general transfers of employees
-
40 శాతమే అయితే ఎలా?
సాక్షి, హైదరాబాద్: సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా.. ప్రభుత్వ శాఖలు ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశాయి. ఒకట్రెండు రోజుల్లో శాఖల వారీగా బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు జారీచేసే పనిలో బిజీ అయ్యాయి. వాస్తవానికి ఉద్యోగుల సాధారణ బదిలీలు 2018లో జరిగాయి. ఆ తర్వాత జీఓ 317 కింద జరిగిన కేటాయింపులు, ఎన్నికల సమయంలో జరిగిన బదిలీలు మినహా ఉద్యోగులకు స్థానచలనం కలగలేదు. అయితే తాజాగా ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలపై ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. 40 శాతం మించి ఉద్యోగులకు బదిలీలు చేయొద్దని స్పష్టం చేయడంతో, సుదీర్ఘకాలంగా వేచిచూస్తున్న వారికి తాజా బదిలీలు నిరాశ కలిగిస్తాయనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. సీనియర్లకే అవకాశం... ఒక ఉద్యోగి ఒకస్థానంలో గరిష్టంగా నాలుగేళ్లు దాటితే బదిలీ తప్పనిసరి అనే నిబంధన పెట్టింది. దీంతో వరు సగా నాలుగేళ్లు ఒకేచోట పనిచేస్తే వారు తప్పకుండా బదిలీ కావాల్సి ఉంటుంది. 40 శాతం మించొద్దని చెప్పడంతో తప్పనిసరి బదిలీ కేటగిరీలో ఉన్న చాలామంది ఉద్యోగులకు స్థానచలనం కష్టమని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సాధారణ బదిలీ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర స్థాయి, మలీ్టజోనల్, జోనల్, జిల్లా కేడర్‌లో బదిలీలు జరగనున్నాయి. ఈ క్రమంలో కేడర్ యూనిట్ ప్రకారం బదిలీలకు అర్హులైన ఉద్యోగుల జాబితాను సంబంధిత శాఖలు ప్రకటిస్తాయి. 40 శాతం మాత్రమే బదిలీలకు అవకాశం కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం జిల్లా కేడర్‌లో 10 మంది ఉద్యోగులు ఉంటే అందులో కేవలం నలుగురు మాత్రమే బదిలీకి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో సాధారణ బదిలీలు జరిగి దాదాపు ఆరేళ్లు కావొస్తుంది. దీంతో నాలుగేళ్లు సర్వీసు దాటిన ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పిస్తే పనిచేస్తున్న వారిలో మెజారిటీ శాతం తప్పనిసరి బదిలీ కేటగిరీలో అర్హత సాధించే అవకాశం ఉంది. కానీ 40శాతం మందికి అవకాశం కల్పిస్తే కేవలం కొందరు సీనియర్లకు మాత్రమే స్థానచలనం కలుగుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు ఆర్టర్ టు సర్వ్ ప్రాతిపదికన పలు జిల్లా కార్యాలయాల్లో ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. సాధారణ బదిలీల కోసం వారంతా ఎదురు చూస్తుండగా... ప్రభుత్వ నిబంధన ప్రకారం వీరిలో మెజారిటీ ఉద్యోగులకు తాజా బదిలీల్లో అవకాశం కలగుతుందా? లేదా? వేచి చూడాలి. అయితే 40శాతం నిబంధనను ఎత్తివేయాలనే డిమాండ్ కూడా ఉద్యోగవర్గాల నుంచి వినిపిస్తోంది. ఉద్యోగుల సీనియారిటీ జాబితా, తప్పనిసరి బదిలీల జాబితా వెలువడేందుకు మరో నాలుగైదు రోజుల సమయం పడుతుంది. ఈలోపు ఎంతమందికి బదిలీల్లో అవకాశం కలుగుతుందో స్పష్టత వస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. -
