Geoff Lawson
-
'కోహ్లి.. నీ ప్రవర్తన మార్చుకో'
సిడ్నీ:క్రికెట్ ఫీల్డ్‌లో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రవర్తించే తీరు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు జెఫ్ లాసన్కు నచ్చలేదట. ప్రధానంగా తమతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కోహ్లి ప్రవర్తన తన ఆశ్చర్యానికి గురి చేస్తుందని లాసన్ పేర్కొన్నాడు. ఈ మేరకు విరాట్ తన ప్రవర్తనను మార్చుకోవాల్సిన అవసరం ఉందంటూ విమర్శలు గుప్పించాడు. 'ఒక జట్టు కెప్టెన్‌గా విరాట్ పై చాలా బాధ్యత ఉంది. ఆ రకంగానే విరాట్ ముందుకు వెళితే మంచిది. ప్రస్తుతం నువ్వు ప్రవర్తిస్తున్న తీరు 'చెత్త' ఆటగాడి అప్రథను మోసుకోస్తుంది. నీ ప్రవర్తనను మెరుగుపరుచుకో' అని లాసన్ హితబోధ చేశాడు. ఈ సందర్భంగా బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో చోటు చేసుకున్న విషయాల్ని లాసన్ ప్రస్తావించాడు. 'బెంగళూరు టెస్టులో విరాట్ కోహ్లి ప్రవర్తన అనుచితంగా ఉంది. ఆసీస్ క్రికెటర్ల పట్ల చెడుగా ప్రవర్తించాడు. అతని భాష బాలేదు. రెండో టెస్టులో విరాట్ తన ప్రవర్తనతో కెమెరాకు చిక్కినా అతనిపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆసీస్ క్రికెటర్లు ఫీల్డ్ ను విడిచి వెళ్లే క్రమంలో కోహ్లి వారికి సెండాఫ్ తీరు చెప్పే తీరు బాలేదు. దీనిపై ఆన్ ఫీల్డ్ అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు కూడా పట్టించుకోలేదు. ఈ తరహా ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు' అని లాసన్ పేర్కొన్నాడు. దాంతో పాటు ప్రెస్ కాన్ఫరెన్స్‌ల్లో మాట్లాడేటప్పుడు కూడా కోహ్లి మర్యాదను పాటిస్తే మంచిదన్నాడు. ఒక క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న విరాట్ హుందాగా వ్యవరిస్తే మంచిదన్నాడు. -
'హంతక ముఠాతో క్రికెటర్ కు సంబంధాలు'
ట్రినిడాడ్: ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జెఫ్ లాసన్ పై వెస్టిండీస్ ఆల్‌రౌండర్ మార్లొన్ శామ్యూల్స్ పరువునష్టం దావా వేశాడు. తన గురించి లాసన్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడని శామ్యూల్స్ ఆరోపించాడు. జమైకాలోని హంతకుల ముఠాతో శామ్యూల్స్ కు సంబంధాలు ఉన్నాయని రేడియో కామెంటరీలో లాసన్ వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోజు అతడీ వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్ రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలవడంలో శామ్యూల్స్ కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4న 'బిగ్ స్పోర్ట్స్ బ్రేక్ ఫాస్ట్' రేడియో కార్యక్రమంలో లాసన్ మాట్లాడుతూ... 'వెస్టిండీస్ లోని చీకటి వ్యక్తులతో శామ్యూల్స్ కు సంబంధాలున్నాయి. అతడి వెనుక ఎవరున్నారో మీకు తెలియదు. ప్రపంచంలోని హత్యల రాజధానిగా పేరు పొందిన వాటిలో ఒకటైన జమైకాలోని కింగ్ స్టన్ నుంచి అతడు వచ్చాడు. అక్కడి హంత ముఠాలతో అతడికి సంబంధాలున్నాయ'ని అన్నాడు. లాసన్ వ్యాఖ్యలు తనను అవమానించేలా ఉన్నాయని పేర్కొంటూ శామ్యూల్స్ పరువునష్టం దావా వేశాడు. లాసన్ కామెంట్స్ న్యాయవిరుద్దంగా ఉండడమే కాకుండా, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని తన పిటిషన్ లో పేర్కొన్నాడు. జర్నలిస్ట్ జేమ్స్ మాథహె పేరు కూడా దావాలో చేర్చాడు. -
