Geneva Motor Show
-
అత్యంత ఖరీదైన లగ్జరీ కారు..ఇది ఎవరికి సొంతం?
ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణంచే కార్లలో ఒకటైన బుగాటి ఒక కొత్త లగ్జరీ కారును లాంచ్ చేసింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారుగా పేరొందిన ఈ కారు ధర సుమారు రూ. 88కోట్లు (12.47మిలియన్ల డాలర్లు). 2019 జెనీవా మెటార్ షోలో బుగాటి ‘లా వోయర్ నోయర్’ పేరుతో దీన్ని ఆవిష్కరించింది. 16 సిలిండర్ ఇంజీన్‌తో ఎలిగెంట్లుక్లో ఆకట్టుకుంటున్న ఈ ఖరీదైన కారును జర్మనీకారు మేకర్ ఫోక్స్ వ్యాగన్ మాజీ ఛైర్మన్ ఫెర్డినాండ్ పీచ్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. -
ఫ్యూచర్ కోసం.. ఫీచర్ కార్లు
కొత్త కారు మార్కెట్లోకి వచ్చిందంటే చాలు.. దాంట్లో ఏయే ఫీచర్లు ఉన్నాయి? మైలేజీ బాగుంటుందా? ఇంటీరియర్ ఎలా ఉంది అనే విషయాలను మనం ఆసక్తిగా గమనిస్తాం. టెక్నాలజీ రోజు రోజుకూ మారిపోతున్న ఈ తరుణంలో భవిష్యత్తులో వచ్చే అవకాశమున్న కార్ల గురించి మరీ ఎక్కువ ఆసక్తి ఉండటం సహజం. మరి.. ఒకేచోట కొన్ని పదుల సంఖ్యలో కొత్త కార్లు కొలువుదీరితే...? అబ్బో సూపర్ అంటున్నారా? నిజమే. ఇటీవలే ముగిసిన జెనీవా మోటర్ షోలో జరిగింది ఇదే. ఇక్కడ ప్రదర్శించిన కొన్ని కార్లు, వాహనాల వివరాలను ఇప్పటికీ కొన్నిసార్లు ముచ్చటించుకున్నప్పటికీ మరికొన్ని ఫ్యూచర్కార్ల గురించి స్థూలంగా. స్కిల్లా : ఇటలీకి చెందిన రవాణా వాహనాల డిజైనింగ్ సంస్థకు చెందిన 16 మంది విద్యార్థులు సిద్ధం చేసిన కాన్సెప్ట్ కారు ఇది. వీరిలో ఐదుగురు భారతీయ విద్యార్థులూ ఉండటం విశేషం. 2030 నాటికల్లా ఇలాంటి కారును మార్కెట్లోకి తీసుకురావాలన్నది కంపెనీ లక్ష్యం. అయితే ఇందులో కేవలం ఇద్దరు మాత్రం ప్రయాణించగలరు. పూర్తిగా విద్యుత్తుతోనే నడుస్తుంది. బ్రష్‌లెస్ ఎలక్ట్రిక్ మోటర్ల సాయంతో నడవడం వల్ల అతితక్కువ విద్యుత్తుతో ఎక్కువ దూరం ప్రయాణించగలదు. ఐ–ట్రిల్ : టయోటా కంపెనీ అభివృద్ధి చేస్తున్న కాన్సెప్ట్ కారు ఇది. టాటా నానో కారును పోలిన డిజైన్ ఉన్నప్పటికీ ఎన్నో శక్తిమంతమైన ఫీచర్లు ఉన్నాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 250 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. ఈ మూడు చక్రాల వాహనంలో ముగ్గురు ప్రయాణించవచ్చు. వెనుకవైపున ఉన్న రెండు చక్రాలు... వంపులకు అనుగుణంగా పైకి, కిందకు కూడా కదులుతాయి. తద్వారా ఒకపక్కకు ఒరిగిపోయే అవకాశాలు ఏమాత్రం ఉండవు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
న్యూ స్టైల్ లో సుజుకీ 2017 స్విఫ్ట్
జెనీవా : జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ మోటార్ కార్పొరేషన్ తన పాపులర్ హ్యాచ్ బ్యాక్ స్విఫ్ట్ లో కొత్త వెర్షన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చేసింది. స్విట్జర్లాండ్ వేదికగా జరుగుతున్న జెనీవా మోటార్ షో 2017 ప్రీమియర్స్ లో తన 3వ తరం సిఫ్ట్ కారును బుధవారం లాంచ్ చేసింది. భారత రోడ్లపై ఈ కారు 2018 మొదట్లో చక్కర్లు కొట్టనుందని కంపెనీ కన్ ఫామ్ చేసింది. యూరోప్ లో ఈ కారు వచ్చే నెలలో అమ్మకానికి రానుంది. జపాన్ లోని సుజుకీ సగారా ప్లాంట్‌లో