రేపట్నుంచి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ షురూ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు లైన్‌క్లియర్ అయ్యింది. బదిలీలపై ఉన్న నిషేధం ఎత్తివేస్తూ ఈనెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం..ఈ ఏడాది జూన్ 30వ తేదీ నాటికి ఒక ఉద్యోగి కనీసం రెండేళ్లు ఒకేచోట పనిచేసి ఉంటే బదిలీకి అర్హుడు. ఇక నాలుగేళ్లు ఒకే చోట పనిచేసిన ఉద్యోగికి బదిలీ తప్పనిసరి. ప్రత్యేక పరిస్థితి ఉంటే తప్ప నాలుగేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగికి బదిలీ నుంచి మినహాయింపు ఉండ దని, గరిష్టంగా 40%ఉద్యోగులకు మించకుండా బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్పౌజ్ కేటగిరీ, 2025 జూన్ 30వ తేదీ నాటికి పదవీవిరమణ పొందే ఉద్యోగులు, 70 శాతం డిజెబిలిటీ లేదా అంతకంటే ఎక్కువశాతం డిజెబిలిటీ ఉన్న ఉద్యోగులు, మానసిక వైకల్యంతో కూడిన పిల్లలున్న ఉద్యోగులు, వితంతువులు, మెడికల్ గ్రౌండ్స్ ఉన్న ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. బదిలీ ప్రక్రియ ఇలా... బదిలీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు శాఖాధి పతి ప్రభుత్వం ఇచ్చిన బదిలీల ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. – శాఖల వారీగా హెచ్ఓడీ సంబంధిత ఉద్యోగుల సీనియారి టీ జాబితా ప్రచురించాలి. – ఉద్యోగి పనిచేస్తున్న స్థానం, పదవీకాలంతో సహా చెప్పాలి. – శాఖలో ఉన్న ఖాళీల జాబితా కూడా ప్రచురించాలి. – తప్పనిసరి బదిలీ కేటగిరీలో ఉన్న ఉద్యోగుల వివరాలు కూడా ప్రత్యేకంగా ప్రకటించాలి. – బదిలీలకు సంబంధించి 5 ఐచ్చికాలను ఉద్యోగుల నుంచి తీసుకోవాలి. – ప్రభుత్వం ఆప్షన్ పత్రాన్ని ప్రకటించింది. అయితే శాఖాపరంగా ఈ ఆప్షన్ పత్రాన్ని మార్పు చేసుకునే వెసులుబాటు కల్పించింది. – బదిలీల ప్రక్రియతో ప్రతి కార్యాలయంలో కనీస సిబ్బంది ఉండేలా చూడాలి. – అవకాశం ఉన్నచోట ఆన్లైన్, వెబ్ కౌన్సెలింగ్ పద్ధతిలో బదిలీలు చేపట్టాలి. – ప్రభుత్వం జారీ చేసిన బదిలీల విధానానికి అనుగుణంగా విద్య, రెవన్యూ, వైద్య,ఆరోగ్య తదతర శాఖలు కూడా ఉద్యోగులబదిలీలకు పూర్తిస్థాయి మార్గదర్శకాలు జారీ చేస్తాయి. అయితే ప్రభుత్వ అనుమతితో మార్గదర్శకాల్లో సవరణలు కూడా చేసుకోవచ్చు. -
ఏపీ ఉద్యోగుల బదిలీలకు ఉత్తర్వులు
-
ఉద్యోగుల బదిలీలు నేటి నుంచే..
