకుందాం. అదే... జీనో రక్షతి రక్షితః. అంటే... అత్యంత ప్రత్యేకమైన ఆ జన్యువును మనం రక్షించుకుంటే క్యాన్సర్ బారి నుంచి అది కాపాడుతుంది. అత్యంత ప్రత్యేకమైన ఆ జన్యువు (జీన్) పేరు రక్షించే దేవత. మానవ దేహంలో ఎన్నో జన్యువులు ఉన్నాయి. మరి ఈ జన్యువుకే ఈ పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే... ఇది మన శరీరంలోని వ్యాధి నిరోధకశక్తిలో క్యాన్సర్ నుంచి ప్రత్యేకమైన రక్షణ ఇస్తుంది. సాధారణంగా పి-53 అని వ్యవహరించే ఈ జన్యువుకు రక్షించే దేవత అని పేరు. జీనోమ్ గార్డియన్ అని కూడా పిలుస్తారు. అయితే ఇంత విలువైన జన్యువును మన చేజేతులారా మనమే దెబ్బతీసుకుంటున్నాం. వేళకు సరిగా భోజనం చేయపోవడం, ఆహారంలో తగినన్ని తాజా ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు తీసుకోకపోవడం, నిత్యం వ్యాయామం చేయకపోవడం, మద్యం, పొగతాగే అలవాటు లాంటి దురలవాట్లు ఉండటం వంటి అనారోగ్యమైన జీవనశైలితో ఈ విలువైన జన్యువును దెబ్బతీసుకుంటున్నాం. అందుకే ఆరోగ్యమైన జీవనశైలిని అనుసరించి, విలువైన ఈ జన్యువును రక్షించుకోవడం అవసరం. -
ఈ జన్యువే ‘మూలం’!
వాషింగ్టన్: శరీరానికి సంబంధించి ఏ రకమైన కణాలుగా అయినా మారగల ‘మూల కణాలు’ అభివృద్ధి చెందేందుకు, అవి రూపొందేందుకు తోడ్పడే జన్యువును అమెరికాకు చెందిన మిషిగన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికోసం మానవ అండం (ఊసైట్)లోని 5 వేలకుపైగా జన్యువులను విశ్లేషించారు. వీటిల్లో ‘ఏఎస్ఎఫ్1ఏ’ అనే జన్యువును కణాలు మరో రకమైన కణాలుగా మారేందుకు (రీప్రోగ్రామింగ్‌కు) తోడ్పడుతాయని గుర్తించారు. ‘ఏఎస్ఎఫ్1ఏ’ జన్యువు ‘ఓసీటీ4’ అనే మరో జన్యువు సహాయంతో కణాల రీప్రోగామింగ్కు కారణమవుతోందని, మూలకణాలు ఎలా అభివృద్ధి చెందుతాయనే అంశాన్ని పరిశీలించడంలో ఇదో పెద్ద ముందడుగని పరిశోధనకు నేతృత్వం వహించిన ఎలీనా గోంజాలెజ్-మునోజ్ తెలిపారు. దీని సాయంతో సాధారణ చర్మకణాలను మూలకణాలుగా ఎలా మార్పు చేయవచ్చనే దానిపై పరిశోధన చేస్తున్నామని పేర్కొన్నారు. -
బ్లడ్ కేన్సర్ జన్యువు దొరికింది!
టొరాంటో: ల్యుకేమియా (బ్లడ్ కేన్సర్) వ్యాప్తికి కారణమవుతున్న ఓ కీలక జన్యువును కెనడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ జన్యువును క్రియారహితం చేయడం ద్వారా బ్లడ్ కేన్సర్‌ను పూర్తిగా అడ్డుకోవచ్చని వారు భావిస్తున్నారు. ల్యుకేమియాకు జన్యుపరమైన చికిత్సపై నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియెల్ శాస్త్రవేత్తలు ‘బీఆర్జీ1’ అనే ఈ జన్యువును గుర్తించారు. బ్లడ్ కేన్సర్ మూలకణాలు విభజన చెందుతూ కణతులను ఏర్పర్చేందుకు ఈ జన్యువే తోడ్పడుతోందని కనుగొన్నారు. ప్రయోగశాలలో జంతువులు, మనుషుల బ్లడ్ కేన్సర్ కణాలపై ప్రయోగంలో.. ఈ జన్యువును అడ్డుకోగా వాటి విభజన పూర్తిగా ఆగిపోయిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ జన్యువు ఆరోగ్యకరమైన రక్తకణాలపై ఎలాంటి ప్రభావం చూపకుండా కేన్సర్ కణాల విభజనను మాత్రమే ప్రేరేపిస్తుంది కాబట్టి.. దీనిని అడ్డుకున్నా ప్రమాదమేమీ ఉండబోదని అంటున్నారు. ప్రస్తుతం కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్సలతో బ్లడ్ కేన్సర్ కణతులను తొలగించడం సాధ్యం అవుతున్నా.. ఈ కణతులను ఏర్పర్చే మూలకణాలను మాత్రం పూర్తిగా నిర్మూలించడం వీలు కావడం లేదు. ఈ నేపథ్యంలో బీఆర్జీ1 జన్యువును అణుస్థాయిలోనే అడ్డుకునే ఔషధాన్ని తయారు చేస్తే గనక.. బ్లడ్ కేన్సర్‌కు శాశ్వత చికిత్స అందుబాటులోకి వచ్చినట్లేనని, తాము ఆ దిశగా ప్రయత్నిస్తున్నామని పరిశోధకులు తెలిపారు.