ఉత్పత్తి చేసిన ఈ కారు ఎక్కువగా యూరోపియన్ స్పెషిఫికేషన్స్ కలిగిఉంది. ఈ కొత్త తరం స్విఫ్ట్ అంతర్గతంగా వైఎస్‌డీ కోడ్ నేమ్ ను కలిగి, హియర్టెట్ అనే కొత్త ప్లాట్ ఫామ్‌పై రూపొందించారు. హియర్టెట్ ప్లాట్ ఫామ్ కు, బాలెనో, ఇగ్నిస్ లు రూపొందించిన ప్లాట్ ఫామ్ లకు ఎలాంటి పోలిక ఉండదు. అంతా కొత్తదనాన్ని ఈ ప్లాట్ ఫామ్ కల్పిస్తోంది. పూర్తిగా కొత్త స్టైల్ లో వచ్చిన ఈ కారు, లుక్ లోనూ ముందున్న వాటికంటే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. హియర్టెడ్ ఆర్చిటెక్చర్ చాలా తేలికగా, ధృడంగా, సాఫ్ట్ డిజైన్ లో ఉంటుంది. ఈ ధృడమైన ప్లాట్ ఫామ్ వెహికిల్ సేఫ్టీగా ఉండేలా చేస్తే, తేలికతనం హ్యాండిల్ చేయడానికి సులువుగా ఉంటుంది. ఈ కొత్త కారు బరువు 840 కేజీలే. ప్రస్తుతమున్న మోడల్ కంటే 120 కేజీలు తక్కువగానే ఉండేలా రూపొందించామని కంపెనీ చెప్పింది. యువ వినియోగదారులను ఉద్దేశించి రూపొందించిన సుజుకీ స్విఫ్ట్ 2017 స్మార్ట్ సేఫ్టీ టెక్నాలజీని కంపెనీ దీనిలో పొందుపరిచింది. ప్రస్తుతమున్న వెర్షన్ కంటే 4 శాతం ఎక్కువ ప్యూయల్ సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది. 1.3 లీటర్ మల్టిజెట్ ఇంజిన్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో ఇది రూపొందింది. ఆటోమేటెడ్ యాన్యువల్ ట్రాన్స్ మిషన్ ను ఇది కలిగిఉంది. -
కొత్తకొత్త కార్లతో కనువిందుచేస్తున్న ఆటో షో
లగ్జరీ కార్ల నుంచి క్రాస్ ఓవర్ వెహికిల్స్ వరకు జిల్ జిగేల్ అనిపిస్తూ 87వ అంతర్జాతీయ జెనీవా ఆటో షో ప్రీమియర్స్ స్విట్జర్లాండ్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. చిన్న కార్ డిజైనర్లు, పెద్ద పెద్ద కార్ల తయారీదారులు ఈ ప్రీమియర్ ఆటో షోలో తమ వాహనాలను ప్రదర్శనకు ఉంచారు. ప్రపంచంలోనే ఎంతో అత్యుత్తమ ఆటో ఎగ్జిబిషన్ గా పేరుతెచ్చుకున్న ఈ షో, యూరోపియన్ బ్రాండులకు ఎంతో ప్రతిష్టాత్మకం. మార్చి 9 నుంచి మార్చి 19 మధ్యలో ఈ ఆటో షో అధికారికంగా నిర్వహిస్తారు. బ్రెగ్జిట్, అమెరికాలో ట్రేడ్ పాలసీలో మార్పులు వంటి ఎన్నో ప్రతికూలాంశాలను ఆటో ఇండస్ట్రి ఎదుర్కొంటున్నప్పటికీ కొత్త కొత్త వెహికిల్స్ ప్రదర్శనలో ఇసుమింతమైన వెనుకంజ వేయలేదు. జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ తన రేంజ్ రోవర్ వెలార్ ను మంగళవారం ప్రదర్శనకు ఉంచింది. ఫోక్స్ వాగన్ సైతం తన కొత్త సెల్ఫీ డ్రైవింగ్ కాన్సెఫ్ట్ కారును ఈ ప్రీమియర్ షోలో రివీల్ చేసింది. సెడ్రిక్ ను ప్రదర్శనకు పెట్టింది. ఎలాంటి స్టీరింగ్ వీల్స్, పెడల్స్ లేని ఈ కారుకు డ్రైవర్ అవసరం ఉండదు. ఆడీ, బెంట్లీ, స్కోడా వంటి గ్లోబల్ బ్రాండులకు పోటీగా వివిధ వెర్షన్లలో ఈ కారును ప్రవేశపెట్టాలని ఫోక్స్ వాగన్ ప్లాన్ వేస్తోంది. ఫోక్స్ వాగన్, జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కార్లతో పాటు పలు అంతర్జాతీయ బ్రాండులు ఈ ప్రీమియర్ షోలో అదరగొడుతున్నాయి. ఈ ఆటో షోకు పలు ప్రఖ్యాత అంతర్జాతీయ ఆటో కంపెనీల ప్రతినిధులతో పాటు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ హాజరయ్యారు. టామో సబ్-బ్రాండులో టాటాల తొలి కారు తెల్లటి రంగులో ఆహుతులను ఆకట్టుకుంటోంది.