సాక్షి, అమరావతి : ఉద్యోగుల సాధారణ బదిలీలు మంగళవారం నుంచి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ బదిలీలకు అనుమతినివ్వగా.. ప్రస్తుతమున్న నిషేధాన్ని తొలగించారు. తిరిగి వచ్చే నెల 6న నుంచి నిషేధం అమల్లోకి రానుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్ సోమవారం జీవో జారీచేశారు. అయితే, ఇప్పటికే విద్యా సంస్థలు ప్రారంభమైనందున అన్ని రకాల విద్యాశాఖలను బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎటువంటి ఆరోపణలకు, ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఈ బదిలీల ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా జీవోలో ప్రభుత్వం స్పష్టంచేసింది. ఉద్యోగుల రిక్వెస్ట్, పరిపాలనాపరమైన సౌలభ్యం ప్రాతిపదికగా బదిలీలు చేయాలని అందులో పేర్కొన్నారు. అలాగే, ఐదేళ్ల పాటు ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలన్నారు. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న మార్గదర్శకాలు ఇవే.. - ఉద్యోగుల బదిలీల్లో 40 శాతం పైగా అంగవైకల్యం సర్టిఫికెట్ గల వారికి ప్రాధాన్యతనివ్వాలి - ఉద్యోగుల పిల్లలు ఎవరైనా మానసిక వైకల్యంతో ఉంటే అలాంటి ఉద్యోగులను సంబంధిత వైద్య సదుపాయం గల ప్రాంతాలకే బదిలీ చేయాలి - క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి జరిగిన భార్యగాని ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నట్లయితే ఆ వైద్య సదుపాయాలున్న చోటకు మాత్రమే సంబంధిత ఉద్యోగులను బదిలీ చేయాలి. - కారుణ్య నియామకాల్లోని వితంతు ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యతనివ్వాలి. - భార్యభర్తల కేసుల్లో భార్య బదిలీకి ప్రాధాన్యత ఇవ్వాలి. అదీ కూడా గతంలో ఈ సదుపాయం పొందినట్లయితే ఎనిమిదేళ్ల తరువాత మాత్రమే అనుమతించాలి. - బదిలీలన్నీ రిక్వెస్ట్ కింద పరిగణనలోకి తీసుకోవాలి. - పదోన్నతులు పొందిన ఉద్యోగులను బదిలీ చేయాలి. అయితే, బదిలీ చేసేచోట సంబంధిత పోస్టు ఉంటేనే చేయాలి. - తొలుత అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫై చేయాలి. వాటిని భర్తీచేశాకే నాన్ ఐటీడీఏ ప్రాంతాల్లో బదిలీలు చేయాలి. - ఐటీడీఏ ప్రాంతాల్లో పనిచేస్తున్న లోకల్ కేడర్, జోనల్ కేడర్ ఉద్యోగులను రెండేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులను సీనియారిటీ ప్రాతిపదికన బదిలీలకు ప్రాధాన్యతనివ్వాలి. - ఐటీడీఏ ప్రాంతాల్లో పోస్టింగ్‌లకు ఉద్యోగులు 50 ఏళ్లలోపు వయస్సు గలవారై ఉండాలి. అలాగే, గతంలో ఐటీడీఏలో పనిచేయని వారై ఉండాలి. - ఐటీడీఏ పరిధిలోని మారుమూల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఖాళీలున్నాయి. వీటిని బదిలీల ద్వారా భర్తీచేయడానికి సంబంధిత శాఖాధిపతులు, కలెక్టర్లు ప్రాధాన్యత ఇవ్వాలి. - అన్ని బదిలీలు సంబంధిత అథారిటీ ఆదేశాలు, నిబంధనల మేరకు జరగాలి. - బదిలీ ప్రక్రియకు సంబంధిత శాఖాధిపతి బాధ్యత వహించాలి. ఎటువంటి ఆరోపణలు, ఫిర్యాదులు లేకుండా నిబంధనలను ఉల్లంఘించకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలి. - రెవెన్యూ, ఇతర ఆర్జిత శాఖలైన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణా, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలు కూడా ఆయా శాఖల మార్గదర్శకాల మేరకు వచ్చే నెల 5లోగా బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలి. - వ్యవసాయ శాఖలో బదిలీలను మాత్రం ఆయా శాఖలకు అనుగుణంగా నిర్వహించుకోవచ్చు. - స్కూలు విద్య, ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య, సంక్షేమ శాఖల విద్యా సంస్థలన్నింటిలో బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇప్పటికే విద్యా సంస్థలు ప్రారంభమైనందున వీటిల్లో బదిలీలకు అవకాశం ఇవ్వలేదు. వీరిని బదిలీ చేయరాదు.. - వచ్చే ఏడాది మార్చి 31లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులు.. అలాగే, గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల్లో పనిచేస్తున్న వారికీ బదిలీల నుంచి మినహాయింపు ఉంది. - కంటిచూపు లేని ఉద్యోగులు ప్రత్యేకంగా వారు బదిలీకి రిక్వెస్ట్ చేస్తే తప్ప వారిని బదిలీ చేయరాదు. వారు కోరిన చోట స్పష్టమైన ఖాళీ ఉంటేనే బదిలీ చేయాలి. - ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులతో పాటు ఇతర శాఖాపరమైన ఆరోపణలున్న వారిని కూడా. -
