న్యూ స్టైల్ లో సుజుకీ 2017 స్విఫ్ట్
న్యూ స్టైల్ లో సుజుకీ 2017 స్విఫ్ట్
Published Wed, Mar 8 2017 12:54 PM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM
జెనీవా : జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ మోటార్ కార్పొరేషన్ తన పాపులర్ హ్యాచ్ బ్యాక్ స్విఫ్ట్ లో కొత్త వెర్షన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చేసింది. స్విట్జర్లాండ్ వేదికగా జరుగుతున్న జెనీవా మోటార్ షో 2017 ప్రీమియర్స్ లో తన 3వ తరం సిఫ్ట్ కారును బుధవారం లాంచ్ చేసింది. భారత రోడ్లపై ఈ కారు 2018 మొదట్లో చక్కర్లు కొట్టనుందని కంపెనీ కన్ ఫామ్ చేసింది. యూరోప్ లో ఈ కారు వచ్చే నెలలో అమ్మకానికి రానుంది. జపాన్ లోని సుజుకీ సగారా ప్లాంట్లో ఉత్పత్తి చేసిన ఈ కారు ఎక్కువగా యూరోపియన్ స్పెషిఫికేషన్స్ కలిగిఉంది. ఈ కొత్త తరం స్విఫ్ట్ అంతర్గతంగా వైఎస్డీ కోడ్ నేమ్ ను కలిగి, హియర్టెట్ అనే కొత్త ప్లాట్ ఫామ్పై రూపొందించారు.
హియర్టెట్ ప్లాట్ ఫామ్ కు, బాలెనో, ఇగ్నిస్ లు రూపొందించిన ప్లాట్ ఫామ్ లకు ఎలాంటి పోలిక ఉండదు. అంతా కొత్తదనాన్ని ఈ ప్లాట్ ఫామ్ కల్పిస్తోంది. పూర్తిగా కొత్త స్టైల్ లో వచ్చిన ఈ కారు, లుక్ లోనూ ముందున్న వాటికంటే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. హియర్టెడ్ ఆర్చిటెక్చర్ చాలా తేలికగా, ధృడంగా, సాఫ్ట్ డిజైన్ లో ఉంటుంది. ఈ ధృడమైన ప్లాట్ ఫామ్ వెహికిల్ సేఫ్టీగా ఉండేలా చేస్తే, తేలికతనం హ్యాండిల్ చేయడానికి సులువుగా ఉంటుంది. ఈ కొత్త కారు బరువు 840 కేజీలే. ప్రస్తుతమున్న మోడల్ కంటే 120 కేజీలు తక్కువగానే ఉండేలా రూపొందించామని కంపెనీ చెప్పింది. యువ వినియోగదారులను ఉద్దేశించి రూపొందించిన సుజుకీ స్విఫ్ట్ 2017 స్మార్ట్ సేఫ్టీ టెక్నాలజీని కంపెనీ దీనిలో పొందుపరిచింది. ప్రస్తుతమున్న వెర్షన్ కంటే 4 శాతం ఎక్కువ ప్యూయల్ సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది. 1.3 లీటర్ మల్టిజెట్ ఇంజిన్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో ఇది రూపొందింది. ఆటోమేటెడ్ యాన్యువల్ ట్రాన్స్ మిషన్ ను ఇది కలిగిఉంది.
Advertisement