'విరాట్‌కు బౌలింగ్ చేయడాన్ని ఇష్టపడను'
ముంబై: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి బౌలింగ్ చేయడానికి తాను ఇష్టపడనని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ బౌలర్ జెఫ్ లాసన్ స్పష్టం చేశాడు. విరాట్‌లో సామర్థ్యం, టెక్నిక్ అమోఘమని కొనియాడిన లాసన్.. ఐపీఎల్లో అతనికి బౌలింగ్ చేయాలనే ఆసక్తి తనకు ఎంతమాత్రం లేదని తెలిపాడు. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న జెఫ్ లాసన్ విరాట్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు. నిస్సందేహంగా ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు విరాటేనని కొనియాడాడు. 'ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు విరాట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. 2011-12లో ఆస్ట్రేలియా టూర్‌కు భారత జట్టు వచ్చినప్పుడు విరాట్ ఆటను చూశాను. ఆస్ట్రేలియా వంటి బౌన్సీ వికెట్లపై ఆడే సత్తా ఉన్నా అతికొద్ది మంది భారత ఆటగాళ్లలో విరాట్ ఒకడు. కొన్ని సందర్భాల్లో సచిన్ వంటి దిగ్గజ ఆటగాడే బౌన్సీ వికెట్ పై ఆడటానికి ఇబ్బంది పడేవాడు. అటువంటిది ఆ తరహా పిచ్ లను కోహ్లి ఒక సవాల్‌గా స్వీకరించేవాడు. అయితే విరాట్ ఇంకా ప్రపంచం నలుమూలలా రాణించి సత్తా చాటాల్సి అవసరం ఉంది' అని జెఫ్ లాసన్ తెలిపాడు. -
'వారికంటే టీమిండియానే బలమైన ప్రత్యర్థి'
పెర్త్: గతేడాది చివర్లో న్యూజిలాండ్, వెస్టిండీస్‌లపై ఘనవిజయాలు సాధించిన ఆస్ట్రేలియాకు మరో రెండు రోజుల్లో టీమిండియాతో ప్రారంభం కాబోయే వన్డే సిరీస్ ద్వారా అసలైన పోటీ ఉంటుందని మాజీ పేస్ బౌలర్ జెఫ్ లాసన్ స్పష్టం చేశాడు. కివీస్, విండీస్లపై ఆస్ట్రేలియా సాధించిన విజయాల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదని.. ధోని సేన నేతృత్వంలోని టీమిండియాను ఎదుర్కోవడం ఆస్ట్రేలియాకు నిజమైన సవాల్ అని లాసన్ అభివర్ణించాడు. ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరిగే ఐదు వన్డేల సిరీస్ లో టీమిండియా మరింత ప్రమాదకారి అని తెలిపాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఆసీస్ సాధించింది చెప్పుకోదగ్గ ఘనత కాదని, అలాగే ప్రాభవం కోల్పోయిన విండీస్ ను ఓడించడం కూడా స్మిత్ సేన పూర్తి సామర్థ్యం కిందకు రాదన్నాడు. సమవుజ్జీగా ఉన్న టీమిండియాను ఓడించడం అంత సులువు కాదన్న సంగతి ఆసీస్ ముందుగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నాడు. అప్పటికప్పుడు వచ్చిన విజయాలను చూసి మురిసిపోవడం ఆసీస్ కు అంత మంచికాదన్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ తాత్కాలిక ప్రయోజనాలకు పెద్ద పీఠ వేయడం మానుకుని సుదీర్ఘమైన ప్రణాళికలతో ముందుకువెళ్లాలని లాసెన్ సూచించాడు. ఇప్పట్నుంచే 16 నుంచి 20 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగలిగితే 2019 వరల్డ్ కప్ నాటికి ఆసీస్ పూర్తిస్థాయిలో బరిలోకి దిగడానికి అవకాశం ఉంటుందన్నాడు.