‘రెవెన్యూ’లో కుదుపు
సాక్షి, విశాఖపట్నం : రెవెన్యూలో కుదుపు మొదలైంది. ఇన్నాళ్లు వాయిదాలమీద వాయిదాలు పడుతూ వస్తున్న వీరి బదిలీలకు ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి లోగా వీరి బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. జీవోఎంఎస్-98 పేరి ట జారీ చేసిన ఈ ఉత్తర్వు ప్ర కారం బదిలీ ప్రక్రియ పూర్తిగా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో చేయాల్సి ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉద్యోగుల సాధారణ బదిలీలు నా లుగు నెలలుగా సాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ హయాం లో పనిచేసిన రాష్ర్ట స్థాయి అధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు ప్రతీ ఒక్కరికి స్థానచలనం కల్పించాలన్న ఏకైక లక్ష్యంతో జారీ చేసిన జీవో-57 వివాదస్పదం కావడం.. ఇన్చార్జి మంత్రుల పర్యవేక్షణలో చేయాలన్న ఈ బదిలీల ప్రక్రియపై హైకోర్టు స్టే ఇవ్వడంతో బదిలీలకు ఆదిలోనే బ్రేకు లు పడ్డాయి. దీంతో ఇన్చార్జి మంత్రితో సంబంధం లేకుండా శాఖాధిపతుల పర్యవేక్షణలోనే బదిలీలు చేయొచ్చంటూ మలి ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ ఆగస్టు-1 నుంచి 15వ తేదీ బదిలీలకు గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చింది. శాఖల వారీగా ైగైడ్‌లైన్స్ కూడా జారీ చేసింది. కానీ రెవెన్యూ శాఖను మాత్రం ఈ బదిలీల నుంచి మినహాయించింది. మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం, క్షేత్ర స్థాయిలో సర్వే, గ్రామస్థాయిలో గ్రామసభల నిర్వహణ వంటి బాధ్యతలు రెవెన్యూ అధికారులపై ఉండడంతో వీరిని గత నెల బదిలీల నుంచి మినహాయింపునిచ్చారు. ఆగస్టు 31తో మీ ఇంటికి మీ భూమికి గ్రామసభలు పూర్తి కావడంతో ఇక ఈ శాఖలో కూడా బదిలీలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్-15వ తేదీ అర్ధరాత్రిలోగా ఈ బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. తొలుత జారీచేసిన జీవో-57 ప్రకారం మూడేళ్ల సర్వీసు పూర్తయిన అధికారులు, సిబ్బంది వారీగా అర్హుల జాబితాలను జూన్ లోనే సిద్ధంచేశారు. ఈ విధంగా జిల్లా రెవెన్యూ శాఖలో 1445 మంది సిబ్బంది ఉండగా, వీరిలో 659 మంది బదిలీలకు అర్హులని లెక్కతేల్చారు. ముఖ్యంగా ఏళ్ల తరబడి పాతుకు పోయిన వీఆర్వోలకు స్థానచలనం కల్పించేందుకు జూలైలోనే ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. సుమారు 470 మంది ఈ కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. వీరికి పోస్టింగ్‌లు ఇవ్వడమే తరువాయి.. ఈసమయంలో హైకోర్టు స్టే ఇవ్వడంతో ఉత్తర్వులు ఇవ్వకుండా నిలుపుదల చేశారు. ప్రస్తుతం వీరందరికి పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉంది. మరో పక్క పరిపాలనా సౌలభ్యం పేరిట ఇటీవలే పదిమంది తహశీల్దార్లకు కలెక్టర్ స్థానచలనం కల్పించారు. తాజా బదిలీల్లో సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, సెక్షన్ సూపరింటెండెంట్లు, డిప్యూటీ తహశీల్దార్లతో సహా 189 మందికి స్థానచలనం కల్పించే అవకాశాలున్నాయి. రాష్ర్ట స్థాయి గురుపూజోత్సవం, నేషనల్ అథ్లెటిక్స్ మీట్ పూర్తయిన తర్వాత ఈ బదిలీలపై జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
ఇక బదిలీలు
పాత మార్గదర్శకాల ప్రకారమే కసరత్తు ముఖ్యమంత్రి వద్ద ఫైలు,స్వచ్ఛ హైదరాబాద్ తర్వాత ఉత్తర్వులు రెండేళ్ల సర్వీసు నిండితేనే బదిలీకి అర్హులు ఐదేళ్లు ఒకేచోట ఉంటే నిర్బంధ బదిలీ 20 రోజులపాటు కౌన్సెలింగ్‌కు అవకాశం ఉపాధ్యాయుల బదిలీ, {పమోషన్లు, హేతుబద్ధీకరణ కూడా సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైంది. గతంలో ఉన్న మార్గదర్శకాల ప్రకారమే ఈ ప్రక్రియను చేపట్టేందుకు ఆర్థిక శాఖ కసరత్తును పూర్తి చేసింది. సంబంధిత ఫైలును ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించింది. ప్రస్తుతం బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంతోపాటు తాజా బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా అందులో పొందుపరచింది. దీన్ని ముఖ్యమంత్రి ఆమోదించిన తర్వాత ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుతం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు బిజీగా ఉన్నందున.. గురువారం ఆ కార్యక్రమం ముగిసిన తర్వాతే ఫైలు ముందుకు కదులుతుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. ఉద్యోగుల సాధారణ మిగతా 2వ పేజీలో ఠ బదిలీలకు ఏపీ సర్కారు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఉద్యోగుల్లోనూ ఇదే అంశం చర్చనీయాంశమైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013 మేలో దాదాపు అన్ని విభాగాల్లో సాధారణ బదిలీలు జరిగాయి. ఆ తర్వాత బదిలీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. సాధారణంగా ప్రతి ఏడాది మే నెలలో సాధారణ బదిలీలకు సర్కారు వెసులుబాటు కల్పిస్తుంది. కానీ గత ఏడాది తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన పరిణామాలతో ఈ ప్రక్రియను చేపట్టలేదు. దీంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని విభాగాల ఉద్యోగుల నుంచి బదిలీలకు సంబంధించిన విజ్ఞప్తులు, దరఖాస్తులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. అధికారవర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఈసారి బదిలీలకూ గతంలో ఉన్న నిబంధనలనే పాటిస్తారు. 20 శాతం మించకుండా బదిలీలు కమలనాథన్ కమిటీ పరిధిలో ఉన్న రాష్ట్ర కేడర్, మల్టీ జోనల్ పోస్టులు మినహా.. మిగతా కేడర్ ఉద్యోగులకు సాధారణ బదిలీలతో చిక్కులేమీ ఉండవని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. నిషేధం ఎత్తివేత ఉత్తర్వులు వెలువడ్డాక 20 రోజుల పాటు బదిలీలకు అవకాశం కల్పిస్తారు. పైరవీలు, రాజకీయ జోక్యానికి అవకాశం లేకుండా అన్ని విభాగాల్లో కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు చేపడుతారు. రెండేళ్ల కనీస సర్వీసు ఉన్న ఉద్యోగులే బదిలీలకు అర్హులవుతారు. ఐదేళ్లు ఒకేచోట పని చేసిన ఉద్యోగులను నిర్బంధంగా బదిలీ చేస్తారు. బదిలీ కోరుకునే ప్రతి ఉద్యోగి మూడు ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు సీనియారిటీ జాబితాల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అంగవైకల్యం ఉన్న వారు, భార్యాభర్తలు, ఆరోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కో కేటగిరీలో 20 శాతం మించకుండా ఉద్యోగుల బదిలీలు ఉండాలనే నిబంధనను పాటిస్తారు. వీటికి తోడు పట్టణ ప్రాంతాలు, ప్రాధాన్యత ఉన్న ఫోకల్ ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగులను నాన్ ఫోకల్‌కు బదిలీ చేస్తారు. మారుమూల ప్రాంతాల్లో లాంగ్ స్టాండింగ్‌గా ఉన్న వారికి న్యాయం జరిగేలా గతంలో ఉన్న మార్గదర్శకాలను పక్కాగా అమలు చేస్తారు. మరోవైపు విద్యా శాఖ సిద్ధం చేసిన ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు సంబంధించిన ఫైళ్లు కూడా సీఎం దగ్గరే పెండింగ్‌లో ఉన్నాయి. సాధారణ బదిలీల ఫైలుతోపాటు వీటికి సైతం మోక్షం లభిస్తుందని ఉపాధ్యాయ సంఘాలు ఎదురుచూస్తున్నాయి.